ప్రకాశం: ముండ్లమూరు మండలం పరిధిలోని రాజానగరం మేజర్ నుంచి సింగనపాలెం మైనర్ వరకు సాగర్ జలాలు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట పైరుకంకి, పొట్ట దశలో ఉండగా ఈ సమయంలో నీరు అత్యవసరం అంటున్నారు. రెండు రోజులుగా నీరు రాకపోవడంతో ఎకరాకు రూ.30-40 వేల పెట్టుబడి ప్రమాదంలో పడిందని వాపోతున్నారు.
KRNL: ఆదోని పట్టణంలోని శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాలలో నిన్న పాఠశాల పెచ్చులూడీ బాలుడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై SFI నాయకులు గౌస్, జగన్, ఉమాకాంత్ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌ను ఇవాళ కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, విద్యార్థుల వైద్య ఖర్చులను యాజమాన్యం భరించాలని అన్నారు.
GNTR: కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో తెనాలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తునిశివకుమార్, నాయకులు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందించి బదిలీపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా వెళ్తుండడంతో ఆమెకు శనివారం కలెక్టరేట్‌లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ , సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యూనియన్ అధ్యక్షులు నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు.
NDL: ప్యాపిలి మండల బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా శివకేశవ్ శనివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
NLR: రాష్ట్రంలో అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ మాజీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అని బుచ్చి రూరల్ అధ్యక్షుడు జగదీష్ అన్నారు. బుచ్చిలో మాట్లాడుతూ.. నియోజవర్గంలో అవినీతి జరుగుతుందని తప్పుడు రాతలు రాయిస్తున్నారని… అవినీతి జరిగితే నిజంగా నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అవినీతికి ప్రోత్సహించరని చెప్పారు.
ELR: కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం Y జంక్షన్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు శనివారం నిరసన చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలుపుతున్న టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని ప్రత్యేక పూజలు చేశారు.
సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని ట్యాంక్ సర్కిల్ వద్ద రూ.40 లక్షల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, స్లాబ్ కల్వర్ట్, డ్రైన్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. పట్టణ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ATP: అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన చిన్ననాటి స్నేహితులు శనివారం కలుసుకున్నారు. వీరంతా 1969 నుంచి 1976 వరకు అనంతపురంలోని చర్చి పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకోవడం విశేషం. చాలా కాలం తర్వాత కలిసిన మిత్రులను మంత్రి ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
NTR: జగ్గయ్యపేటలో వైసీపీ నాయకులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నేతృత్వంలో సీతారాంపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలు ఆపాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తప్పించాలని అన్నారు.
KKD: సామర్లకోట మున్సిపల్ రక్షిత మంచినీటి సరఫరా పైప్ లైన్ లీకవ్వడంతో తాగునీరు వృథాగా రోడ్లపాలవుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి సీపీఎం సెంటర్ వెళ్లే ప్రధాన రహదారిలో గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ ప్రమాదవశాత్తు కింద పడిపోగా వారిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
VZM: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ శనివారం బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పూజలు చేసి నిరసన తెలిపారు.
VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతంపై సమావేశం జరిగింది. శనివారం సీతమ్మధారలో సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వార్డు, సచివాలయ కమిటీలు త్వరగా పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
SKLM: ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అండ్ గెస్ట్ లెక్చరర్స్‌కి వేసవిలో అడ్మిషన్ల కోసం ఫీల్డ్ వర్క్ చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.