• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం చినభోగిలి గ్రామంలోని శ్రీ రామాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

April 16, 2026 / 04:44 PM IST

డ్వాక్రా సంఘాల శిక్షణ కార్యక్రమం

VZM: జామి మండలం కుమారం గ్రామంలో గురువారం ACLP డ్వాక్రా సంఘాల శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ క్రెడిట్ లైలీవుడ్ ప్లాట్స్, వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక వంటి అంశాల మీద చర్చించారు.

April 16, 2026 / 04:43 PM IST

అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి: ఎమ్మెల్యే

ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇవాళ పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 16, 2026 / 04:40 PM IST

శ్రీశైలం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: YCP

KRNL: రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ ధ్వజమెత్తింది. రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనను గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేసింది.

April 16, 2026 / 04:40 PM IST

‘గిట్టుబాటు ధర కల్పించాలి’

SKLM: మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రణస్థలం మండలం నగరపాలెంలో పంటను గురువారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. క్వింటాలు రూ. 2400 నుంచి రూ. 1600కి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

April 16, 2026 / 04:38 PM IST

‘ఎన్‌సీడీ సర్వే వేగవంతం చేయాలి’

బాపట్ల: జిల్లాలో ఎన్‌సీడీ సర్వే జాప్యంపై కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూరుశాతం సర్వే పూర్తయ్యేలా చూడాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఆభా(ABHA) ఐడీల ద్వారా వైద్యసేవల డిజిటలైజేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే, ఆయుర్వేద ఆస్పత్రుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

April 16, 2026 / 04:34 PM IST

అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధి: ఎమ్మెల్యే

NDL: డోన్ క్లబ్ హౌస్‌లో మెప్మా ఆర్‌పీలు, సిబ్బందితో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పథకాల అమలులో వేగం పెంచాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు లింకేజులపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

April 16, 2026 / 04:33 PM IST

‘అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి’

W.G: అగ్ని ప్రమాదాల నివారణపై ముఖ్యంగా మహిళలు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్ ఆఫీసర్ ఐ. అజయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ తణుకు పట్టణ పరిధిలోని పలు అపార్ట్‌మెంట్ల ఆవరణలో మహిళలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు జరిగినప్పుడు నివారణకు తీసుకోవలసిన అత్యవసర చర్యలపై వారికి అవగాహన కల్పించారు.

April 16, 2026 / 04:30 PM IST

మర్రిపూడిలో పెయ్యదూడల 56వ ప్రదర్శన సభలో

ప్రకాశం: గ్రామీణ సంపద పెంపుదలకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ఎంతో మేలని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మర్రిపూడిలో డాక్టర్ మని శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ప్రదర్శన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దూడల కోసం ప్రత్యేక టీకాను కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

April 16, 2026 / 04:22 PM IST

PAC సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: వెలగపూడి అసెంబ్లీ భవనంలో ఇవాళ జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆడిట్ అంశాలు, టెండర్ డిస్కౌంట్ మాఫీ వల్ల పెరిగిన వ్యయంపై చర్చించారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు.

April 16, 2026 / 04:20 PM IST

పాంప్లెట్‌లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవీ

PLD: జనాభా గణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన కార్యాలయంలో జనాభా గణన, ఇళ్ల జాబితా, గృహ గణన కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌లు, పాంప్లెట్‌లను గురువారం ఆవిష్కరించారు. ప్రతి కుటుంబం తమ ఇళ్ల స్థితిగతులు, కుటుంబ వివరాలను గణన అధికారులకు నిజాయితీగా తెలియజేయాలని సూచించారు.

April 16, 2026 / 04:19 PM IST

‘గిరిజన సమస్యలు పరిష్కరించాలి’

ASR: గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నూతన కలెక్టర్, ఐటీడీఏ పీవోలను కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గిరిజనేతరులు 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. గిరిజన హక్కుల రక్షణ కోసం 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.

April 16, 2026 / 04:14 PM IST

జాతర మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గరికపాలెం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

April 16, 2026 / 04:13 PM IST

విశాఖలో కార్డాన్ సెర్చ్

విశాఖ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ గురువారం నిర్వహించారు. త్రీ టౌన్, పెందుర్తి స్టేషన్ల పరిధిలోని ఇళ్లను, వాహనాలను నిశితంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు నేరాల నియంత్రణకు దోహదపడతాయని పోలీసులు తెలిపారు.

April 16, 2026 / 04:11 PM IST

విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

PPM: సీతానగరం మండలం జోగింపేట అంబేద్కర్ గురుకులంలో పిల్లలకు గురువారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLHP నవీన్ జ్వరం, జలుబు, దగ్గు, స్కిన్ ఎలర్జీ, హీమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు పౌష్టిక ఆహారం, నిద్ర, వ్యక్తిగత, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్‌పై అవగాహన కల్పించారు.

April 16, 2026 / 04:11 PM IST