ఏలూరు రూరల్ మండలం కోమడ వోలు గ్రామంలో వివాహిత ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. అరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు నేపథ్యంలోని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూరల్ ఎస్సై జయ శర్మ ఐపీఎస్ అనుమానాస్పదగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 10 నుంచి 12 వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీపీఐ, బీకెఎంయూల ఆధ్వర్యంలో పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సీపీఐ నేతలు కోరారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలను ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 30వ తేదీ వరకు ఇచ్చిన గడువును పొడిగించిన విషయాన్ని ప్రజలు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
E.G: ఉండ్రాజవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ శనివారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
SKLM: శనివారం టెక్కలి నియోజకవర్గంలో MLC దువ్వాడ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నందిగాం మండలం, టెక్కలి మండలం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో మరణించిన కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించారు. అనంతరం కోటబొమ్మాళిలో చింతల సింహాద్రి కుమార్తె మరణించగా రూ.20,000 ఆర్థిక సహాయం అందజేసి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
PLD: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు మార్గం అమరావతి మీదుగా వెళ్లేలా డ్రాఫ్ట్ సిద్ధమైంది. అమరావతి పశ్చిమ బైపాస్, N-6 రోడ్డు మీదుగా ఈ ట్రాక్ వెళ్లనుంది. ప్రాజెక్టు వ్యయం రూ. 2,245 కోట్లతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57 కి.మీ మేర నిర్మాణం, కృష్ణా నదిపై 3కి.మీ పొడవైన రైల్వే బ్రిడ్జి, అమరావతిని మెట్రో నగరాలతో వేగంగా అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
అన్నమయ్య: గాలివీడు మండలం తూమకుంటలో నిర్మాణంలో ఉన్న 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేసి 4–5 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూమి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, ప్రాజెక్టు పూర్తయితే ప్రాంతీయ విద్యుత్ అవసరాలకు మద్దతు లభిస్తుందని తెలిపారు.
సత్యసాయి: లేపాక్షి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఈ నియామకం జరిగిందని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అధికారులు, సిబ్బందితో కలిసి సేవలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
BPT: వేటపాలెం మండలం రామాపురంలో శక్తి టీమ్ శనివారం విద్యార్థులతో సమావేశం నిర్వహించింది. ఆపదలో వెంటనే సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎలా ఉపయోగించాలో వివరించారు. సైబర్ మోసాలపై జాగ్రత్తలు, రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్ తప్పనిసరి విషయాలు తెలియజేశారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.
KRNL: కౌతాళం ZP పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా, సాంస్కృతిక వారోత్సవాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల HM సుధాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు సొసైటీ ఛైర్మన్ వెంకటపతి రాజు, టీడీపీ టౌన్ అధ్యక్షులు రాజనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
KDP: సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీల దైనందిన పరిపాలన, అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియమించారు. అందులో భాగంగా ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల, చిలంకూరు స్పెషల్ ఆఫీసర్‌గా ఎంపీడీవో వెంకటరమణయ్య శనివారం బాధ్యతలు చేపట్టారు.
ప్రకాశం: యర్రగొండపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ 2025-26 అవగాహనా సదస్సులో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్‌ను సమర్థంగా వినియోగించేందుకు అధికారులు సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎం.వి. సత్యనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
NDL: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు క్షేత్రస్థాయి పరిశీలన, మ్యాపింగ్, వర్షపు నీటి నిల్వ, ప్రజల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రాణాలికలను అమలు చేయడం అత్యవసరమని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో భూగర్భ జలాల పెంపుదలపై సంబంధిత శాకాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6 నుంచి జూలై14 వరకు 100 రోజుల్లో అమలు చేయాలని ఆదేశించారు.
GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మర్‌పేట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 1240 గ్రాముల గంజాయి, 6 బాటిల్స్ లిక్విడ్ గంజాయి, రూ.700 నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న కఠిన చర్యలు తప్పవన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 200 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సీపోర్ట్ CSR భాగంగా అందించిన ఈ మిషన్లతో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.