• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోగొట్టుకున్న బంగారు గొలుసు అందజేత

BPT: చందోలు ఎస్సై వెంకట శివకుమార్ పోలీసుల నిజాయితీని చాటుకున్నారు. ఓ వ్యక్తి పోగొట్టుకున్న రెండు సవర్ల బంగారు గొలుసును గాలించి పట్టుకున్నారు. మొక్కల పొదల్లో చిక్కుకున్న ఆ గొలుసును గుర్తించి, బాధితుడికి సురక్షితంగా అప్పగించారు. సొత్తు తిరిగి దొరకడంతో అతడు ఊరట చెందాడు. నేరాల నియంత్రణ, ప్రజలకు భరోసా కల్పించడంలో పోలీసుల కృషి స్థానికులు అభినందనీయమన్నారు.

April 25, 2026 / 08:42 PM IST

అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు డ్రోన్ నిఘా

E.G: అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్‌పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు శనివారం తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ నేతృత్వంలో గ్రామ శివార్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గోదావరి పరిసరాలు, పొదలు, తోటల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. బహిరంగ మద్యపానం, జూదం, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 25, 2026 / 08:40 PM IST

ఎమ్మెల్యేకి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఈవో వేండ్ర త్రినాథరావు శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు అందజేశారు. ఈనెల 30న జరిగే స్వామివారి కల్యాణోత్సవం, నూతన ట్రస్టు బోర్డు ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

April 25, 2026 / 08:40 PM IST

27న యోగి వేమన యూనివర్సిటీ బంద్

KRNL: యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న బంద్‌కు ఇవాళ ఆర్ఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం డిమాండ్లు ఉంచారు. అక్రమ నియామకాలు, అవినీతి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

April 25, 2026 / 08:38 PM IST

వట్టిచెరుకూరులో పేకాట గుట్టు రట్టు

GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.17,120 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

April 25, 2026 / 08:32 PM IST

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

 KDP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జేసీ మీనా తెలిపారు. ఆయిల్ డిపోలలో తగినంత నిల్వలు ఉన్నాయని, భయంతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని వాహనదారులకు సూచించారు. ప్రభుత్వ బంకులపై డిమాండ్ పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వెంటనే సరఫరా పెంచేందుకు చర్యలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

April 25, 2026 / 08:31 PM IST

రాయచోటిలో వార్డు సచివాలయాల పరిశీలన

అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ కమిషనర్ పి. రమణారెడ్డి వార్డు సచివాలయాలను పరిశీలించారు. 2026–27 సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.’మన మిత్ర’ ట్రైనింగ్ మాడ్యూల్‌ను ఫీల్డ్‌లోనే పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని చెప్పారు. UFS మిస్సింగ్,  e-KYC డేటాలో జిల్లా వెనుకబడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

April 25, 2026 / 08:29 PM IST

సదుం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మృతి

CTR: సదుం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిబాబు(48) శనివారం అస్వస్థతతో కన్నుమూశారు. చిత్తూరు దొడ్డిపల్లెకు చెందిన ఆయన, మధుమేహం కారణంగా ఈనెల 12 నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అయితే గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. గిరిబాబు మృతిపై తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

April 25, 2026 / 08:28 PM IST

ఎస్పీని కలిసిన జూనియర్ సివిల్ జడ్జి

KRNL: జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన మహమ్మద్ అజామ్ శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ అభినందనలు తెలిపి, న్యాయవ్యవస్థలో నిబద్ధతతో సేవలు అందించాలని సూచించారు. కృషి, పట్టుదలతో సాధించిన విజయాన్ని ప్రశంసించారు. కాగా, తండ్రి పోలీస్ శాఖలో సేవలందిస్తుండగా కుమారుడు న్యాయరంగంలో రాణించడం గర్వకారణమని ఎస్పీ కొనియాడారు.

April 25, 2026 / 08:28 PM IST

ప్రవేశ పరీక్షలకు 27 మంది గైర్హాజరు

CTR: పుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు (POLYCET) శనివారం ప్రశాంతంగా ముగిశాయి. బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 304 మంది విద్యార్థులకు గాను 277 మంది పరీక్షకు హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో పరీక్షా ప్రక్రియ అంతా సజావుగా సాగింది.

April 25, 2026 / 08:24 PM IST

బస్సు ప్రమాదంలో వ్యక్తి మృతి

NDL: నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏబిఎం చర్చి దగ్గర ప్రమాదవశాత్తు బస్సు ఎక్కుతూ వెనక టైర్ కిందపడి సయ్యద్ యూసుఫ్ (63)మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఎస్సై మణికంఠ తెలిపడంతో.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

April 25, 2026 / 08:18 PM IST

ఏకలవ్య పాఠశాలల ప్రవేశ ఫలితాలు విడుదల

మన్యం: 2026-27 విద్యా సంవత్సరానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపాల్ వీర్ సింగ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు మే 9లోపు అలాట్మెంట్ లెటర్‌లో సూచించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి సీటు నిర్ధారించుకోవాలి. గడువులోగా సమర్పించకపోతే సీటు రద్దు అవుతుందని హెచ్చరించారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు.

April 25, 2026 / 08:18 PM IST

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక

AKP: మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్ధులు లిఖిత, జ్యోతి, కార్తీక్, కోమల్ అండర్-14 బేస్ బాల్ బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మే నెల ఐదో తారీకు నుంచి కర్నూలులో మొదలు కాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారు. పాఠశాల హెచ్ఎం మహాలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ రాజబాబు అభినందించారు.

April 25, 2026 / 08:15 PM IST

జంగారెడ్డిగూడెంలో రైతు సదస్సు

ELR: వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం ఎంతో అవసరమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలె అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో ఉద్ధరాజరామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. సాగులో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు.

April 25, 2026 / 08:14 PM IST

శ్రీశైలంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పూజలు

NDL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని శనివారం రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అటు, ఈవో శ్రీనివాసరావు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

April 25, 2026 / 08:11 PM IST