SKLM: ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో శ్రోతలకు ఆనందాన్ని పంచి, ఎన్ని తరాలు అయినా ప్రజలతో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నారు. ఆశాభోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నంద్యాలలో ఏప్రిల్ 17,19 తేదీలలో జరగనున్న సీఐటీయు 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇవాళ నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నామని అన్నారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. లాలాపేటలోని శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీసం 10 ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి అర్జీలోని సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించటం జరుగుతుందన్నారు.
CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,అర్చకులు, గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.
SKLM: సోంపేట నియోజకవర్గంలో ఆదివారం పైడిగం హెడ్ ఛానల్‌ను రైతు ప్రతినిధులు పరిశీలించారు. ఇటీవల తుఫాన్లతో కాలువ దెబ్బతిని, శిధిలావస్థకు చేరిందని వారు అన్నారు. రూ.36 కోట్ల అంచనా ఉన్నా ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కంచిలి, మందస, సోంపేట మండలాల రైతులకు ఇది కీలకమైన కాలువ అని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
VZM: సంతకవిటి మండల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఐపీఎల్ సీజన్ కావడంతో యువత బెట్టింగ్‌లకు పాల్పడకుండా ఉండాలని ఎస్సై గోపాలరావు సూచించారు. ఈ నేపథ్యంలో బెట్టింగులుకు పాల్పడే వారిని గుర్తించే లక్ష్యంతో స్థానిక యువకుల మొబైల్ ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
KRNL: కర్నూలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.రుద్రవరం సమీపంలో గల కేసీ కాలువలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన మౌలాలి (35)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: సోమలలో స్వయంభేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్టు ధర్మకర్త బాల వీరయ్య గారి సోమశేఖర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామని వెల్లడించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి-అంకంపాలెం రహదారిలో ఉన్న సాయంత్రం కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్నికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా, సామగ్రి దగ్ధమైంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు నగర సమస్యలను పరిష్కారించడంలో యువత చురుకుగా పాల్గొనాలని TJPS కళాశాలలో యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థులతో కలిసి పారిశుద్ధ్యం, ట్రాఫిక్, విద్య, వైద్య రంగాలపై 7 బృందాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పౌర సంస్థలను ఐక్యం చేసి, దాతల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు.
KRNL: ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దకడబూరు మండలం సీపీఐ నాయకులు బయలుదేరారు. CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలు, రైతులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు.
VSP: విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ శంకర్ నారాయణ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంటుందని, నేరవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ నాగమణి, సిబ్బంది ఉన్నారు.
NLR: కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్యారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 ను సంప్రదించాలని సూచించారు.
CTR: రాజధాని విషయంలో వైసీపీలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కార్వేటి నగరం మండలం పాదిరి కుప్పంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో రాజధాని పేరుతో వైసీపీ నేతలు అయోమయం సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో టీడీపీ అతి ప్రచారం నిర్వహిస్తోందన్నారు.