• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

కోనసీమ: మండపేట ఏడిద కొత్తపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జడ్పీటీసీ కురిపూడి భవాని రాంబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీ హరిబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.

April 5, 2026 / 10:40 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: DIG

KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్‌ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 10:40 AM IST

కలెక్టరేట్‌ను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

కాకినాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌ను శనివారం సాయంత్రం పిఠాపురం మాజీ MLA వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వర్మ తెలిపారు. 

April 5, 2026 / 10:15 AM IST

రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

CTR: విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి డివిజన్ పరిధిలో ప్రత్యేక అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ అదాలత్ రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించబడనుంది. వినియోగదారులు తమ సమస్యలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బిల్లుల వివాదాలు, కనెక్షన్ సమస్యలు, మీటర్ లోపాలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు.

April 5, 2026 / 10:15 AM IST

ప్రత్యేక హోదా లేకుండానే రాజధాని సంబరాలా..?

TPT: ప్రత్యేక హోదా సాధించలేని కూటమి నాయకులు అమరావతి రాజధాని చట్టబద్ధతపై సంబరాలు జరపడం విచిత్రమని సీనియర్ రాజకీయ నాయకుడు డా. వి.పి. కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హోదా హామీ నెరవేర్చలేకపోయారని, హోదా వల్లే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

April 5, 2026 / 10:14 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

ఎన్టీఆర్: విజయవాడ వన్ టౌన్ ఎస్ఐ భాగ్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన మద్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు. రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 5, 2026 / 10:07 AM IST

వడ్లపూడి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 10:03 AM IST

అమరావతి నిర్ణయానికి దీపోత్సవం

KRNL: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఆలూరులో ‘ఇంటింటికీ దీపోత్సవం’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని ఇంఛార్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 10:02 AM IST

జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ

అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసులను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో చేరాలని ఎస్పీ కార్యాలయం అధికారులు తెలిపారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం.

April 5, 2026 / 10:00 AM IST

బిడ్డ సాకుతో హారం మాయం: ముగ్గురి అరెస్ట్

E.G: రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తున్న బస్సులో మాయచేసి బంగారు హారం దొంగిలించిన ఘటన జరిగింది. చంటి బిడ్డకు పాలు కలపాలని చెప్పి బాధితురాలి దృష్టి మళ్లించి బ్యాగులోని 24 గ్రాముల హారం అపహరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

April 5, 2026 / 10:00 AM IST

రొద్దంలో రేపు ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో సోమవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ పర్యటించనున్నారు. ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కన్వీనర్ బి.తిమ్మయ్య కోరారు.

April 5, 2026 / 10:00 AM IST

మాజీ ఎమ్మెల్యేపై మంత్రి బీసీ సతీమణి ఆగ్రహం

NDL: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లెలో అంతే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రవీంద్రనాథ్ రెడ్డి తనపై, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 5, 2026 / 10:00 AM IST

అప్పనపల్లె పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో

KDP: ఖాజీపేట మండల వ్యాప్తంగా ఉన్న 21 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా అప్పనపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారిగా MPDO దివిజ సంపతిని నియమించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పంచాయతీలో సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.

April 5, 2026 / 10:00 AM IST

స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ATP: అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.240 గుంతకల్లులో రూ.240, స్కిన్‌లెస్ రూ.260 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు రిజ్వాన్ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి.

April 5, 2026 / 09:40 AM IST

సింగరకొండలో మృతదేహం కలకలం.. వ్యక్తి గుర్తింపుపై అన్వేషణ

బాపట్ల: అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం బయటపడటం ఆందోళన కలిగించింది. మినీ స్టేడియం సమీపంలోని రోడ్డుపై ఆదివారం ఉదయం శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 09:37 AM IST