సత్యసాయి: మంత్రి సత్యకుమార్ చొరవతో ధర్మవరంలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంస్కృతి సేవా సమితి, జైపూర్ ఫుట్ సహకారంతో ఈ నెల 27, 28 తేదీల్లో పోతుకుంట ఆసుపత్రిలో శిబిరం జరగనుంది. దీనిపై బీజేపీ నేత హరీష్ బాబు ఎన్జీవో హోమ్‌లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.