• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి నీటి బొట్టు పొదుపుగా వాడుకోవాలి’

ATP: పరిసరాలను పరిశుభ్రత ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. శనివారం గుంతకల్లులో స్వచ్చంద్ర-స్వర్ణంద్ర కార్యక్రమం అవగాహన ర్యాలీ చేశారు. ప్రజలు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవాలన్నారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్‌ను వినియోగించరాదన్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు.

April 18, 2026 / 12:46 PM IST

ద్వారపూడిలో ‘బడి పిలుస్తోంది రా’ కార్యక్రమం

కోనసీమ: మండపేట(M) ద్వారపూడి మహాత్మా గాంధీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంయుక్తంగా శనివారం గ్రామ వీధుల్లో బడి పిలుస్తోంది రా కార్యక్రమం నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని ప్రైవేటు చదువులు వద్దు ప్రభుత్వ చదువులే ముద్దు,పెద్దలు పనికి – పిల్లలు బడికి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

April 18, 2026 / 12:45 PM IST

లోకేష్‌ను కలిసిన జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్

KDP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్య నారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నారా లోకేశి శనివారం ఉండవల్లిలోని ఆయన స్వగృహంలో ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

April 18, 2026 / 12:30 PM IST

కాకినాడను కాపాడుతున్న ‘హోప్ ఐలాండ్’

కాకినాడకి ‘హోప్ ఐలాండ్’ ఒక సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది. సముద్రపు పెను తుపానుల నుంచి నగరాన్ని కాపాడుతున్న ఈ దీవి వల్లే కాకినాడ రేవు సురక్షితంగా ఉంది. 1839 నాటి ప్రళయం నుంచి నేటి వరకు ఈ దీవి రక్షణగా నిలవడంతోనే పోర్ట్ ‘కామ్ వాటర్’గా గుర్తింపు పొందింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు నిలయమైన ఈ దీవి లేకపోతే కాకినాడ సముద్ర గర్భంలో కలిసిపోయేదని పలువురి అభిప్రాయం

April 18, 2026 / 12:29 PM IST

కోరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

E.G: నిడదవోలులోని కోరుపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు కారింకి రామకృష్ణ వరప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కూటమి నాయకులు, RSK సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

April 18, 2026 / 12:20 PM IST

తిరుపతిలో వైభవంగా నగర సంకీర్తన

TPT: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో స్థానిక భజన మండలి కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం తెల్లవారుజామున 5 గంటలకే కార్యక్రమం ప్రారంభమై స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సాగింది.

April 18, 2026 / 12:11 PM IST

జిల్లాలో జల ధార-జల హారతి కార్యక్రమం

CTR: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు కట్టమంచి చెరువులో జల ధార-జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు ఇతర ముఖ్య నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చెరువు కట్టపై ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేశారు.

April 18, 2026 / 12:08 PM IST

నేటి శ్రీశైలం ప్రాజెక్టు తాజా సమాచారం

NDL: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. శనివారం ఉదయం 6 గంటల సమయానికి డ్యామ్ నీటి మట్టం 820.30 అడుగులకు చేరింది. వేగంగా శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 41.0482 TMCలుగా ఉంది.

April 18, 2026 / 12:06 PM IST

NH-167: మృత్యు రహదారి!

KRNL: NH-167పై పలుచోట్ల మృత్యువు మాటేసింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఈ జాతీయ రహదారి కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం, రాయచూర్ వెళ్తుంది. మధ్యలో కొటేకల్ నగరవరం, ముగతి, చిలకలడోణ, కల్లుదేవకుంట, మాధవరం, చెట్నేపల్లి వద్ద పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టాల్సి ఉంది.

April 18, 2026 / 12:01 PM IST

భీమవరంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం

W.G: భీమవరం బీజేపీ జిల్లా ఆఫీస్‌లో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి Y.V సుబ్బారావు, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతల నుంచి కిసాన్ మోర్చాను బలోపేతం చేస్తామని అన్నారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు అధ్యక్షతన ఈ సభ జరిగింది.

April 18, 2026 / 11:51 AM IST

దీర్ఘాసి గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించిన ఉపాధ్యాయులు

SKLM: పోలాకి మండలం దీర్ఘాసి గ్రామంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు చేర్పించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు

April 18, 2026 / 11:49 AM IST

ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించిన ఉపాధ్యాయులు

SKLM: పోలాకి మండలం దీర్ఘాసి గ్రామంలో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగోటి రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు చేర్పించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు

April 18, 2026 / 11:49 AM IST

ఇక ఆమెకు మంత్రి పదవి లేనట్లేనా..?

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి వస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. బహిరంగ సభల్లో కూడా నాయకులు ఆమెకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు. అన్యూహంగా పార్టీ అధిష్టానం ప్రశాంతి రెడ్డిని పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. దీంతో ఎమ్మెల్యేకు ఇక మంత్రి పదవి లేనట్టే అని ప్రచారం సాగుతోంది.

April 18, 2026 / 11:43 AM IST

మంచేపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

సత్యసాయి: సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటరమణప్ప (70) అనారోగ్యంతో మరణించారు. శనివారం ఈ విషయం తెలుసుకున్న మండల కన్వీనర్ వెంకటేష్, టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, తదితరులు వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల, టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

April 18, 2026 / 11:42 AM IST

కార్మికులతో కలిసి టిఫిన్ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: అనంతపురంలోని నేషనల్ పార్కులో పర్యటించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అక్కడ పనిచేసే సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. సామాన్య కార్మికులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి కుటుంబ యోగక్షేమాలను, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి తమను ఇలా గుర్తించలేదని, ఎమ్మెల్యే స్వయంగా తమతో కలవడంపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.

April 18, 2026 / 11:41 AM IST