ప్రకాశం: పెట్రోల్, డీజిల్ కొరతపై జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. ఇవాళ కనిగిరిలో పెట్రోల్ బంకులను పరిశీలించిన ఆమె జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి బంక్ వద్ద రెవిన్యూ, పోలీసు, పౌర సరఫరా అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రజలు భయంతో డ్రమ్‌లు, క్యాన్లలో ఇంధనం నిల్వ చేయవద్దని సూచించారు.