హైదరాబాద్ లోని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయబడిన తర్వాత హైడ్రా చర్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగార్జున ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.. “న కన్వెన్షన్ స్థలంలో ఎలాంటి కబ్జాలు లేవు, అది పూర్తిగా పట్టా భూమిలో నిర్మించిన ప్రాపర్టీ” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న అంశం కూడా..
తాజాగా, నాగ చైతన్య హిమాయత్ నగర్ లో ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మీడియా ఆయన్ను ఎన్ కన్వెన్షన్ గురించి అడగగా “మా నాన్న నాగార్జున గారు ఈ సంఘటన గురించి సమగ్రంగా వివరాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇది ఆ విషయాలకు సమయం కాదు, ఊహాగానాలను, పుకార్లను నమ్మకండి అని నేను కోరుతున్నాను” అని నాగ చైతన్య తెలిపారు.
అలాగే, నాగ చైతన్య మరియు శోభితా ఆగష్టు 8న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం త్వరలో జరగనున్నట్లు సమాచారం. మంచి కథ దొరికితే శోభితతో నటిస్తాను అని నాగ చైతన్య అన్నారు.