• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

111 మంది రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన కలెక్టర్

NDL: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూములు, 22ఏ-1 నిషేధిత జాబితా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ 111 మంది రైతులకు డీ-నోటిఫికేషన్ క్లియరెన్స్ పత్రాలను అందజేసినట్లు కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు ఈ పత్రాలను పంపిణీ చేశారు 150 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. 111 పరిష్కరించామన్నారు.

April 11, 2026 / 10:00 PM IST

కడపలో నీటి కాలుష్యంపై కమిషనర్ ఫీల్డ్ విజిట్

కడప నగరంలో నీటి కాలుష్యంపై ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రాకేశ్ చంద్ర ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకేజీ మరమ్మతు పనుల్లో ఆలస్యం జరిగినప్పటికీ, వాటిని వేగవంతం చేసి మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

April 11, 2026 / 10:00 PM IST

కృత్రిమ అవయవాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: ద్వారకతిరుమలలోని విర్డ్ హాస్పిటల్‌లో క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలను శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విర్డ్ హాస్పిటల్ అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం అన్నారు. ఎముకల సంబంధిత చికిత్సలు, కృత్రిమ అవయవాల పంపిణీలో వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి కొత్త ఆశలు నింపుతున్నాయన్నారు.

April 11, 2026 / 10:00 PM IST

ఆసుపత్రి వార్డు తనిఖీ చేసిన సూపరింటెండెంట్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు AMC వార్డును తనిఖీ చేశారు. ఎలక్ట్రికల్ పనులు, ఆక్సిజన్ ప్యానెల్ బోర్డుల అమరికను పరిశీలించి నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించి సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

April 11, 2026 / 10:00 PM IST

ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

KDP: ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. శనివారం ఇంట్లోనే వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

April 11, 2026 / 09:30 PM IST

దాడి కేసులో నిందితుని అరెస్టు

PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ పరిసరాల్లో మహిళపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ముప్పాళ్లకు చెందిన చైతన్యపై మార్చి 16 రాత్రి దాడి జరగగా, బంగారం, సిల్వర్ రింగ్స్ దోచుకెళ్లినట్లు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకుని నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 11, 2026 / 09:26 PM IST

‘ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి’

AKP: చీడికాడ మండలం బైలపూడి ఎంపీపీ పాఠశాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని గ్రామంలో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలతో పాటు వివిధ రకాల కిట్లు అందజేయడం జరుగుతుందన్నారు.

April 11, 2026 / 09:03 PM IST

ప్రాణం ఖరీదు రూ.26 కోట్లు

GNTR: తెనాలికి చెందిన చిన్నారి అశ్వర్త్ గురుదత్త అరుదైన DMD వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.26 కోట్లు అని వైద్యులు తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్స్‌ను ఆశ్రయించి ప్రజలు, ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు బాబు తండ్రి హరీష్ కుమార్ నంబర్ 9700365341ను సంప్రదించగలరు.

April 11, 2026 / 09:01 PM IST

జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ

TPT: శ్రీకాళహస్తిలో ఈనెల 15న జరగనున్న జాబ్ మేళా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆవిష్కరించారు. జేఎన్టీయూఏ–స్కిట్‌లో నిర్వహించే ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొని 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 11, 2026 / 09:00 PM IST

మద్దిలేటి స్వామి సన్నిధిలో MLA కోట్ల పూజలు

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్‌.ఎస్‌. రంగాపురంలో వెలసిన శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 11, 2026 / 09:00 PM IST

హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

ELR: కొయ్యలగూడెం తారకరామ నగర్ అత్త పోల మంగమ్మను నరికి చంపిన అల్లుడు కేదారి పుల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అచ్యుతాపురం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అత్తని హత్య చేశాడని పోలీసులు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు.

April 11, 2026 / 09:00 PM IST

అక్రమ కట్టడాల తొలగింపులో అంతరాయం

NLR: బుచ్చి పట్టణం పెద్దూరులో అనుమతులు లేకుండా గుడిని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తుండటంతో సుమతి అనే మహిళ అడ్డుకుంది. తనను JCBతో కొట్టిన తర్వాతే ధ్వంసం చేయాలని బైఠాయించింది. గ్రామానికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో గుడిని ఏర్పాటు చేస్తున్నామని… రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.

April 11, 2026 / 08:56 PM IST

‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్‌ను ఆవిష్కరించిన సినీనటి

SKLM: పట్టణంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి శనివారం సినీనటి నేహా శెట్టి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె చేతుల మీదుగా జిల్లా పోలీసు శాఖ ‘డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం, నారి శక్తి’ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌తో కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

April 11, 2026 / 08:51 PM IST

అర్ధవీడులో బాలుడు అదృశ్యం

ప్రకాశం: అర్ధవీడు మండలానికి చెందిన బైనముక్కల రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం అతను కనిపించకుండా పోయినట్లు బాలుడి తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటికే అర్ధవీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే దయచేసి 7032669045 నంబర్‌కు సమాచారం అందించాలని బాలుడి తల్లి విజ్ఞప్తి చేసింది.

April 11, 2026 / 08:46 PM IST

కోర్టును మభ్యపెట్టడంతో నిందితుడికి రిమాండ్

VZM: 2024 ఎస్.కోట పోలీసు స్టేషన్‌లో గంజాయి కేసులో రెండో ముద్దాయి నక్క వెంకటరమణపై నమోదైన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ నారాయణమూర్తి శనివారం తెలిపారు. నాసిక్ చెందిన జావేద్‌కు బెయిల్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పత్రాలు పరిశీలించగా తప్పుడు పత్రాలుగా తేల్చడంతో కేసు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

April 11, 2026 / 08:43 PM IST