ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు గురువారం సీఎన్ఎన్ యాప్‌తో కొత్త విధానంతో 2026-27 జనగణనపై ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. జన గణనకు ఎన్నికల మాదిరిగా క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
CTR: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా పులిచెర్ల మండలం వెంకటదాసరిపల్లె మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులును నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఈయన వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించడంతో ఈ పదవి లభించింది. తను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సత్యసాయి: నేరాల అదుపునకు డ్రోన్లు, సీసీ కెమెరాల వాడకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సీకే పల్లికి చెందిన దాత రామ్మూర్తి గురువారం రూ.7 లక్షల విలువైన 49 సీసీ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, సిమ్ కార్డులను అందజేశారని ఆయన తెలిపారు. వీటిని జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
NLR: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న కేసు విచారణలో ఇద్దరికి తుది తీర్పు వచ్చింది. 2021లో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎనిమిది కేజీల గంజాయిని తమిళనాడుకు తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం జిల్లా కోర్టు ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.
CTR: పుంగనూరు నియోజకవర్గ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం అధ్యక్షులుగా వరదారెడ్డిని నియమిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ATP: ఈ నెల 20న CM చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం తిమ్మాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
TPT: శ్రీహరికోట నూతన ఎస్సైగా భాను నియమితులయ్యారు. ఆమె గతంలో నాయుడుపేట పట్టణ ఎస్సైగా పనిచేశారు. బదిలీపై శ్రీహరికోటకు వచ్చారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలిపారు. శ్రీహరికోట స్టేషన్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టి అరికడతానన్నారు.
GNTR: ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరూ కొంతసేపు పరస్పరం ఆత్మీయంగా ముచ్చటించారు. అలాగే, పట్టణంలోని పలు రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
సత్యసాయి: పెనుకొండకి చెందిన కె.అనిత శ్రీనివాసులు కుమార్తె లహరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. ఆమె 972 మార్కులు సాధించి A గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. లహరి సాధించిన ఈ విజయంపై పట్టణంలోని ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లహరిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అల్లవరం మండలం సముద్ర తీరం కొమరిగిరిపట్నం, ఓడరేవు ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలలో జేసీబీలతో తీర ప్రాంతాన్ని తవ్వేస్తున్నారని చెప్తున్నారు. దీని వలన తీర ప్రాంతం అంతా గోతులు పడుతున్నాయని, వీటి వలన ప్రాణహాని కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ELR: చింతలపూడిలో గురువారం స్వీయ గణన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈనెల 30 వరకు స్వీయ గణనకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. మే ఒకటి నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.
CTR: ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థిని క్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. CEC విభాగంలో ముత్తుకూరుకు చెందిన క్యాతిప్రియ 491 మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు.
విశాఖ: మాతృభాష రక్షణకు ‘తెలుగుదండు’ సమరభేరి మోగించింది. తెలుగు భాషా సంరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సంస్థ అధ్యక్షుడు పరవాస్తు సూరి తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో “మాతృభాషాభివృద్ధికి మార్గమేమి?” అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ATP: గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సత్యసాయి తాగునీటి కార్మికులు ధర్నా చేపట్టారు. తాగునీటి కార్మికులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. తాగునీటి కార్మికులకు బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలను చెల్లించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ పుణ్యవతికి అందజేశారు.
అల్లూరి: నెల్లూరు నవాబుపేటలో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, పలువురికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.