• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

SKLM: ఉత్తరాంధ్ర ఇరవై వేలుకు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి 51 వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ నుంచి 3 రోజులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సన్యాసిరావు తెలిపారు. ప్రతిరోజు సా.4 నుంచి రాత్రి 11 గంటల వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.

April 25, 2026 / 07:40 AM IST

‘సార్వజనిక సేవలు సౌకర్యవంతంగా అందించటమే లక్ష్యం’

VZM: ప్రజలకు సార్వజనిక సేవలను మరింత సౌకర్యవంతంగా అందించే లక్ష్యంతో మదర్‌ ఫీడింగ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను హెడ్ పోస్టాఫీలో పోస్టుమాష్టర్ జనరల్ వియస్ జయశంకర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ… ఈ కొత్త సౌకర్యాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడంలో సహాయ పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కే. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

April 25, 2026 / 07:35 AM IST

నేడే పాలీసెట్.. నిమిషం నిబంధనతో అప్రమత్తం

VSP: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందన్నారు. ఓఎంఆర్ షీట్లపై అవగాహన కోసం గంట ముందే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 44 కేంద్రాల్లో 14,689 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

April 25, 2026 / 07:33 AM IST

యువతకు క్రీడా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుచ్చిరెడ్డిపాళెం పట్టణ యువతకు క్రీడా కిట్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.

April 25, 2026 / 07:30 AM IST

రచ్చబండను ప్రారంభించిన ఎమ్మెల్యే

పార్వతీపురం పట్టణం కొత్తవలస పెద్దవీధిలో కీర్తిశేషులు కోరాడ రాములు జ్ఞాపకార్థం ఆయన భార్య కోరాడ అన్నపూర్ణమ్మ, కుమారుడు 8వ వార్డు మాజీ కౌన్సిలర్, ఎక్స్ ఆర్మీ కోరాడ నారాయణరావుతమ సొంత ఖర్చులతో నిర్మించిన రచ్చబండను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ముందుగా పెద్దవీధిలో గల శ్రీ కొత్త పోలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

April 25, 2026 / 07:30 AM IST

తెనాలి ఈ వార్డుల్లో నీటి సరఫరా బంద్

GNTR: తెనాలి హెడ్ వాటర్ ట్యాంక్ పరిధిలోని 1, 2, 3, 4, 5, 7, 11, 16, 35, 36, 37, 38, 39, 40 వార్డులకు శనివారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. సాయంత్రం నుంచి అన్ని వార్డులకు సరఫరా ఇవ్వడం జరుగుతుందన్నారు. దుగ్గిరాల వద్ద ఇరిగేషన్ పనుల కారణంగా తూర్పు కాల్వకు నీటి విడుదల లేక ఈ అంతరాయం కలుగుతుందన్నారు.

April 25, 2026 / 07:28 AM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ అంబిక

ATP: అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు MP అంబిక లక్ష్మీనారాయణ అందజేశారు. పెద్దవడుగూరు, బుక్కరాయసముద్రం, గుత్తి, కంబదూర్ మండలాలకు చెందిన 10మంది లబ్ధిదారులకు రూ. 5,24,134ల ఆర్థిక సహాయం లభించింది. పేద ప్రజలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నుంచి ఈ సాయం అందించడంపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. 

April 25, 2026 / 07:21 AM IST

నేడు శిరస్త్రాణ ధారణపై అవగాహన ర్యాలీ: SP

SKLM: రహదారి భద్రతలో భాగంగా శిరస్త్రాణ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇవాళ నగరంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామలక్ష్మణ కూడలి నుంచి సూర్యమహల్, అరసవల్లి కూడలి వరకు ఈ ర్యాలీ సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు.

April 25, 2026 / 07:21 AM IST

అభివృద్ధి పనులకు MLA భూమిపూజ

KRNL: కల్లూరు అర్బన్ పరిధిలో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు భూమిపూజలు నిర్వహించారు. 35వ వార్డులో గోడల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రూ.30 లక్షలతో లే అవుట్‌లో WBM రోడ్డు, 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో అంగన్వాడి కేంద్రం వద్ద రూ.60 లక్షలతో డ్రెయినేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో యువ నేత గౌరు జనార్దన్ రెడ్డి ఉన్నారు.

April 25, 2026 / 07:21 AM IST

కివ్వాకలో పోలీసుల పల్లె నిద్ర

ELR: కుక్కునూరు(M) కివ్వాక గ్రామంలో గతరాత్రి పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. సిఐ రమేష్ బాబు, ఎస్సై రాజారెడ్డిలు మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజల ఆర్థిక స్థితిగతులను నాశనం చేసే జూద క్రీడల వైపు వెళ్లకుండా ఉండాలన్నారు. మహిళల రక్షణ కొరకు తయారు చేసిన శక్తి యాప్ వినియోగాన్ని వివరించారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహభావం పెరగడానీ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

April 25, 2026 / 07:21 AM IST

విద్యుత్ వైర్లు చోరీ.. వ్యక్తి అరెస్ట్

CTR: పులిచెర్ల మండలం కల్లూరు పరిసరాల్లో వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ వైర్లను చోరీ చేసిన కేసులో నిందితుడు సురేంద్రను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. తవణంపల్లి మండలానికి చెందిన సురేంద్ర కొన్నాళ్లుగా సదుం, పీలేరు మండలాల పరిసరాల్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

April 25, 2026 / 07:12 AM IST

రెవెన్యూ సిబ్బందిపై RDOకు MPP ఫిర్యాదు

VZM: వంగర మండలం మద్దివలస రైతుల భూముల వివరాలు సరి చేయడంలో రెవిన్యూ సిబ్బంది జాప్యంపై స్దానిక MPP సురేష్ ముఖర్జి RDO సుధారాణికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన వంగర MRO ఆఫీసులో RDOను కలిశారు. గత ఏడాది 315 LPM నంబర్లు ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదు చేసి, కలెక్టర్‌ దృష్టిలో పెట్టగా ఇంకా 14 LPM సరి చేయడంలో సిబ్బంది జాప్యం వహిస్తున్నారన్నారని తెలిపారు.

April 25, 2026 / 07:10 AM IST

కదిరి పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

సత్యసాయి: కదిరిలో జరిగిన భారీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రదొడ్డి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన జెల్ పేలుడు పదార్థాల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు విచారణలో తేలింది. గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించి పేలుడు సంభవించడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

April 25, 2026 / 07:07 AM IST

డీఎస్పీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

WG: భీమవరంలో బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారంటూ బాధితురాలి తల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. అండగా నిలవాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం పట్ల డీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒత్తిళ్లు ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది.

April 25, 2026 / 07:06 AM IST

నేడు మంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్: MPDO

PPM: రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆద్వర్యంలో ఇవాళ మక్కువలో ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO ఎన్‌.అర్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్దానిక MPDO కార్యాలయంలో ఉదయం 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

April 25, 2026 / 07:05 AM IST