• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేమూరు వీవోఏలకు స్మార్ట్‌ ఫోన్లు

BPT: వేమూరు నియోజకవర్గంలోని 195 మంది వీవోఏలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. డిజిటల్ సేవలు, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. వేమూరు పరిధిలోని 63 వేల మంది డ్వాక్రా సభ్యులకు సేవలు మరింత చేరువవుతాయన్నారు.

April 23, 2026 / 01:11 PM IST

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు

KDP: ప్రొద్దుటూరు పట్టణంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాటసారులకు మంచి నీటిని అందించడంతోపాటు, మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు మజ్జిగను కూడా అందిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

April 23, 2026 / 01:10 PM IST

అక్కయ్యపాలెంలో సంస్మరణ సభ

VSP: అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లోని ఇమామ్ రేజా భవనంలో షియా ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డా.అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ హాజరై ప్రసంగించారు. భారత్‌లో అన్ని మతాలు శాంతియుతంగా కలిసివుంటాయని, ఇండియా-ఇరాన్ మధ్య సుదీర్ఘ సంబంధాలు కొనసాగుతున్యారు.

April 23, 2026 / 01:10 PM IST

చిన్నరావుపల్లి లో ఉచిత వైద్య శిబిరం

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్న రావు పల్లి గ్రామంలో గురువారం 104 వాహనం వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శిబిరంలో షుగర్, BP, థైరాయిడ్ వంటి పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి ఉచితంగా మందులు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిహెచ్సి డాక్టర్ ప్రియదర్శిని, మెడికల్ అసిస్టెంట్ రాజు, 104 సిబ్బంది ఉష, తదితరులు పాల్గొన్నారు.

April 23, 2026 / 01:09 PM IST

పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని సందర్శించిన మంత్రి

KRNL: సింగపూర్‌లో మూడో రోజు సహచర మంత్రులతో కలిసి మంత్రి బీసీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని సందర్శించారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని పీఎస్ఏ పోర్టు కార్యకలాపాల్లో వినియోగిస్తుందన్నారు. పోర్టులో కంటైనర్ల తరలింపునకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై, షిప్పింగ్, లాజిస్టిక్స్‌లో ఏఐ సాంకేతికతను అధ్యయనం చేస్తున్నారు.

April 23, 2026 / 01:05 PM IST

అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులు

KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లక్ష్మీదుర్గ బెయిల్ గడువు ముగియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాక్షులను బెదిరించిన మాగంటి రాంబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అనుచరుడని తెలుస్తోంది.

April 23, 2026 / 01:05 PM IST

వడమాలపేటలో జనగణన-2027 శిక్షణ ప్రారంభం

TPT: జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా వడమాలపేటలో గురువారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, జనగణన డైరెక్టర్ కె. నివాస్, జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో నరసింహులు, ఆర్‌డీవో రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.

April 23, 2026 / 01:04 PM IST

ప్రమాదాల నివారణకు ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తింపు: SP

W.G: రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఇవాళ పెదతాడేపల్లి, అలంపురం జాతీయ రహదారి కూడళ్లను రెవెన్యూ, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాల నియంత్రణకు అధికారులకు పలు సూచనలు చేశారు.

April 23, 2026 / 01:00 PM IST

ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో బీజేపీ నేత సమావేశం

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ చొరవతో ధర్మవరంలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంస్కృతి సేవా సమితి, జైపూర్ ఫుట్ సహకారంతో ఈ నెల 27, 28 తేదీల్లో పోతుకుంట ఆసుపత్రిలో శిబిరం జరగనుంది. దీనిపై బీజేపీ నేత హరీష్ బాబు ఎన్జీవో హోమ్‌లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 23, 2026 / 01:00 PM IST

పెద్ద చెరువు అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

NDL: నంద్యాలలోని పెద్ద చెరువును అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇవాళ వాటర్ రిసోర్సెస్ అధికారులతో కలిసి ఆమె చెరువు పరిసరాలను పరిశీలించారు. చెరువు చుట్టూ 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌ను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

April 23, 2026 / 01:00 PM IST

వేసవికాలంలో ముంజేలకు మహా గిరాకీ

ప్రకాశం: జిల్లాలో తాటి ముంజేలకు మహా గిరాకీ ఏర్పడింది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే కొబ్బరి బోండాలతో పాటు ముంజేలకు మహా గిరాకీ ఏర్పడింది. ముంజేలు తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరగడమే కాకుండా వేడిని తగ్గిస్తుంది. దీంతో ప్రజలు వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

April 23, 2026 / 12:55 PM IST

శ్రీవారి భక్తుల కోసం చలివేంద్రం ఏర్పాటు

ELR: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఇవాళ సొసైటీ ఛైర్మన్ పోలిన శ్రీనివాసరావు ప్రారంభించారు. నిత్యం ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి, భక్తులకు, ప్రయాణికులకు, ఈ చలివేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 23, 2026 / 12:50 PM IST

‘ఈ వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు రానివ్వం’

VSP: సంతబొమ్మాళి(M) మూలపేట అర్ అండ్ ఆర్ కాలనీలో ఈ వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రానివ్వమని టెక్కలి ఆర్డిఓ ఎం. కృష్ణమూర్తి అన్నారు. గురువారం RDO, RWS అధికారులు ఆధ్వర్యంలో TDP శ్రేణులు ఈ నీటి పథకం పనులకు శంకుస్థాపన నిర్వహించారు.టెక్కలి ఉద్దానం నీటిప్రాజెక్టులు నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటిని సమకూర్చే పనులు వేగవంతం చేస్తామన్నారు.

April 23, 2026 / 12:47 PM IST

భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ ఉద్యమం: మంత్రి

సత్యసాయి: భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో గురువారం భగీరథ మహర్షి విగ్రహానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాయలసీమకు నీటి సరఫరా కోసం భారీ నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు.

April 23, 2026 / 12:45 PM IST

ఏలూరులో వైసీపీ శ్రేణులు నిరసన

ఏలూరు 45వ డివిజన్ ఆదివారపు పేటలో వేసవికాలం సందర్భంగా స్థానిక నాయకులు పసుపులేటి దినేష్ ఇటీవల మంచినీటి చలివేంద్రంను ఏర్పాటు చేశారు. దానిని కక్షపూరితంగా ఇవాళ తెల్లవారుజామున తొలగించడాన్ని వైసీపీ శ్రేణులు ఖండించారు. నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.

April 23, 2026 / 12:45 PM IST