• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి’

KRNL: క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేస్తూ పోటీల్లో సత్తా చాటాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో శాప్ లీగ్ ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సీఈవో రమణ, తదితరులు పాల్గొన్నారు.

April 23, 2026 / 12:00 PM IST

కంభంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కంభంలోని కాపవీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

April 23, 2026 / 11:44 AM IST

నోయిడా కార్మికులకు మద్దతుగా ఆందోళన

VSP: నోయిడాలో కనీస వేతనాల అమలుకు పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా గురువారం ఇసుకతోట జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జి.వామనమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం కార్మికులపై నిర్బంధాలు, కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు అమలు చేయాలని కోరారు.

April 23, 2026 / 11:36 AM IST

కత్తిపోట్లకు దారితీసిన చిన్నపిల్లల గొడవ

కృష్ణా: గుడ్లవల్లేరు(M) అంగలూరులో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్దల వరకు చేరి కిరాతక దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కొందరు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 23, 2026 / 11:35 AM IST

‘రాజమండ్రిలో ‘ఆత్మకథ కవికి’ అవమానం?’

E.G: 20వ శతాబ్దాపు ప్రముఖ తెలుగు రచయిత, “ఆత్మకథ ” సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి నేడు. ఈయన 1891 ఏప్రిల్ 23న తూ.గో జిల్లా అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆయన విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో స్థానికులు పెదవి విరుస్తున్నారు. చారిత్రాత్మక, కళల నిలయమైన నగరంలో చెప్పుకొనే కవికి అవమాన జరిగిందని వాపోతున్నారు.

April 23, 2026 / 11:30 AM IST

హసనాబాద్‌లో తోకల లక్ష్మీనారాయణకు నివాళి

PLD: క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో ఇటీవల మృతిచెందిన తోకల లక్ష్మీనారాయణ చిత్రపటానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి యర్రంశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

April 23, 2026 / 11:30 AM IST

ప్రయాణికులకు అసౌకర్యాలు కలగొద్దు: పూల నాగరాజు

ATP: జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు కడప డిపోను సందర్శించారు. నూతనంగా నిర్మించిన కార్యాలయాలను పరిశీలించిన ఆయన కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. బస్సుల బ్రేక్ డౌన్ సమస్యలపై ఆరా తీసి తగిన సూచనలు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

April 23, 2026 / 11:30 AM IST

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కలెక్టర్

KRNL: కర్నూలు నగరంలో ‘నషా ముక్త్ భారత్’ అవగాహనలో భాగంగా రాజవిహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన వాకథాన్‌ను ఇవాళ కలెక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మంచి అలవాట్లతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు.

April 23, 2026 / 11:30 AM IST

వారిని అరెస్ట్ చేస్తాం : ACP దామోదర్

NTR: డ్రగ్స్‌పై దండయాత్ర 2.Oకు ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. సెంట్రల్ జోన్‌లో మొత్తం 58 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ACP దామోదర్ తెలిపారు. వారిని డీఎడిక్షన్ సెంటర్‌కి పంపించి వైద్యం అందిస్తామని చెప్పారు. అలాగే వీరి స్నేహితులపై కూడా నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిని అరెస్ట్ చేస్తామన్నారు.

April 23, 2026 / 11:15 AM IST

హంతకుడిని త్వరలో పట్టుకుంటాం: డీఎస్పీ

NDL: ఆళ్లగడ్డలోని చాంద్ వీధిలో హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడు చెన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించామని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

April 23, 2026 / 11:14 AM IST

వాడపల్లి అన్నదానం ట్రస్ట్‌కు రూ. 50 వేల విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి గురువారం నిడమర్రు మండలం, పెద్దనిండ్రకొలను వాస్తవ్యులు చిటికిరెడ్డి అప్పారావు, లక్ష్మి కుటుంబ సభ్యులు  రూ. 50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి చిత్రపటం అందజేశారు.

April 23, 2026 / 11:14 AM IST

రేపు అన్ని పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు: MPDO

CTR: పులిచెర్ల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రేపు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని ఎంపీడీవో రాజశేఖర్ బాబు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని ఉన్నతాధికారులు అదేశాలిచారన్నారు. ప్రజలు గ్రామ సభలకు హాజరయ్యేలా చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

April 23, 2026 / 11:12 AM IST

మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్ చల్

ప్రకాశం: ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి సమీపంలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ హల్ చల్ చేశాడు. బుధవారం రాత్రి లారీని రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణంలోని వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాడు. కారుని ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

April 23, 2026 / 11:12 AM IST

23 రోజులైనా జీతం రాలేదు… కార్మికుల ఆవేదన

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 1200 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన రావాల్సిన జీతాలు నేటికీ (23వ తేది) ఖాతాలో పడలేదు. స్ట్రైక్ సమయంలో 15 రోజుల జీతాలను చెల్లించాలని ప్రభుత్వం 2నెలల కిందట ఆదేశించింది. వాటిని ఇప్పటికీ వరకు ఇవ్వలేదు. దీంతో కార్మికులు అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

April 23, 2026 / 11:10 AM IST

RO మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

VZM: ప్రయాణికులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు ఆర్టీసీ బస్ స్టేషన్లో RO మినరల్ వాటర్ ప్లాంట్ను ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి ప్రారంభించారు. రోటరీ ఇంటర్నేషనల్ విజయనగరానికి చెందిన డి. నారాయణమూర్తి సౌజన్యంలో దీన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ విజయనగరం గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

April 23, 2026 / 11:09 AM IST