• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్వర్ణ పంచాయతీ సేవలు ప్రజలకు సక్రమంగా అందాలి’

ASR: ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి స్వర్ణ గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా స్వర్ణ గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆయన బుధవారం చింతూరు గ్రామ సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనమిత్ర యాప్ ద్వారా అందుతున్న సేవలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.

April 15, 2026 / 01:35 PM IST

గ్యాస్ కొరతతో కట్టెల వంటలకు మళ్లిన ప్రజలు

PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో వంట గ్యాస్ తీవ్ర కొరత నెలకొనడంతో గిరిజనులు మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో కుటుంబాలు అడవుల నుంచి కట్టెలు సేకరించి వంట చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు రాకపోవడం, కొన్నిచోట్ల 20–30 రోజుల వరకు ఆలస్యం జరుగుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

April 15, 2026 / 01:22 PM IST

టీడీపీ రాష్ట్ర కమిటీలో ప్రణవ్ గోపాల్‌కు కీలక పదవి

VSP: టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేసిన ప్రణవ్ గోపాల్‌కు రాష్ట్ర కమిటీలో కీలక పదవి లభించింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకం జరగడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. అతి చిన్న వయసులోనే ఈ స్థానం దక్కించుకోవడం విశేషంగా మారింది. ప్రస్తుతం వీఎంఆర్డీఏ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయనకు పార్టీ మరింత బాధ్యతలు అప్పగించింది.

April 15, 2026 / 01:17 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బైరెడ్డి శబరి

NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురికి కృతజ్ఞతలు తెలియజేసింది.

April 15, 2026 / 01:14 PM IST

నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

VZM: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. యువగళం పోరాటంతో పార్టీకి చారిత్రాత్మక విజయం అందించిన లోకేశ్ ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో, మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.

April 15, 2026 / 01:13 PM IST

అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు: కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణం తొలగించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించాలని సూచించారు.

April 15, 2026 / 01:10 PM IST

క్రికెట్ ఆడిన మంత్రి లోకేశ్

TPT: తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో షాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణులు పీవీ సింధు, మిథాలి రాజ్‌లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడి వారిని ప్రోత్సహించారు.

April 15, 2026 / 01:10 PM IST

ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ

కోనసీమ: మైనారిటీల అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ ప్రోత్సాహం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన CM చంద్రబాబుకు ప్రభుత్వ సలహాదారులు అహమ్మద్ షరీఫ్‌కు బుధవారం మండపేట TDP రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది మైనారిటీ విద్యా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందన్నారు.

April 15, 2026 / 01:10 PM IST

కమలాపురంలో ఓ పాఠశాలకు నోటీసులు జారీ

కడప: కమలాపురం ఓ పాఠశాలకు ఎంఈఓ బేబీ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్నట్లు గుర్తించారు. అవసరమైన వసతులు లేకపోవడంతో గతంలో అనుమతి నిరాకరించినప్పటికీ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదని తెలిపారు. నోటీసుల అనంతరం స్కూల్ మూసివేతతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

April 15, 2026 / 01:09 PM IST

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన చరిత

KRNL: గూడూరు మండలం పెంచికలపాడుకు చెందిన గాడే చరిత ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988 మార్కులు సాధించి సత్తా చాటింది. నంద్యాల జిల్లా నెరవాడ ప్రభుత్వ ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదువుతూ ఆమె ఈ ఘనత సాధించింది. తన తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తూ తనను చదివించారని చరిత పేర్కొంది. ఫలితాలలో పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

April 15, 2026 / 01:09 PM IST

గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చిత్తూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వారి చదువుల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 15, 2026 / 01:07 PM IST

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ముళ్ళపూడి భాపిరాజు

E.G: పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ రాష్ట్ర అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, గోపాలపురం నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు ముళ్ళపూడి భాపిరాజు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 15, 2026 / 01:07 PM IST

ఇంటర్ ఉత్తీర్ణులకు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు

అన్నమయ్య: ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ  నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. మార్కులు తక్కువ వచ్చిన వారు నిరుత్సాహపడవద్దని, పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.

April 15, 2026 / 01:01 PM IST

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కాలవ శ్రీనివాసులు

ATP: రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన సేవలను గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు ఈ పదవి దక్కడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

April 15, 2026 / 01:01 PM IST

సోలార్ ప్యానల్ రూఫ్‌టాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: మండవల్లిలో కొండపల్లి నాంచారయ్య నివాసం వద్ద పీఎం సూర్య ఘర్ యోజన పధకం ద్వారా మంజూరైన సోలార్ ప్యానల్ రూఫ్‌టాప్‌ను బుధవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే కేంద్ర ప్రభుత్వ పథకంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 15, 2026 / 01:00 PM IST