• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి: ఎస్పీ

ATP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ పి. జగదీష్ 169 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పిటిషన్ చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి.

April 13, 2026 / 05:00 PM IST

ఈనెల 15న వారి ఖాతాల్లో రూ.20 వేలు జమ

NLR: మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేసేది టీడీపీ మాత్రమేనని, అందుకే మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా నిలబడ్డారని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఈ నెల 15న మత్స్యకారులకు రూ.20 వేలు ఖాతాలో జమవుతుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

భూ అక్రమాలపై జేసీకి పరిటాల శ్రీరామ్ వినతి

సత్యసాయి: గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ కోరారు. సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

April 13, 2026 / 05:00 PM IST

ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

KKD: గత ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండ రామస్వామి, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలను వైఖానస ఆగమన ప్రకారం కోటిపల్లి గోదావరి నదిలో జలాధివాసం చేయనున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన రథం అన్నవరం చేరుకోవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

April 13, 2026 / 05:00 PM IST

పాఠశాలలో ఘనంగా మహనీయుల జయంతోత్సవాలు

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహనీయుల జయంతోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ గతిని మార్చిన ముగ్గురు గొప్ప నేతలు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సేవలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్మరించుకున్నారు.

April 13, 2026 / 04:54 PM IST

ఆలయ పునఃప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జీ. కొండూరులో కొలువుదీరిన కార్యసిద్ధి శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద నవధాన్యాలు సమర్పించారు. ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

April 13, 2026 / 04:54 PM IST

బ్యాక్ లాగ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ.!

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బ్యాక్ లాగ్ టైపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీతో పాటు సీ.పీ.టీ ఉత్తీర్ణతతో భర్తీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు ఎన్. వెంకటరవణప్ప తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు APPLY చేసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 04:54 PM IST

‘అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి’

ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం డా.బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ స్కూల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును డీఎస్పీ శ్రావణ కుమార్ ప్రారంభించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:53 PM IST

158 వినతులు స్వీకరించిన కలెక్టర్

CTR: మండల స్థాయిలో పరిష్కరించగలిగిన అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వెదురుకుప్పం మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 158 వినతులను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అధికంగా అర్జీలు వస్తున్నాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 04:40 PM IST

చెరువు నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల

ATP: గుంతకల్లు మండలం వైటీ చెరువు తూము ద్వారా సాగునీరును మండల ఇంఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, రైతులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఆదేశాలతో రైతుల భూములకు సాగునీరును విడుదల చేశామన్నారు. చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

April 13, 2026 / 04:40 PM IST

శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షికోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

April 13, 2026 / 04:39 PM IST

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

PLD: సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 04:38 PM IST

ఈ నెల 22న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో జ్యోతి బసు ఓ ప్రకటనలో తెలిపారు. 22న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

April 13, 2026 / 04:38 PM IST

నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్టకు వినతిపత్రం అందజేత

NDL: స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ప్రతిష్టించాలని ఏపీ రెడ్డి సంఘం మహిళ అధ్యక్షురాలు సానం రెడ్డి సుహాసిని కోరారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. రాబోయే తరాలకు ఆయన త్యాగం తెలిసేలా కృషి చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరభ రెడ్డి, రమణారెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:36 PM IST

పరీక్షల్లో ఏల్చూరు విద్యార్థులు ప్రతిభ

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హిందీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన వివిధ స్థాయిల పరీక్షల్లో మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.

April 13, 2026 / 04:32 PM IST