• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తేలప్రోలులో నేడు ప్రజాదర్బార్

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో సోమవారం సాయంత్రం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను, వినతులను నేరుగా తెలియజేసి పరిష్కారం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

April 13, 2026 / 09:13 AM IST

పులివెందుల రూరల్ సీఐ బదిలీ

KDP: పులివెందుల రూరల్ సీఐగా పనిచేస్తున్న సీతారామిరెడ్డి రెడ్డిని నంద్యాల డీటీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో రూరల్ ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శాంతిలాల్‌ను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పులివెందుల ట్రాఫిక్ సీఐగా మంత్రాలయంలో పనిచేస్తున్న రామాంజులను నియమించారు. ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

April 13, 2026 / 09:10 AM IST

‘ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి’

CTR: డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ ఒక ప్రటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 09:08 AM IST

కొండవీడు కోటలో నైట్ టెంట్ క్యాంపింగ్

పల్నాడు: జిల్లాలోని కొండవీడు కోటపై అటవీశాఖ ప్రత్యేకంగా నైట్ క్యాంపింగ్‌ను ప్రారంభించింది. టెంట్లలో రాత్రి బస, క్యాంప్ ఫైర్, మ్యూజికల్ నైట్, ఉదయపు సూర్యోదయ వీక్షణ వంటి ఆకర్షణలు ఉంటాయి. పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1000గా ఫీజు నిర్ణయించారు. ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా ఏర్పాటు చేశారు.

April 13, 2026 / 09:07 AM IST

ఈనెల 16న తిరుపతిలో చాగంటి ప్రవచనం

తిరుపతి: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న తిరుపతి మహతి కళాక్షేత్రంలో విశేష ధార్మిక ప్రవచనం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువలు& ధార్మిక సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై ప్రవచనం ఇవ్వనున్నారు.

April 13, 2026 / 09:05 AM IST

పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై జేసీ ధ్వజం

ATP: పెన్నానది ఆక్రమణల ఆరోపణలపై తాడిపత్రి మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ రక్షణ కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఆక్రమణలుగా చిత్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతులతోనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ పనులు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

April 13, 2026 / 09:00 AM IST

అనారోగ్యంతో యువకుడి మృతి

KRNL: ఆదోనిలోని జంకన్వాడీ కాలనీకి చెందిన అమిన్ అస్వో (39) క్యాన్సర్, అల్సర్ వంటి అనారోగ్యాలతో మనస్తాపానికి గురై ఈనెల 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 13, 2026 / 08:41 AM IST

సహజీవనం చేస్తూ ఆత్మహత్య.. మృతదేహం నిరాకరణ

KDP: ప్రొద్దుటూరు లింగాపురంలో సహజీవనం సాగిస్తున్న రామాంజనేయులు, ప్రమీల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమీల మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు భర్త ఐజాక్, ఇటు బంధువులు రాలేదు. పోలీసులు సమాచారమిచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె మృతదేహం ప్రొద్దుటూరు ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు. మున్సిపాలిటీ, స్వచ్ఛంద సంస్థల దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

April 13, 2026 / 08:36 AM IST

పరిసరాలను పరిశుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం రామానాయుడుపేట నుంచి ఐదు రోడ్ల సెంటర్ వరకు నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ సోమవారం పాల్గొని, పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడబడితే అక్కడ వేయరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

April 13, 2026 / 08:33 AM IST

తిరుపతిలో భార్యాభర్త అరెస్ట్

TPT: తిరుపతిలో ఆదివారం గంజాయి పట్టుబడింది. పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన ఉమాపతి, ధనలక్ష్మి దంపతులు దామినేడుకు వెళ్లారు. అక్కడ జోసెఫ్ వద్ద గంజాయి తీసుకుని, బైకుపై తిరుపతికి తెస్తుండగా లక్ష్మీపురం సర్కిల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10కేజీల గంజాయి, బైక్, రూ.22,900, ఫోన్లు, బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.

April 13, 2026 / 08:30 AM IST

పశ్చిమలో కార్మిక శాఖ మంత్రి పర్యటన

పశ్చిమ గోదావరిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జ్ బాబ్జీ నిర్మాణంలో ఉన్న పలు కట్టడాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో, సరైన వేతనాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. నిర్మాణంలో భవనాలకు విధిగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

April 13, 2026 / 08:27 AM IST

వేసవి ఎఫెక్ట్ రెండు బోర్లు ప్రారంభం

బాపట్ల: వేసవి ఎండలు ముదురుతున్న వేళ గ్రామ ప్రజల అవసరాల కోసం సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు పంచాయతీలో ఈరోజు రెండు కొత్త చేతి పంపు బోరు బావులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ విజయ్ బాబు మాట్లాడుతూ.. గ్రామస్తులకు తాగునీటి కష్టాలు కలగకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

April 13, 2026 / 08:25 AM IST

అవుకుమెట్టలో ఇళ్ల స్థలాల పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె నియోజకవర్గం అవుకుమెట్ట ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం నిర్ణయించిన భూములను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భూమి చదును, జంగిల్ క్లియరెన్స్ పనులను పర్యవేక్షించిన ఆయన, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా చదును చేయాలని ఆదేశించారు.

April 13, 2026 / 08:25 AM IST

నేడు డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమం

NLR: నెల్లూరు విద్యుత్ భవన్ లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించబడుతుందని 0861-2320427 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం తెలిపారు. ఇవాళ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారాలు పొందాలని సూచించారు.

April 13, 2026 / 08:23 AM IST

నేడు ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం10:30 గంటలకు జరిగే మేళాలో ప్రముఖ కంపెనీల్లో పనిచేసేందుకు పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివిన 45 ఏళ్ల లోపు వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలను తీసుకొని సకాలంలో హాజరుకావాలని సూచించారు. 

April 13, 2026 / 08:23 AM IST