కోనసీమ: కె.గంగవరం మండలం కోట గ్రామం ఏటి గట్టుపై ఉన్న సూయిజ్ వంతెన శిథిలావస్థకు చేరిందని స్థానికులు అంటున్నారు. గతంలో ప్రమాదాలు నివారణకు యువత ఇక్కడ ఇనుప మెస్ ఏర్పాటు చేసిన వాహనాలు ధాటికి అది దెబ్బతిని పరిస్థితి మళ్లీ మొదటి వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వంతెనకు పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
W.G: ఇలపర్రు సొసైటీ వద్ద రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించుకోవచ్చని సూచించారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కడప జిల్లాలో జర్నలిస్టులకు 2వ విడత అక్రిడిటేషన్లు మంజూరయ్యాయి. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదంతో 189 మంది అర్హులైన పాత్రికేయులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. తొలి విడతలో ఇప్పటికే 538 మందికి అక్రిడిటేషన్లు మంజూరయ్యాయని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నెం. 43ను విడుదల చేసింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. జర్నలిస్టులు రూ.1,250 ప్రీమియం చెల్లించగా, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని భరిస్తుంది. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించనుంది.
KDP: వల్లూరు(M)లోని పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. తొలిరోజు బుధవారం రాత్రి అంకురార్పణ సందర్భంగా దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన, వాస్తు పూజ, మేదిని పూజ, అఖండ దీపారాధన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త, కార్యనిర్వహణాధికారి, అర్చకులు పాల్గొన్నారు.
GNTR: ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కె.భుజంగరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచే విధంగా పనిచేస్తానన్నారు. ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.
KRNL: ఆదోనిలోని శ్రీనివాస్ భవన్ ముందు ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఇవాళ ఉదయం పరిశీలించారు. క్యాంటీన్లో అందిస్తున్న అల్పాహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఆహారం నాణ్యత, వడ్డింపు విధానం వంటి అంశాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
E.G: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గోపాలపురం టీడీపీ రైతు విభాగ అధ్యక్షుడు అబ్బిన సురేంద్ర తెలిపారు. గత వైసీపీ పాలనలో ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ఆలస్యం జరిగేదని, ప్రస్తుతం ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
విజయనగరం: విశాఖ ఎంపీ ఎం. శ్రీ భరత్ బుధవారం కొత్తవలస పర్యటనలో భాగంగా రైల్వే స్టేషనులో జరుగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కే.కే లైన్ రాయగడ డివిజన్లో కలపడంపై హిట్ టీవీ ప్రతినిధి ఎంపీ దృష్టికి తీసుకువెళ్ళగా ప్రజలకు ‘అవ్వ కావాలి బువ్వ కావాలి’ అని వ్యంగ్యంగా చెప్పడంపై ఈ విషయం రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
KRNL: ఆదోనిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం మే మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జాతరకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను గురువారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. రథోత్సవం జరిగే మార్గంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పనులు పూర్తి చేయాలన్నారు.
SKLM: మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆస్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. రీ వెరిఫికేషన్‌కు సైతం 20వ తేదీ నుంచి 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం: కాశీబుగ్గ డీఎస్పీగా టి. భవాని బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ వన్ పరీక్షలలో విజయం సాధించి, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో నేరాలు, భద్రతా చర్యలపై దృష్టి సారిస్తానని, సిబ్బంది సహకరించాలని ఆమె కోరారు.
E.G: ఆర్యాపురం సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా గురువారం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. సీతంపేట, టీచర్స్ కాలనీ, ఈఎస్ఐ ఆస్పత్రి, కృష్ణనగర్, కొత్త రోడ్డు, స్వతంత్ర ఆస్పత్రి ప్రాంతాలు ప్రభావితమవుతాయి. పనులు పూర్తయ్యాక సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.
KKD: పిఠాపురం పురపాలక సంఘానికి పదోన్నతి లభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. Dy. CM పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో సెకండరీ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పిఠాపురం అప్‌గ్రేడ్ అయింది. ఈ హోదాతో పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు కానున్నాయి. పవన్ కృషి పట్ల జనసేన నాయకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ELR: జిల్లాలో భవన నిర్మాణ రంగ కార్మికులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. భీమా పథకంలో నమోదైన కార్మికులకు వివాహ కానుక పథకం కింద రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 18-60 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులన్నారు.