• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో ఆలయ పాలకవర్గ నియామకానికి నోటిఫికేషన్

W.G: ఆకివీడులోని శ్రీ మదన గోపాల స్వామి ఆలయ పాలకవర్గ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఈవో అల్లూరి సత్యనారాయణ రాజు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ఆసక్తి గలవారు 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

April 15, 2026 / 08:00 PM IST

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన రైతుబిడ్డ

KDP: బద్వేల్ నియోజకవర్గం కాశినాయన(M) బసనపల్లికి చెందిన స్వరూప ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ పలితాల్లో 452 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆమె పదో తరగతిలో 596 మార్కులు సాధించింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన స్వరూప ఈ విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమె ప్రతిభను కొనియాడింది.

April 15, 2026 / 08:00 PM IST

పత్తికొండలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

KRNL: పత్తికొండలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్యాం బాబు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. హంద్రీనీవా నీటితో చెరువులు నింపి రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతామని హామీ ఇచ్చారు. నాయకులు విభేదాలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇవాళ సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 15, 2026 / 08:00 PM IST

తురకపల్లిలో పోషణ పక్వాడ

ప్రకాశం: కనిగిరి మండలం తురకపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల బాలింతలు, శిశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వారి శారీరక, మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు.

April 15, 2026 / 07:58 PM IST

లోకేష్‌కు అభినందనలు తెలిపిన రవి కుమార్

BPT: టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ నియామకంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వానికి లభించిన గౌరవమే ఈ పదవి అని పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి యువత అధికంగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చారని చెప్పుకొచ్చారు.

April 15, 2026 / 07:53 PM IST

రూ. 5కే అన్న క్యాంటీన్‌లో భోజనం: ఎమ్మెల్యే

ATP: బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను MLA బండారు శ్రావణి ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ADCC బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు పాల్గొన్నారు.

April 15, 2026 / 07:50 PM IST

లేపాక్షి దేవస్థాన ధర్మకర్తల దరఖాస్తులు ప్రారంభం

సత్యసాయి: లేపాక్షి గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి గల వారు దేవస్థానం కార్యాలయంలో ఫారాలు పొందవచ్చు. 20 రోజుల్లోపు పూర్తి చేసి జిల్లా దేవాదాయ శాఖ అధికారికి సమర్పించాలని ఈవో ఎం.హెచ్ నరసింహమూర్తి తెలిపారు.

April 15, 2026 / 07:50 PM IST

కన్నాకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి

PLD: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి ఆయన సేవలు మరింత బలోపేతం అవుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. విలువల ఆధారిత రాజకీయాలకు కట్టుబడి ఉన్న నేతగా కన్నాను ప్రశంసిస్తూ, ఈ నియామకంతో కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపబడిందని తెలిపారు.

April 15, 2026 / 07:45 PM IST

ఇంటర్ ఫలితాలలో పూర్తిగా వెనుకబడ్డ కరప గర్ల్స్ కళాశాల

KKD: కరప జెడ్పీ హైస్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యంత వెనుకబడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు. బైపీసీలో 18 మందికి కేవలం ఏడుగురే పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలోనూ ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి.

April 15, 2026 / 07:44 PM IST

రాజంపేటలో దివ్యాంగ శక్తి బస్సు పాసుల పంపిణీ

KDP: రాజంపేటలో దివ్యాంగ శక్తి పథకం కింద బస్సు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నిర్వహించారు. ఒక్కో పాస్‌కు రు.100 చొప్పున 2000 మందికి పైగా దివ్యాంగులకు సొంత నిధులతో చెల్లించి పాసులు అందజేశారు. ఇంటి వద్దకే పత్రాలు సేకరించి పాసులు ఇవ్వడం ద్వారా సమయం, ఖర్చు తగ్గించినట్లు తెలిపారు.

April 15, 2026 / 07:40 PM IST

మణికంఠేశ్వర స్వామి ఆలయంలో పూజలు

CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్‌తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు

April 15, 2026 / 07:38 PM IST

బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జొన్నవాడ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

April 15, 2026 / 07:35 PM IST

‘జనగణనతోనే ప్రజా సంక్షేమం’

PLD: చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో సెన్సెస్-2027 రెండో విడత శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ తిరుపతి స్వామి పాల్గొని ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. మొబైల్ యాప్‌ల ద్వారా డేటా సేకరణపై అవగాహన కల్పించారు. కచ్చితమైన గణాంకాలతోనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. మొత్తం నాలుగు బ్యాచ్‌లకు గానూ రెండో బ్యాచ్ శిక్షణ పూర్తయింది.

April 15, 2026 / 07:34 PM IST

పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. లేఔట్లలో పేకాట ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. 3400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి గురించి సమాచారం ఇవ్వాలని ఎస్సై వేమన కోరారు.

April 15, 2026 / 07:32 PM IST

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా మంతెన రామరాజు

W.G: టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యునిగా మంతెన రామరాజు నియమితులయ్యారు. ఉండి ఎమ్మెల్యేగా 2019 -24 వరకు ఆయన సేవలందించారు. రఘురామరాజుకు టికెట్ ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఆయనను నియమించింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. సౌమ్యుడిగా పేరు పొందిన రామరాజును పోలిట్ బ్యూరో సభ్యునిగా తీసుకుంది.

April 15, 2026 / 07:30 PM IST