ELR: కలెక్టర్రేట్లో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేసి విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .
NDL: ఉయ్యాలవాడ మండంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన వర్గాల ఘర్షణకు కారణమైన స్థలాన్ని అధికారులు ఆదివారం పరిశీలించారు. టౌన్ సీఐ యుగంధర్, ఎస్సై రామిరెడ్డి, తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు స్థల పత్రాలను తనిఖీ చేశారు. ఆ స్థలం వ్యక్తిగతమా లేక గ్రామానికి చెందినదా అనేది సమగ్రంగా పరిశీలించి నిజాలను వెల్లడిస్తామని తెలిపారు.
VSP: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి మధురవాడ ఐటీ సెజ్ రోడ్డులో ఓ యువకుడు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాడు. రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టగా ఒక చిన్నారికి గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు కారును వెంబడించి కొమ్మాది జంక్షన్ వద్ద అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన క్యాడర్ డిజిటలైజేషన్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్టలో పార్టీ శ్రేణులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ASR: రాజవొమ్మంగి ఎస్సైగా వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బధిలీల్లో రంపచోడవరం ఎస్సైగా చేస్తున్న వెంకటరావును రాజవొమ్మంగి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రాజవొమ్మంగి ఎస్సైగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
KRNL: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోందని ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా విద్యాధికారికి ఫ్యాప్టో నాయకులు ధర్నా నోటీసు అందజేశారు. మూల్యాంకనం విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు రేపటి నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.
SKLM: మందస మండలం పెద్దకేసుపురంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఘటన అధికారులకు ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
BPT: ఈ నెల 9న బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఈ నేపథ్యంలో సూరేపల్లెలో పర్యటన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, జేసీ భావన వశిష్ట, ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు. భద్రత, ప్రోటోకాల్ అంశాలను పర్యవేక్షించి స్థానిక అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి లోపాలు లేకుండా సీఎం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
PLD: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజన సిన్హా ఆయన కలెక్టరేట్లోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని జేసీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
CTR: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం చిత్తూరులో పర్యటిస్తారని ఎమ్మెల్యే గురజాల కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 గంటలకు బీవి రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే నివాసానికి మంత్రి చేరుకుంటారని అందులో పేర్కొన్నారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు.
GNTR: తాడికొండ శివారు పరిమి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో ఉన్న నూతక్కి మరియదాసు (34) అనే వ్యక్తిపై కొందరు దుండగులు ఇటుకలతో తీవ్రంగా దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.
NTR: ఏ.కొండూరు మండలం కొత్త రేపూడి సమీపంలో బైక్ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్లిన ద్విచక్ర వాహనం రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనదారుడు రామకృష్ణ (ముసునూరు, ఏలూరు జిల్లా)కు కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధ్యతుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
W.G: ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ సతీమణి వంక నాగమణి (95) ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తణుకులోని నివాసంలో మృతి చెందారు. సీపీఐ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర సమాఖ్య నేతగా నాగమణి కొనసాగుతున్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్నమయ్య: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి కర్తవ్యం అని మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మదనపల్లె టౌన్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.