• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఇంధన కొరత లేదు: టీటీడీ

TPT: తిరుమలలో ఇంధన కొరత లేదని టీటీడీ స్పష్టం చేసింది. హెచ్పీ, ఐవోసీఎల్ బంకుల్లో తాత్కాలికంగా పెట్రోల్ అయిపోయినా, హెచ్పీ బంక్కు ఇప్పటికే ట్యాంకర్ చేరి సరఫరా ప్రారంభమైంది. ఐవోసీఎల్ బంక్కు రేపటికి ట్యాంకర్ చేరనుంది. భవిష్యత్తులో ఇంధన కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి సూచించారు.

April 26, 2026 / 09:45 PM IST

స్కానింగ్ సెంటర్ ప్రారంభించిన యువనేత కోట్ల

NDL: డోన్ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ బజార్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ సెంటర్ ను ఆదివారం టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య సేవలు ప్రజలకు చేరువ కావడం అవసరమన్నారు. స్కానింగ్ కేంద్రాలు ప్రజలకు మెరుగైన నిర్ధారణ సేవలు అందించడంలో కీలకమని పేర్కొన్నారు.

April 26, 2026 / 09:40 PM IST

డీజిల్ కొరత పై ఆందోళన చెందవద్దు: జేసీ

కోనసీమ: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోమవారం ఉదయానికి జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా అవుతుందని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి తెలిపారు. అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. రెండు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

April 26, 2026 / 09:33 PM IST

ఇంధన సమస్యలపై ఫిర్యాదుకు హెల్ప్‌లైన్

ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఇంధన సరఫరాలో ఇబ్బందులు లేదా అధిక ధరలపై వినియోగదారులు 8500292992, 08554-220009 నంబర్లకు సంప్రదించవచ్చు. అలాగే 1800-425-8804, 1800-425-8803 టోల్ ఫ్రీ నంబర్ల నుంచి కూడా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.

April 26, 2026 / 09:30 PM IST

రాజమండ్రి వేదికగా కలిసిన వైసీపీ పార్టీ పెద్దలు

E.G: రాజమండ్రిలో ఆదివారం వైసీపీ పెద్దలు ఒకే వేదికగా కలిశారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తనయుడు, మాజీ రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి దంపతుల కుమార్తె యొక్క నిశ్చితార్థం వేడుకలు మంజీరా కన్వ్ న్ హాల్ లో జరిగాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మార్గాని మోనా, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు మెరిసారు.

April 26, 2026 / 09:29 PM IST

పోలి గ్రామంలో పోలీసుల గ్రామ సభ

కడప జిల్లాలోని మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, చీటింగ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాలని సూచించారు.

April 26, 2026 / 09:28 PM IST

కొల్లేటి పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే

ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో కీటకటలాడింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి వివిధ రూపాలలో ఒక్కరోజు రూ.72,492 ఆదాయంగా లభించింది అన్నారు.

April 26, 2026 / 09:23 PM IST

‘28 నుంచి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు’

PLD: మాచర్ల శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి మెర్సి తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షల అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

April 26, 2026 / 09:22 PM IST

MLC అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్

KKD: సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్‌పై సెంట్రల్ జైల్లో ఉన్న YCP MLC అనంతబాబుకు కష్టాలు పెరగనున్నాయి. సోమవారం ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విచారణ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. స్టేషన్‌లో విచారించినప్పుడు తనకు ఏమీ తెలియదని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

April 26, 2026 / 09:18 PM IST

పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక ప్రకటన

ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతులు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ స్పష్టం చేశారు. జిల్లాలోని 211 బంకుల్లో 14.45 లక్షల లీటర్ల పెట్రోల్, 13.34 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అవసరానికి మించి ఎక్కువ కొనుగోలు చేయవద్దని కోరారు. బ్లాక్ మార్కెట్ చేస్తే బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

April 26, 2026 / 09:02 PM IST

గుడిలో హారం వేస్తూ బాలుడికి కరెంట్ షాక్

అన్నమయ్య: రామసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెంబకూరు పంచాయతీ ఎర్రబయలుపల్లెకు చెందిన చందు (14) గుడికి హారం వేస్తూ కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 26, 2026 / 09:00 PM IST

తిరుపతికి చేరుకున్న ఓయాసిస్ జనని యాత్ర

TPT: సంతానోత్పత్తిపై అవగాహన పెంచడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ చేపట్టిన జనని యాత్ర తిరుపతికి చేరుకుంది. సంతానలేమి దంపతులకు పలు అంశాలపై అవగాహన కల్పించింది. ఉచితంగా హిమోగ్లోబిన్, AMH పరీక్షలతో పాటు వీర్య విశ్లేషణ చేపట్టింది. మారిన జీవన శైలి, ఆలస్యంగా పిల్లలు కనాలని అనుకోవడంతో సంతానోత్పత్తి రేట్ తగ్గుతోందని డాక్టర్లు వివరించారు.

April 26, 2026 / 09:00 PM IST

వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం

VZM: రాజాం మండలం శ్యాంపురం గ్రామ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్మాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తుల సమక్షంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు నిర్వహించారు.

April 26, 2026 / 08:53 PM IST

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం

VZM: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై జరజాపుపేటలో నెల్లిమర్ల SI గణేష్ అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే శారీరక, మానసిక సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.

April 26, 2026 / 08:44 PM IST

కనిగిరిలో పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన కలెక్టర్

ప్రకాశం: పెట్రోల్, డీజిల్ కొరతపై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. ఇవాళ కనిగిరిలో పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆమె జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి బంక్ వద్ద రెవిన్యూ, పోలీసు, పౌర సరఫరా అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రజలు భయంతో డ్రమ్‌లు, క్యాన్లలో ఇంధనం నిల్వ చేయవద్దని సూచించారు.

April 26, 2026 / 08:43 PM IST