ఎన్టీఆర్: ఇంటర్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో టాప్-4లో నిలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో 34,510 మందికి 29,103 (84%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్లో 36,151 మందికి 31,453 (87%) మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంప్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి.