• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల వేదిక

PLD: నరసరావుపేటలో రేపు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్ల తెలిపారు. సంబంధిత వర్గాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

April 24, 2026 / 10:09 PM IST

తెనాలిలో పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ

GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంహెచ్వో ఏసుబాబు పాల్గొని కార్మికులకు చెప్పులను అందజేశారు. కార్మికుల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రతి ఏడాది ఇచ్చే విధంగా ఈ సారి కూడా చెప్పులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

April 24, 2026 / 09:46 PM IST

SKR కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్

TPT: గూడూరులోని SKR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ సింహాద్రి పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ రావడంతో ఈ విషయంపై ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ సింహాద్రిని సస్పెండ్ చేస్తూ ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

April 24, 2026 / 09:23 PM IST

సంఘమిత్రాలకు మొబైల్ ఫోన్ల పంపిణీ

CTR: సంఘమిత్ర సోదరీమణులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం. థామస్ మొబైల్ ఫోన్లు అందజేశారు. పెనుమూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి, ఏపిఎం పరుశురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

April 24, 2026 / 09:20 PM IST

గిరిజన ప్రాంతాల్లో ఉత్సాహంగా జనగణన

PPM: జనగణన 2026లో భాగంగా జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ‘గిరిజన ప్రాంతాలు’ థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఆయన స్వయంగా గిరిజన గూడాలను సందర్శించి, స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. గిరిజనుల వివరాల నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. క్షేత్రస్థాయిలో గణన తీరును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

April 24, 2026 / 09:19 PM IST

జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

PLD: AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఈ నెల 29న ఎస్.ఎస్&ఎన్ కళాశాల నరసరావుపేటలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హృతిక్ శుక్ల తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

April 24, 2026 / 09:18 PM IST

మినీ వ్యాన్ బోల్తా.. మానవత్వం చాటిన స్థానికులు

కోనసీమ: ఆలమూరు మండలం మూలస్థానంలో జాతీయ రహదారిపై శుక్రవారం వాటర్ బాటిళ్ల లోడుతో వెళ్తున్న మినీవ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. వాటర్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. అటుగా వెళ్తున్న వారంతా వెంటనే ఆగి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై పడిన బాటిళ్లన్నీ ఏరి ఒకచోట చేర్చారు. మానవత్వం చచ్చిపోలేదని నిరూపించారు.

April 24, 2026 / 09:05 PM IST

ఎస్‌పీవై ఇండస్ట్రీస్‌లో ఈనెల 30న మాక్ డ్రిల్

నంద్యాలలోని ఎస్‌పీవై ఇండస్ట్రీస్‌లో ప్రమాదాల నివారణపై ఈనెల 30న మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. డీఆర్వో రాము నాయక్ ఈ కార్యక్రమంపై ఇవాళ వివరాలు వెల్లడించారు. విపత్తుల సమయంలో స్పందించే విధానంపై అధికారులకు అవగాహన కల్పించనున్నారు. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు కలిసి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

April 24, 2026 / 08:53 PM IST

‘పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం’

SKLM: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శుక్రవారం “డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగత, విధి సంబంధిత సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా ఎస్పీకి తెలియజేశారు. వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 24, 2026 / 08:52 PM IST

ప్రపంచ మలేరియా దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

సత్యసాయి: ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన పోస్టర్లను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, MLA పల్లె సింధూర రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల నివారణకు క్షేత్రస్థాయిలో యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని, హాస్టళ్లు, పాఠశాలల్లో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించాలని సూచించారు.

April 24, 2026 / 08:52 PM IST

చిలకలదోనలో కుల ధృవపత్రాలపై ఫిర్యాదు

KRNL: మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామంలో కొందరికి జారీ అయిన ఎస్సీ కుల ధృవపత్రాలను పరిశీలించి రద్దు చేయాలని దళిత నాయకులు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

April 24, 2026 / 08:50 PM IST

వాహన తనిఖీలు.. 201 మందిపై కేసు నమోదు

KDP: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన 201 మందిపై కేసులు నమోదు చేసి రూ.47,530ల జరిమానా విధించినట్లు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 24, 2026 / 08:50 PM IST

బంగారు పతకాలు సాధించిన జంగారెడ్డిగూడెం వాసి

ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుంకర నాగవాసు నాయుడు థాయిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్‌లో 5 KM రేస్ వాక్, 800 మీటర్ల రన్నింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. ఆయనను శుక్రవారం మాజీ DCCB ఛైర్మన్ కరాటం రాంబాబు దేశం తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించినందుకు ఆయనను ఘనంగా సత్కరించారు.

April 24, 2026 / 08:44 PM IST

ముమ్మరంగా కొనసాగుతున్నఉపాధి హామి పనులు

NTR: వీరులపాడు మండలంలోని పెద్దాపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వేసవి కాలంలో ఈ పనులు తమకు ఉపాధి కల్పిస్తున్నాయని కూలీలు తెలిపారు. ఉపాధి హామీ ద్వారా ఆదాయం లభించడం వల్ల కుటుంబ అవసరాలు నెరవేరుతున్నాయని అన్నారు. అధికారులు పనులను సమర్థంగా నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.

April 24, 2026 / 08:43 PM IST

ప్రొబేషనరీ ఎస్సైలకు ఎస్పీ మార్గదర్శకాలు

TPT: ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్లకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దిశానిర్దేశం చేశారు. పోలీస్ వృత్తి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత అని, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రొబేషన్ కాలాన్ని సమర్థంగా వినియోగించుకుని స్టేషన్ డ్యూటీ, కేసు దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై పట్టు సాధించాలని తెలిపారు.

April 24, 2026 / 08:42 PM IST