• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సాగర్ జలాలు నిలిచిపోవడంతో రైతుల ఆందోళన

ప్రకాశం: ముండ్లమూరు మండలం పరిధిలోని రాజానగరం మేజర్ నుంచి సింగనపాలెం మైనర్ వరకు సాగర్ జలాలు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట పైరుకంకి, పొట్ట దశలో ఉండగా ఈ సమయంలో నీరు అత్యవసరం అంటున్నారు. రెండు రోజులుగా నీరు రాకపోవడంతో ఎకరాకు రూ.30-40 వేల పెట్టుబడి ప్రమాదంలో పడిందని వాపోతున్నారు.

April 4, 2026 / 03:04 PM IST

సత్తెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

PLD: సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ ప్రమాదవశాత్తు కింద పడిపోగా వారిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

April 4, 2026 / 03:00 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే

VZM: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ శనివారం బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పూజలు చేసి నిరసన తెలిపారు.

April 4, 2026 / 02:54 PM IST

క్షేత్ర స్థాయిలో వైసీపీ బలోపేతానికి పిలుపు

VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతంపై సమావేశం జరిగింది. శనివారం సీతమ్మధారలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వార్డు, సచివాలయ కమిటీలు త్వరగా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:51 PM IST

‘కాంట్రాక్టు లెక్చరర్స్‌ను వేధించడం సరికాదు’

SKLM: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అండ్ గెస్ట్ లెక్చరర్స్‌కి వేసవిలో అడ్మిషన్ల కోసం ఫీల్డ్ వర్క్ చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

April 4, 2026 / 02:49 PM IST

పాలిసెట్‌కు అద్దంకిలో ఫ్రీ కోచింగ్ ప్రారంభం

BPT: అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో పాలిసెట్ పరీక్షకు ఈనెల 6 నుంచి 23 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ సాహిల్ బాబు తెలిపారు. పరీక్ష ఈనెల 25న జరగనుంది. విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందించబడుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

April 4, 2026 / 02:44 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

ASR: ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని చింతపల్లి ఎస్సై వెంకటరమణ తెలిపారు. చింతపల్లి ఏపీటీడబ్ల్యూ రెసిడెన్సియల్ పాఠశాల, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సీఐ వినోద్ బాబు ఆదేశాలతో, శనివారం ఈ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసినట్లు ఎస్సై తెలిపారు.

April 4, 2026 / 02:40 PM IST

‘సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి’

CTR: చిత్తూరు జిల్లా ప్రజలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఫేక్ లింకులు, QR కోడ్లు, OTP మోసాల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. OTP, PIN వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

April 4, 2026 / 02:38 PM IST

ఆకట్టుకుంటున్న అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన

GNTR: తెనాలి ఆటోనగర్‌లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించగా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళి వీటిని ప్రారంభించారు.

April 4, 2026 / 02:32 PM IST

‘చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయాలి’

NDL: పుట్టిన ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని ఇవాళ ఎంపీ హెచ్ఐఓ హుస్సేన్ రెడ్డి తెలిపారు. మహానంది మండలం అబ్బిపురం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రతి తల్లిని చైతన్యపరచి, ఒక్క చిన్నారికీ టీకా మిస్ కాకుండా చూడాలని పేర్కొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

గుంజనేరులో కింగ్ ఫిషర్ పక్షి దర్శనం

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని నరసరంపేట సమీపంలోని గుంజనేరులో శనివారం అరుదైన కింగ్ ఫిషర్ (లకుముకి పిట్ట) దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక యువకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పక్షిని వీక్షించారు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కలయికతో అందంగా కనిపించే ఈ పక్షి నీటి దగ్గర ఉండి చేపలను ఆహారంగా తీసుకుంటుంది.

April 4, 2026 / 02:30 PM IST

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీరు, కరెంట్, రోడ్లు, రెవెన్యూ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

‘ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైంది’

KRNL: టీడీపీ పార్టీలో భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైందని TDP రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ చిన్నతుంబలంలో సర్పంచ్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికలే మనకు టార్గెటని అన్నారు. చిన్న చిన్న మనస్పర్దాలతో పార్టీకి దూరంగా ఉండటం తగదన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

రామగిరిలో ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం

సత్యసాయి: రామగిరి మండలంలో దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలం, గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణపై ఆయన కూలంకషంగా చర్చించారు. ఈ శిక్షణ తరగతుల్లో మండల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:30 PM IST

చిన్నారికి భోజనం తినిపించిన మేయర్

నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్ స్థానిక వీఆర్ మున్సిపల్ పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా మేయర్, కమిషనర్లు తిని ఆహార నాణ్యతను పరీక్షించారు. అనంతరం మేయర్ చిన్నారులకు భోజనం తినిపించారు.

April 4, 2026 / 02:30 PM IST