• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వామి వారి పరుష వేలం ద్వారా రూ.1.49 లక్షలు

CTR: పుంగనూరు శ్రీమాణిక్య వరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాట డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం సమక్షంలో సోమవారం జరిగింది. ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరషను నిర్వహించాలని సూచించారు.

April 20, 2026 / 04:00 PM IST

ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు

 ASR: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అనంతగిరి మండలంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో చిలకలగెడ్డ గ్రామంలో కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులగా మలిచి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

April 20, 2026 / 04:00 PM IST

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే భోజనం

GNTR: సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు–పల్నాడు బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. నారా భువనేశ్వరి పేదల పట్ల చూపుతున్న సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆమె అన్నారు.

April 20, 2026 / 03:56 PM IST

బాపులదొడ్డిలో తాగునీటి కష్టాలు.!

KRNL: పెద్దకడబూరు మండలం బాపులదొడ్డిలో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామ శివారుల్లోని పొలాల్లోని బోర్ వద్దకు తోపుడు బళ్లతో వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బాపులదొడ్డి గ్రామ ప్రజలు గుక్కెడు మంచినీళ్ళు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

April 20, 2026 / 03:42 PM IST

పామర్రులో భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్‌ ప్రారంభం

కృష్ణా: పామర్రులో జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.2.30 కోట్లతో నిర్మించిన భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్‌ను MLA వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. గంగానమ్మ గుడి వద్ద 1.50 లక్షల లీటర్ల ట్యాంక్, పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.2.80 లక్షలతో పంప్‌హౌస్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌తో గ్రామస్తుల తాగునీటి సమస్యలు పూర్తిగా తొలగుతాయని పేర్కొన్నారు.

April 20, 2026 / 03:41 PM IST

ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కలెక్టర్

PDL: కలెక్టర్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు. వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రజలెవరు బయట రావద్దని ఆమె తెలిపారు. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా ఎండ తీవ్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

April 20, 2026 / 03:38 PM IST

రేపు సింహాద్రిపురంలో మండల సర్వసభ్య సమావేశం

KDP: సింహాద్రిపురంలో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయం సభ భవనంలో ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు వారి శాఖల వివరాలతో హాజరు కావాలన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

April 20, 2026 / 03:38 PM IST

బాపట్లలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

బాపట్లలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సోమవారం ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు సహకారంతో, స్థానిక టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

April 20, 2026 / 03:35 PM IST

‘పాలిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

ATP: ఈనెల 25న జరగనున్న పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌వో ఎ. మాలోల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 31 కేంద్రాల్లో 9,745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.

April 20, 2026 / 03:30 PM IST

కొవ్వూరులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

E.G: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశిష్ లాల్ కొవ్వూరులోని ఆయన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ నవనిర్మాణ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.

April 20, 2026 / 03:30 PM IST

‘పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలి’

CTR: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో జనసైనికులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పుంగనూరులో గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

April 20, 2026 / 03:30 PM IST

ఆదోని MEO-2గా రంగన్న బాధ్యతలు

KRNL: ఆదోని మండల MEO-2గా మధిరె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మధిరె పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఫ్యాప్టో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రంగన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు, బోధన నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.

April 20, 2026 / 03:29 PM IST

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులు అరెస్ట్

GNTR: తెనాలి రూరల్ PS పరిధిలోని గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా, తెనాలికి చెందిన షేక్ ఫిరోజ్, కోటి సాయి మంజునాథ్ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.

April 20, 2026 / 03:29 PM IST

‘బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి’

NTR: కంచికచర్ల మోడల్ ప్రైమ్ స్కూల్‌లో బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, అంగన్వాడీలో 5 సంవత్సరాలు పూర్తైన పిల్లలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను కూడా ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

April 20, 2026 / 03:28 PM IST

డీఎస్పీని కలిసిన ఎస్సై సైదు బాబు

ప్రకాశం: పెద్దారవీడు మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సైదులు బాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలోని డీఎస్పీ డాక్టర్ యూ. నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి పూల కుండీని అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలతో వచ్చే ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని తెలిపారు.

April 20, 2026 / 03:27 PM IST