• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ ఎంపీడీవోకు అవార్డు

ASR: 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొయ్యూరు మండలంలో పన్నులు, పన్నేతర వసూళ్లలో 100% లక్ష్యాన్ని సాధించినందుకు ఇంఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో ఎం. బాబూరావుకు ఉత్తమ అవార్డు లభించింది. గురువారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్, డివిజనల్ అధికారి పీఎస్ కుమార్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కృషిని అధికారులు అభినందించారు.

April 9, 2026 / 08:12 PM IST

‘గృహ గణన బాధ్యతతో చేయాలి’

AKP: నక్కపల్లి మండలంలో మే 1వ తేదీ నుంచి నిర్వహించే గృహ గణనలో పాల్గొనే సిబ్బందికి మూడు రోజులు పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఎంపీడీవో చిన్నకృష్ణ గురువారం ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం గృహ గణన చేయాలన్నారు. వచ్చే ఏడాది జనగణన కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

April 9, 2026 / 08:11 PM IST

విశాఖలో “మన ఊరు-మన జెండా” కార్యక్రమం

VSP: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు-మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. యువత స్టార్టప్ ఇండియా వంటి అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

April 9, 2026 / 08:08 PM IST

ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

TPT: తిరుపతి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు సంవత్సరాలుగా 59 ట్రాన్స్‌ఫార్మర్‌లను ధ్వంసం చేసి రాగి వైర్లు దొంగిలించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 2.72 లక్షల విలువ గల రాగి వైర్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

April 9, 2026 / 08:03 PM IST

ప్రజల సంతృప్తిలో జిల్లా నాలుగో స్థానం

VZM: జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక ప్రతిపాదనలపై CM చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ అంశాలపై చర్చించారని చెప్పారు. ప్రజల సంతృప్తిలో జిల్లా 4వ స్థానం సాధించిందని, విద్యుత్, RTC, రిజిస్ట్రేషన్ల సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారన్నారు.

April 9, 2026 / 08:02 PM IST

నీటి భద్రతపై అవగాహన కార్యక్రమం విజయవంతం

TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన “నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత” అంశంపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నీటి సంరక్షణతోనే భవిష్యత్తు సురక్షితమని, భూగర్భ జలాల పునరుద్ధరణకు సమిష్టి కృషి అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయమ్మ, నీటిపారుదల ఏఈ ఎన్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ఆర్ గౌరీ పాల్గొన్నారు.

April 9, 2026 / 08:00 PM IST

డీఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ధర్నా

ATP: గుంతకల్లు DSP కార్యాలయం ఎదురుగా గురువారం వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎస్పీ శ్రీనివాసులకు అందజేశారు.

April 9, 2026 / 08:00 PM IST

ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనధికార పార్కింగ్‌పై చర్యలు

VSP: జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశాలతో ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అనధికార పార్కింగ్‌పై అధికారులు చర్యలు చేపట్టారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్.సీహెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ మేరకు అనధికారంగా పార్కింగ్ చేసిన సిటీ బస్సులపై కేసులు నమోదు చేశారు.

April 9, 2026 / 07:51 PM IST

పేద వర్గాల పక్షాన చండ్ర రాజేశ్వర రావు నిలిచారు: సీపీఐ

W.G: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, విప్లవ యోధుడు చండ్ర రాజేశ్వర రావు 32వ వర్ధంతి కార్యక్రమం గురువారం తణుకులో ఘనంగా జరిగింది. సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భీమారావు పాల్గొని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

April 9, 2026 / 07:48 PM IST

పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్

AKP: సుమారు 10 సంవత్సరాలుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు సయ్యద్ సీనీబ్రహ్ముషా @ శ్రీనుని అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు తెలిపారు. అతను 2016 సంవత్సరంలో 625 కేజీల గంజాయి రవాణా కేసులో A2గా ఉన్నాడన్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఇచ్చిన నాన్ బెయిల్ వారెంట్‌తో నిందితుడి కోసం గాలింపు చేపట్టి అరెస్ట్ చేశామని తెలిపారు.

April 9, 2026 / 07:45 PM IST

జిల్లా వైద్యశాలలో అధికారులు తనిఖీ

GNTR: గుంటూరులోని జీజీహెచ్‌లో అగ్నిమాపక పరికరాలను జిల్లా అగ్నిమాపణ అధికారి శ్రీనివాస రెడ్డి గురువారం తనిఖీ చేశారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు ఆలోచనతో వైద్యశాలలో ఈ అగ్నిమాపక పరికరాలు అన్ని ఉన్నాయా లేదా అనేదానిపై అధికారులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు చేసి, పరిశీలించారు.

April 9, 2026 / 07:45 PM IST

న్యూస్ ఛానల్ యజమానిపై వైసీపీ నేతలు ఫిర్యాదు

ELR: వైసీపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక టీవీ ఛానల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్‌కు ఫిర్యాదు చేశారు.

April 9, 2026 / 07:42 PM IST

సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలి: కలెక్టర్

మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

April 9, 2026 / 07:40 PM IST

బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ ఆమరణ నిరాహార దీక్ష

KRNL: బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ చేపట్టిన 5 ప్రధాన డిమాండ్లకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, సమగ్ర కులగణన చేపట్టడం, చట్టసభలు, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

April 9, 2026 / 07:40 PM IST

కడపలో ఆల్లూరి వెంకటయ్య జయంతి

KDP: రంగస్థల నాటకాన్నే శ్వాసగా భావించి జీవించిన ఆల్లూరి వెంకటయ్య జీవితం ధన్యమని ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి కొనియాడారు. కడపలోని జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో వెంకటయ్య 89వ జయంతి వేడుకలు నిర్వహించారు. నంది నాటకోత్సవాల్లో జిల్లాకు 28 నంది పురస్కారాలను అందించిన ఘనత వెంకటయ్యకే దక్కుతుందన్నారు. తన తర్వాత కూడా నాటక కళ బ్రతికి ఉండాలని ఆయన పేర్కొన్నారు.

April 9, 2026 / 07:39 PM IST