KDP: మైలవరం మండల తహశీల్దార్ ఓతూరు షఫీ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ముద్దునూరు MLS పాయింట్లో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ పనులు, రీసర్వే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ASR: పట్టాదారు పాస్ పుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతి రైతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు ఏవో పీ.శివరామ్ ప్రసాద్ సూచించారు. కొయ్యూరు మండలం రావణాపల్లిలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ఆయన పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు.
VSP: విశాఖ ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ భోగాపురం ఎయిర్పోర్ట్ అనుసంధాన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవివరం నుంచి వివిధ మార్గాల్లో పనుల నాణ్యతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారం నాటికి ప్రధాన రహదారుల పనులు పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
SS: పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో గురువారం పౌరసరఫరాల శాఖపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు డోర్ డెలివరీ విధిగా చేయాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం నాణ్యతపై వినియోగదారుల సంతృప్తిని పెంచాలని సూచించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కనకదుర్గమ్మ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరగనుంది. గతంలో జొన్నవాడ ఆలయ ఛైర్మన్‌గా విశేష సేవలందించిన పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడును ఈ ఆలయ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీ. ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.
ATP: జిల్లాలోని పర్యాటక ప్రాపర్టీల నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. మారూరు టోల్ గేట్ రెస్టారెంట్, తాడిపత్రి హోటల్, ఎంపీఆర్ డ్యామ్ రెస్ట్ హౌస్ భవనాలను వార్షిక లీజు పద్ధతిలో కేటాయించనున్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16వ తేదీలోపు పర్యాటక కార్యాలయంలో వివరాలు పొందవచ్చన్నారు. కాగా, ఏప్రిల్ 17న వేలం ఉంటుందని వెల్లడించారు.
SKLM: జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత రీ సర్వే జరగనున్నదని సర్వే, భూములు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. జ్యోషిత అన్నారు. ఈ మేరకు గురువారం మందస తహసీల్దార్ మిస్కా శ్రీకాంత్ ఆధ్వర్యంలో రీ సర్వేపై గ్రామ సర్వేయర్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. రీ సర్వే సమయంలో ఈకేవైసీ చేయాలని, రైతులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
PPM: భామిని మండలం చిన్న దిమిలి గ్రామంలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రేషన్ షాపును పరిశీలించి రికార్డులు, సరుకుల పంపిణీపై ఆరా తీశారు. ప్రజలకు సేవలు సకాలంలో అందేలా చూడాలని, నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు.
VZM: గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ గురువారం సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. అలాగే, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
గుంటూరులో మండుతున్న ఎండల మధ్య తాటి ముంజెలకు మంచి ఆదరణ లభిస్తోంది. వడదెబ్బ తగలకుండా శరీరానికి చల్లదనాన్ని అందించి, ఆరోగ్యాన్ని కాపాడతాయని పూర్వీకులు చెప్పే ఈ సహజ ఆహారాన్ని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. గంటల వ్యవధిలో ముంజెలు అమ్ముడైపోతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
CTR: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మణినాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సంప్రదాయాలను వివరించిన వారు, స్వామివారి కృపతో దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబుకి నియోజకవర్గం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సత్కరించేందుకు పచ్చి అరటికాయలతో భారీ క్రేన్ల సహాయంతో గజమాలను తయారు చేశారు. ఈ దండా పలువురిని ఆకట్టుకుంది.
KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తు చేశారు. ఇందులో ఈసీ ఖాదర్ బాషా ఉన్నారు.
KDP: మైలవరం మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ పార్క్‌లోని JCBల నుంచి డీజిల్, ఇనుప కడ్డీలు, దొడియం, వద్దిరాల గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీల అపహరణతో పాటు పలు దుకాణాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. SI శ్యాంసుందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.