• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాబు జగజ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే నివాళి

ELR: ఉంగుటూరు గ్రామం హరిజన పేటలో బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ధర్మరాజు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.

April 5, 2026 / 12:20 PM IST

అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం.. ఎస్సైకు అభినందనలు

ఎన్టీఆర్: డెలివరీ నిమిత్తం అత్యవసర సమయంలో తిరువూరు హాస్పిటల్‌లో రక్తం అవసరమైంది. దీంతో వెంటనే స్పందించి విధి నిర్వహణలో ఉన్న సెక్టార్ 2 ఎస్సై రాజు క్షణాల వ్యవధిలో హాస్పిటల్‌కి వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆదివారం డాక్టర్ సూరపనేని వనజ (సీనియర్ గైనకాలజిస్ట్) ఎస్సైకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఇలానే రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు.

April 5, 2026 / 12:20 PM IST

జిల్లాలో చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే

తిరుపతిలో బీజేపీ ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు  చలివేంద్రంను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లాలోని టౌన్ క్లబ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:16 PM IST

ఎంపీడీవో కార్యాలయంలో జగ్జీవన్ రామ్‌కు నివాళి

NLR: ఉదయగిరిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి జరిగింది. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బంది నివాళులర్పించారు. దళిత నాయకుడిగా, భారత ఉప ప్రధానిగా ఆయన పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

April 5, 2026 / 12:10 PM IST

కేజీహెచ్ దాడికి పాల్పడిన వారిపై కేసు

VSP: కేజీహెచ్ లోని రాజేంద్రప్రసాద్ వార్డులో జగదీష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతిచెందారు. దీంతో ఆవేదన చెందిన అతని బంధువులు ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేసి విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆర్ఎంవో ఆర్వీఎస్ కుమార్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పూడి వరప్రసాద్ సంఘటనపై పరిశీలన చేసి పలువురిపై కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 12:02 PM IST

దేశాభివృద్ధిలో జగ్జీవన్ రామ్ పాత్ర కీలకం: మంత్రి

అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.

April 5, 2026 / 12:01 PM IST

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ పండుగ వేడుకలు

KKD: గొల్లప్రోలు పట్టణంలో ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామునే విశ్వాసులు చర్చిలకు చేరుకుని యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకున్నారు. యేసు కృపా ప్రార్థన సహవాసంలో పాస్టర్ జయశీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహించగా విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు ప్రేమ, శాంతి సందేశాలను వివరించారు.

April 5, 2026 / 12:00 PM IST

బాబు జగ్జీవన్ రామ్‌కు కలెక్టర్ నివాళి

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.

April 5, 2026 / 12:00 PM IST

నిడదవోలులో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

E.G: నిడదవోలులో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి KVPS రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దిద్దే దయామణి తదితరులు పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి బాబూ జగ్జీవన్ తీవ్రమైన కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు.

April 5, 2026 / 12:00 PM IST

ఆ పంచాయతీ ప్రత్యేక అధికారిగా రాజంపేట MRO

అన్నమయ్య: రాజంపేట మండలంలోని తాళ్లపాక, కొత్త బోయినపల్లి, అప్పారాజుపేట గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా రాజంపేట MRO దస్తగిరయ్యను జిల్లా కలెక్టర్ నియమించారు. అలాగే మదన గోపాలపురం, మందపల్లి, హస్తవరం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా Dy MPDO అస్రాఫ్ వల్లిని నియమించారు. గుండ్లూరు, పోలి, మందరం గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా Dy MPDO సడ్రక్ బాబును నియమించారు.

April 5, 2026 / 12:00 PM IST

రెండో రోజు వ్యవసాయ విద్యార్థుల సేవా కార్యక్రమాలు

NDL: మహానంది మండలం గోపవరంలో మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు రెండో రోజు ఆదివారం గ్రామంలో పర్యటించారు. జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఆర్థిక సర్వేను నిర్వహించారు. రైతులతో కలిసి గ్రామ జనాభా వివరాలు, పంటల సరళి, పెట్టుబడి, రాబడి వ్యత్యాసాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో NSS అధికారులు డాక్టర్ ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:00 PM IST

శ్రీ భీమరాయ స్వామి రథోత్సవానికి ఆహ్వానం

KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో వెలసిన శ్రీ భీమరాయ స్వామి రథోత్సవం ఈనెల 7న జరగనుందని నిర్వహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డికి జాలవాడి గ్రామ వైసీపీ నాయకులు ఆంజనేయులు, ఉసేని, శివ ఇవాళ ఎమ్మిగనూరు పట్టణంలోని బీమా నిలయంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. శ్రీ భీమరాయ స్వామి రథోత్సవానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

April 5, 2026 / 12:00 PM IST

ఎస్పీ కార్యాలయంలో జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ జీ ముని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1935 అక్టోబర్ 19న దళితు లకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ఆయన కృషి చేశారన్నారు.

April 5, 2026 / 12:00 PM IST

వాండ్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

W.G: ఉండి మండలం వాండ్రం గ్రామంలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి MRPS ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు పసల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నతుడు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కనపాల ఏసు, శ్రీను, నరసన్న, పల్లియ్య, మోహన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:00 PM IST

అద్దంకి బజార్‌లో దొంగతనం.. షోరూంలో నగదు మాయం

బాపట్ల: అద్దంకి ప్రధాన బజార్‌లోని ఫ్యాషన్ షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి టేబుల్ డ్రాయర్‌లో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఘటన జరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

April 5, 2026 / 11:56 AM IST