• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి..!

KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఎర్రగుంట్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. అతని సంబంధీకులు ఆసుపత్రి వద్దకు రావాలని కోరారు.

April 14, 2026 / 10:05 PM IST

చిత్తూరులో ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు

CTR: ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో దాడులు నిర్వహించిన పోలీసులు, ఐదుగురిని అదుపులోకి తీసుకోగా విచారణ అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ ముఠాలోని మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉం...

April 14, 2026 / 09:48 PM IST

పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రత్యేక చర్యలు

W.G: నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను అధికారులతో కలసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలన్నారు.

April 14, 2026 / 09:40 PM IST

జర్నలిస్ట్ కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ సీనియర్ జర్నలిస్టు దివంగత కాలువ రమణ కుటుంబానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అండగా నిలిచారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో రమణ భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవికి రూ. లక్ష నగదు సాయం అందజేశారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

April 14, 2026 / 09:30 PM IST

చెత్త సేకరణ ట్రాక్టర్‌‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడు మండలంలో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా పెదశంకర్లపూడి గ్రామ పంచాయతీకి కొత్త ట్రాక్టర్ మంజూరైంది. ఇవాళ సాయంత్రం ఈ ట్రాక్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు. ఈ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త వాహనం సమకూరడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

April 14, 2026 / 09:17 PM IST

‘గత సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు చేసింది’

కోనసీమ: గాడిలంక సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్పందించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటకృష్ణారావు 14 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తేల్చిందన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన ప్రజాస్వామ్య హననానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన అభ్యర్థి కృష్ణారావును, న్యాయవాది రెడ్డి సత్యనారాయణను టీడీపీ నాయకులు సన్మానించారు.

April 14, 2026 / 09:00 PM IST

పర్లపాడు హత్య కేసులో ముగ్గురి అరెస్ట్: ASP

KDP: రాజుపాలెం మండలం పర్లపాడులో ఈనెల 10న జరిగిన మహేశ్ హత్య కేసులో ఇవాళ ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. భంగి సురేశ్, చరణ్, దేవమ్మను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడి హత్య వరకు వెళ్లవద్దని సూచించారు.

April 14, 2026 / 08:55 PM IST

టి.కోడూరు గ్రామంలో పోలీసుల కౌన్సిలింగ్ కార్యక్రమం

KDP: టి.కోడూరు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. కొండాపురం సీ.ఐ రాజా మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలు మరియు మహిళలపై నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు.

April 14, 2026 / 08:52 PM IST

ఎవరెస్ట్ అధిరోహణలో ఏడుగురు జిల్లా విద్యార్థులు

NDL: ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఇవాళ ఉండవల్లిలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. రాష్ట్రం వ్యాప్తంగా 21 మంది విద్యార్థుల బృందంలో జిల్లాకు చెందిన విద్యార్థులు ఏడుగురు ఉండడం విశేషం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు.

April 14, 2026 / 08:48 PM IST

తిరుపతిలో క్రీడా ప్రాజెక్టులకు శ్రీకారం

TPT: తిరుపతి గొల్లవనిగుంటలో రూ.10.10 కోట్లతో నిర్మించిన ఆధునిక క్రీడా స్టేడియాన్ని రేపు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. CSR-PPP మోడల్‌లో దీనిని అభివృద్ధి చేసినట్లు శాప్ ఛైర్మన్ తెలిపారు. చంద్రగిరిలో ఇండోర్ హాల్, తిరుపతిలో బాక్సింగ్ రింగ్‌తో పాటు కరణం మల్లేశ్వరి పేరుతో అకాడమీ ఏర్పాటు చేసి జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

April 14, 2026 / 08:45 PM IST

అశ్రునయనాలతో రోజారాణి అంతిమ వీడ్కోలు

విశాఖలో మంగళవారం తెలంగాణ సీఐటియు నేత, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రోజారాణి అంతిమయాత్ర భావోద్వేగంగా సాగింది. సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమెకు కెజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం సీపీఎం కార్యాలయంలో ఆమెకు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల సీపీఎం నేతలు, ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు హాజరై ఘనంగా వీడ్కోలు పలికారు.

April 14, 2026 / 08:42 PM IST

రేపు గజపతినగరంలో అన్న క్యాంటీన్ ప్రారంభం

VZM: గజపతినగరంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక గ్రంథాలయం పక్కన నూతనంగా నిర్మించిన ‘అన్న క్యాంటీన్’ను బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఈ క్యాంటీన్ నిరుపేదలకు, బాటసారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

April 14, 2026 / 08:41 PM IST

నడింపల్లిలో బనానా వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ప్రారంభం

ATP: ​నార్పల మండలం నడింపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ‘బనానా వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్’ను ప్రారంభించారు. అరటి వ్యర్థాల నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. పీ4, సీఎస్‌ఆర్ కింద సుజలన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

April 14, 2026 / 08:41 PM IST

ఈతకు వెళ్లి డాక్టర్ మృతి

NTR: గంపలగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన డెంటల్ డాక్టర్ సురేష్ కృష్ణా నదిలో ఈతకు వెళ్లి మంగళవారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుంటూరులో నివాసం ఉంటున్న ఆయన ప్రతి రోజూ ఈతుకు వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 08:41 PM IST

పీఎం రాహత్ భరోసా పథకం పోస్టర్స్ ఆవిష్కరించిన కలెక్టర్

NLR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గుడ్ సమారిటన్’ పథకంతో పాటు పీఎం రాహత్ పథకం అమలు అవుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్సు తెలిపారు. కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఎం రాహత్ భరోసా పోస్టర్లను ఆవిష్కరించారు. పథకం ద్వారా గాయపడిన వారికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తామన్నారు.

April 14, 2026 / 08:40 PM IST