జయ్ షా ఐసీసీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. డిసెంబర్ నుండి ఆయన ఈ బాధ్యతను స్వీకరించనున్నారు. ప్రస్తుతం, ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే సేవలందిస్తున్నారు. జయ్ షా వచ్చే డిసెంబర్ నుంచి ఈ పదవిలో రెండేళ్ల పాటు పనిచేయనున్నారు.
ఐసీసీ ఛైర్మన్గా జయ్ షా నియామకంతో, అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు కొత్త దశ ప్రారంభమవుతుంది. ఆయన క్రికెట్ పరిరక్షణ, అభివృద్ధి, మరియు గ్లోబల్ వేదికపై క్రికెట్ ప్రాచుర్యం పెంపొందించేందుకు లక్ష్యంగా పని చేయనున్నాడు. ప్రస్తుతం జయ్ షా, బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) సెక్రటరీగా తన సేవలను అందిస్తున్నాడు.
ఐసీసీ చైర్మన్ గా నియమితులైన అతి పిన్న వయస్కుడిగా జయ్ షా (35) నిలిచారు. భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన ఐదవ వ్యక్తి జయ్ షా. గతంలో జగ్మోహన్ దాల్మియా (1997-200), శరద్ పవర్ (2010-2012), ఎన్ శ్రీనివాసన్ (2014- 2015), శశాంక్ మనోహర్ రెండుసార్లు ( 2015-2017, 2018-2020) ఐసీసీ చైర్మన్లు గా పనిచేశారు