• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

21న కాకినాడ టౌన్ నుండి -హిసార్‌కు ప్రత్యేక రైలు

కాకినాడ టౌన్- హిసార్(07717)కు ఈ నెల 21న ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ రైలు మంగళవారం ఉదయం 5. 40కి కాకినాడ టౌన్ నుంచి బయలు దేరి రెండు రోజుల అనంతరం గురువారం మధ్యాహ్నం 1:40 వరకు హిసార్‌కు చేరుకుంటుందన్నారు. 

April 19, 2026 / 09:42 AM IST

25 వార్డులో పర్యటించిన కమిషనర్

SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 25వ వార్డులో పలు ప్రాంతాలలో ఆదివారం కమిషనర్ శ్రీనివాసులు, ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబూరావు విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

April 19, 2026 / 09:40 AM IST

నందిగామలో అరుదైన చేప అమ్మకాలు

ఎన్టీఆర్: మాంసాహార ప్రియులకు శుభవార్త. నందిగామలో అరుదైన టోనా ఫిష్ అమ్మకాలు సందడి చేస్తున్నాయి. సుమారు 50 కిలోల బరువున్న ఈ భారీ సముద్ర చేపను పట్టణంలో తొలిసారి విక్రయానికి తీసుకురావడం విశేషంగా మారింది. కేజీ ధర రూ.500 నుంచి రూ.800 వరకు ఉండగా, ఈ చేప రుచి ప్రత్యేకమని చెబుతున్నారు. అరుదైన ఈ చేపను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

April 19, 2026 / 09:35 AM IST

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ASR: ప్రభుత్వం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇంప్రూవ్మెంట్ కట్టుకునే వెసులు బాటును ఈ ఏడాది నుంచి ప్రారంభించింది. అల్లూరి జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఫలితాలు వచ్చాయి. 5,370 మంది పరీక్ష రాయిగా 4,603 ఉత్తీర్ణత సాధించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈనెల 27లోపు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

April 19, 2026 / 09:33 AM IST

‘ఎండ తీవ్రత పెరగనున్నది.. జాగ్రత్తలు తీసుకోండి’

PLD: జిల్లాలో ఎండల తీవ్రతపై కలెక్టర్ కృత్తిక్ శుక్ల హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 45°C-55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు బయటకు రావద్దని, అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని కోరారు.

April 19, 2026 / 09:30 AM IST

చందనోత్సవంలో పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం

VSP: సింహాచలం చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వహించబోయే పోలీస్ సిబ్బందితో సీపీ శంఖబ్రత బాగ్చి సమీక్ష నిర్వహించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు వెంటనే సహాయం అందించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మొత్తం 2,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు.

April 19, 2026 / 09:30 AM IST

‘పరిశుభ్రత పర్యావరణంపై అందరూ భాగస్వాములు కావాలి’

PPM: పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యతకై స్వచ్చతా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ స్వచ్ఛ ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి మరియు ఎన్.సి.డి పిఓ డాక్టర్ టి. జగన్ మోహనరావు పిలుపునిచ్చారు. రావివలస ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం స్వచ్ఛంద్రా కార్యక్రమం నిర్వహించారు. వైద్య బృందంతో కలిసి ఆసుపత్రి అవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు.

April 19, 2026 / 09:14 AM IST

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఎన్టీఆర్: ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో టాప్-4లో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో 34,510 మందికి 29,103 (84%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 36,151 మందికి 31,453 (87%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి.

April 19, 2026 / 09:14 AM IST

రైల్వే గేటు మూసివేతను వాయిదా వేయాలని వినతి

ELR: రబీ పంట మాసూళ్ల దృష్ట్యా రైల్వే గేటు మూసివేతను వాయిదా వేయాలని కోరుతూ భీమడోలు రైతులు శనివారం తహశీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ట్రాక్ మరమ్మతుల కోసం ఈ నెల 20 నుంచి పది రోజుల పాటు గేటు మూసివేస్తామన్న రైల్వే నోటీసుపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా పనులు వాయిదా వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

April 19, 2026 / 09:10 AM IST

ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

AKP: దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి ఉత్సవ విగ్రహాలు, ధూపదీప నైవేద్యాల కోసం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని కలిసి వినతిపత్రం శనివారం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పంచలోహ విగ్రహాలు, నైవేద్యాల కోసం నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

April 19, 2026 / 09:09 AM IST

విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

VSP: సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

April 19, 2026 / 09:08 AM IST

ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్

కృష్ణ: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 1st ఇయర్‌లో 22,403 మందికి 20,142 మంది పాసయ్యారు. 2nd ఇయర్‌లో 21,669 మందికి 19,952 మంది పాసయ్యారు. 3,978 మంది ఫెయిలయ్యారు. 2nd ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 పరీక్షలు ఉంటాయి.

April 19, 2026 / 09:06 AM IST

ఐడీ కార్డ్ వెరిఫికేషన్ సమావేశం

సత్యసాయి: పెనుకొండ వైసీపీ కార్యాలయంలో క్యాడర్ ఐడీ కార్డ్ వెరిఫికేషన్‌పై మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కీలక సమావేశం నిర్వహించారు. పెనుకొండ అర్బన్, రూరల్, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం మండలాల కన్వీనర్లు, సోషల్ మీడియా, ఐటీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యకర్తలు వెంటనే తమ గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. 

April 19, 2026 / 09:05 AM IST

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DSP

TPT: జిల్లాలో SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు SV డిఫెన్స్ కాలేజీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీలత, CI తమీమ్ అహ్మద్ పాల్గొన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

April 19, 2026 / 09:04 AM IST

మహిళా సమాఖ్య అధ్యక్షులకు స్మార్ట్‌ ఫోన్ల పంపిణీ

SKLM: నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల సమాఖ్య సంఘాల అధ్యక్షులకు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం సాయంత్రం అందజేశారు. నరసన్నపేటలో 47, సారవకోటలో 47, పోలాకిలో 45, జలుమూరులో 49 మంది అధ్యక్షులకు ఈ మొబైల్స్ అందచేశారు. వెలుగు పథకం ద్వారా మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని MLA సూచించారు.

April 19, 2026 / 09:04 AM IST