• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అంబేద్కర్ ప్రపంచ మేధావి’

ELR: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

April 14, 2026 / 04:56 PM IST

టిప్పర్ కింద పడి వృద్ధుడు మృతి..!

ప్రకాశం: ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామం సమీపంలో మంగళవారం టిప్పర్ లారీ కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. టిప్పర్ రివర్స్ చేసుకునే క్రమంలో టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వృద్ధుడు టిప్పర్‌ను ఢీకిని టైర్ల మధ్య పడి నలిగిపోయాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

April 14, 2026 / 04:50 PM IST

చోడవరంలో గ్రామసభ ఏర్పాటు

AKP: చోడవరం మండల కేంద్రంలో ఇవాళ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజా సమస్యలు, గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

April 14, 2026 / 04:44 PM IST

‘తాగునీటి సమస్యలు ఉంటే తెలపండి’

ASR: రాజవొమ్మంగి గ్రామ సచివాలయంలో ఎంపీడీవో యాదగిరేశ్వరావు మంగళవారం గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరారు. ముర్లవానిపాలెంలో తాగునీరు సమస్య నెలకొందని, చేతి పంపు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

April 14, 2026 / 04:44 PM IST

అందుబాటులోకి రానున్న అన్న క్యాంటిన్

కృష్ణా: అవనిగడ్డలో రూ.61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఉదయం 11 గంటలకు ఈ క్యాంటీన్ ప్రారంభిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ అన్న క్యాంటీన్ నిర్మించారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ అన్న క్యాంటీన్ ప్రారంభం కానుండటంతో కార్మికులకు మేలు కలుగనుంది.

April 14, 2026 / 04:43 PM IST

పీఎం సూర్యా ఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండల కేంద్రంలో పీఎం ఎస్సీ,ఎస్టీ సూర్యఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 04:43 PM IST

ఈ నెల 21ఆఖరి తేదీ.. వీళ్లు మాత్రమే అర్హులు

ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలోని 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. గ్రూప్-4కు డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-52 ఏళ్లున్న వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందజేయాలని చెప్పుకొచ్చారు.

April 14, 2026 / 04:41 PM IST

‘అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం’

CTR: విజయపురం(M) శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బీ.ఆర్. అంబేద్క‌ర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు అంబేద్క‌ర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం, సుజాత పాల్గొని బాబాసాహెబ్ సేవలను స్మరించుకున్నారు.

April 14, 2026 / 04:40 PM IST

జలధార-జలహారతి పనులకు ఆమోదం

PLD: జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు రూ. 26.46 కోట్లతో జలధార-జల హారతి పనులకు కలెక్టర్ కృతిక శుక్లా ఆమోదం తెలిపారు. ఈ పనులు 274 సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టనున్నారు. 227 చెరువుల్లో పూడిక తీత, కాల్వల పునరుద్ధరణతో భూగర్భ జల మట్టం 3 నుంచి 6 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని అధికారులు సూచించారు.

April 14, 2026 / 04:31 PM IST

రాజమహేంద్రవరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

E.G: డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలు, నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అంబేద్కర్ సేవలను స్మరించుకుని, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గంలో నడవాలని సంకల్పించారు.

April 14, 2026 / 04:30 PM IST

అంబేద్క‌ర్ విగ్రహానికి నివాళు అర్పించిన ఎంపీ

TPT: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంబేద్క‌ర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీషతో కలిసి అంబేద్క‌ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు.

April 14, 2026 / 04:30 PM IST

మైక్రో ఫిల్టర్ ప్లాంటును ప్రారంభించిన RRR

W.G: మండల కేంద్రమైన కాళ్ల మేజర్ పంచాయతీలో మంగళవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మిలియన్ లీటర్ల మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీని ఏర్పాటు చేసేందుకు దాత సంధ్యా మెరీన్ సహకారం అందించినట్టు తెలిపారు. స్వచ్చమైన త్రాగు నీరు ప్రతీ గ్రామానికి అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 04:27 PM IST

బనగానపల్లెలో మంత్రి బీసీ సుడిగాలి పర్యటన

NDL: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

April 14, 2026 / 04:25 PM IST

సోషలిస్ట్ దేశాలలో ఆదర్శ పాలన

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో మంగళవారం పీసీ కేశవరావు అధ్యక్షతన సీపీఎం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలు పోరాటాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీవి కొండారెడ్డి శిక్షణ ఇవ్వడం జరిగింది. సోషలిస్ట్ దేశాలు ఆదర్శ పాలన సాగిస్తున్నాయన్నాయి, మనదేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ పాలన సాగుతుందన్నారు.

April 14, 2026 / 04:20 PM IST

ఎర్ర చెరువు పనులను పరిశీలించిన పీడీ

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో జరుగుతున్న ఎర్ర చెరువు పనులను డూమా పీడీ నిర్మలదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ ఆధారిత హాజరులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి 10 గంటలకు ముగించాలన్నారు. అలాగే, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.

April 14, 2026 / 04:15 PM IST