• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమృత్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

SS: శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ అభివృద్ధి పనులు, పారిశుధ్యం, పౌర సేవలపై కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రూ. 760.59 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ (AMRUT) 1.0 & 2.0 పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

April 25, 2026 / 09:08 PM IST

‘ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’

విజయనగరం: పోలీసు ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. కో-ఆపరేటివ్ సభ్యత్వం కలిగిన 47 మంది పోలీసు ఉద్యోగుల పిల్లలకు రూ. 2.17లక్షలను మెరిట్ స్కాలర్షిప్స్‌ను అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి, కోరుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

April 25, 2026 / 09:02 PM IST

పేద పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలి: మంత్రి

TPT: పేద పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. తిరుపతి అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, అభ్యర్థులతో ముచ్చటించారు. మొత్తం 340 మందికి సివిల్స్ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్, 100 మందికి ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.

April 25, 2026 / 09:01 PM IST

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి MLA జేసీ అస్మిత్ రెడ్డి శనివారం యాడికి మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో తాడిపత్రిలోని తన స్వగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సచివాలయ సేవలపై కూడా చర్చించారు.

April 25, 2026 / 08:59 PM IST

పూర్వ విద్యార్థుల కలయికతో శతాబ్ది ఉత్సవం

CTR: రొంపిచర్ల తెలుగు ప్రాథమిక పాఠశాల శతాబ్ది ఉత్సవం శనివారం అత్యంత వేడుకగా జరిగింది. 1926లో స్థాపితమైన ఈ పాఠశాల వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డివైఈవో ఇందిరా, ఎంఈఓ శ్రీనివాసులు సీనియర్ విద్యార్థులను ఘనంగా సన్మానించి, పాఠశాల అభివృద్ధిని కొనియాడారు. ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది.

April 25, 2026 / 08:57 PM IST

సీఎం సహాయ నిధి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 TPT: CMRF చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. వేడిచర్ల గ్రామానికి చెందిన శివరాం సలోమికి రూ. 30,028, జడ్డా జయమ్మకు రూ. 23,920 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం సహాయనిధి ద్వారా పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

April 25, 2026 / 08:53 PM IST

ప్రత్యేక పూజలు పాల్గొన్న మంత్రి స్వామి

ప్రకాశం: కొండపి మండలం చోడవరం గ్రామంలో శనివారం బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముందుగా గ్రామస్తులు స్వామికి ఘన స్వాగతం పలికారు.

April 25, 2026 / 08:46 PM IST

పోగొట్టుకున్న బంగారు గొలుసు అందజేత

BPT: చందోలు ఎస్సై వెంకట శివకుమార్ పోలీసుల నిజాయితీని చాటుకున్నారు. ఓ వ్యక్తి పోగొట్టుకున్న రెండు సవర్ల బంగారు గొలుసును గాలించి పట్టుకున్నారు. మొక్కల పొదల్లో చిక్కుకున్న ఆ గొలుసును గుర్తించి, బాధితుడికి సురక్షితంగా అప్పగించారు. సొత్తు తిరిగి దొరకడంతో అతడు ఊరట చెందాడు. నేరాల నియంత్రణ, ప్రజలకు భరోసా కల్పించడంలో పోలీసుల కృషి స్థానికులు అభినందనీయమన్నారు.

April 25, 2026 / 08:42 PM IST

అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు డ్రోన్ నిఘా

E.G: అసాంఘిక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్‌పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు శనివారం తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ నేతృత్వంలో గ్రామ శివార్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గోదావరి పరిసరాలు, పొదలు, తోటల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. బహిరంగ మద్యపానం, జూదం, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 25, 2026 / 08:40 PM IST

ఎమ్మెల్యేకి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఈవో వేండ్ర త్రినాథరావు శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు అందజేశారు. ఈనెల 30న జరిగే స్వామివారి కల్యాణోత్సవం, నూతన ట్రస్టు బోర్డు ప్రమాణస్వీకారం, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

April 25, 2026 / 08:40 PM IST

27న యోగి వేమన యూనివర్సిటీ బంద్

KRNL: యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న బంద్‌కు ఇవాళ ఆర్ఎస్ఎఫ్ నేతలు పిలుపునిచ్చారు. నిధుల కేటాయింపు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం డిమాండ్లు ఉంచారు. అక్రమ నియామకాలు, అవినీతి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

April 25, 2026 / 08:38 PM IST

వట్టిచెరుకూరులో పేకాట గుట్టు రట్టు

GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో రూ.17,120 నగదు, 10 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

April 25, 2026 / 08:32 PM IST

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

 KDP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జేసీ మీనా తెలిపారు. ఆయిల్ డిపోలలో తగినంత నిల్వలు ఉన్నాయని, భయంతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని వాహనదారులకు సూచించారు. ప్రభుత్వ బంకులపై డిమాండ్ పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే వెంటనే సరఫరా పెంచేందుకు చర్యలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

April 25, 2026 / 08:31 PM IST

రాయచోటిలో వార్డు సచివాలయాల పరిశీలన

అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ కమిషనర్ పి. రమణారెడ్డి వార్డు సచివాలయాలను పరిశీలించారు. 2026–27 సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను ఉద్యోగులు, ప్రజలు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.’మన మిత్ర’ ట్రైనింగ్ మాడ్యూల్‌ను ఫీల్డ్‌లోనే పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని చెప్పారు. UFS మిస్సింగ్,  e-KYC డేటాలో జిల్లా వెనుకబడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

April 25, 2026 / 08:29 PM IST

సదుం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ మృతి

CTR: సదుం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గిరిబాబు(48) శనివారం అస్వస్థతతో కన్నుమూశారు. చిత్తూరు దొడ్డిపల్లెకు చెందిన ఆయన, మధుమేహం కారణంగా ఈనెల 12 నుంచి మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అయితే గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. గిరిబాబు మృతిపై తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

April 25, 2026 / 08:28 PM IST