• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఇంటర్ సెకండ్ ఇయర్లో టౌన్ ఫస్ట్‌గా శరణ్య

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో గుడివాడ పట్టణానికి చెందిన నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆకునూరి శ్యామ్ శరణ్య ఇవాళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మొత్తం 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. శరణ్య సాధించిన ఈ విజయంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

April 15, 2026 / 06:26 PM IST

‘పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించండి’

KRNL: పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో పీజీఆర్ఎస్, రెవెన్యూ జనరేషన్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిత్యం ఉదయం పీజీఆర్ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను చూడాలన్నారు.

April 15, 2026 / 06:20 PM IST

రాజమండ్రిలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

E.G: రాజమండ్రిలోని రైల్వే స్టేషన్, బస్ గ్యారేజ్, బస్ కాంప్లెక్స్‌లలో సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్, ఆయిల్ తదితర అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. విపత్తుల నుంచి సురక్షితంగా బయటపడే విధానాలను ప్రత్యక్ష ప్రదర్శనలు చేశారు.

April 15, 2026 / 06:20 PM IST

‘పోషకాహార లోపం లేని భారత దేశమే లక్ష్యం’

TPT: పిచ్చటూరు(మం) వేలూరు గ్రామంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, తల్లి, శిశు ఆరోగ్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసోసియేట్ జె. రామకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 15, 2026 / 06:12 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభం

ASR: రంపచోడవరంలో బుధవారం అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు తక్కువ ధరలో భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. కేవలం రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కార్మికులు, విద్యార్థులు, పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

April 15, 2026 / 06:11 PM IST

‘అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి’

AKP: రాజకీయాలకతీతంగా అభివృద్ధిపైనే ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. ఈ మేరకు సబ్బవరంలో ప్రత్యేక అధికారులు, నాయకులు, ప్రజలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

April 15, 2026 / 06:11 PM IST

చౌడేపల్లిలో కలెక్టర్ పర్యటన

CTR: చౌడేపల్లి మండలంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పర్యటించారు. జలధార కార్యక్రమంలో భాగంగా దిగువ పల్లె, కాగతి, ఏ కొత్తకోట పంచాయతీ పరిధిలో చెరువులు, సప్లై ఛానల్‌కి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, చెరువుల వేలాల నిర్వహణపై ఆరా తీశారు.పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

April 15, 2026 / 06:11 PM IST

‘డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు’

NTR: ఎన్టీఆర్ కాలనీలో ఇటీవల జరిగిన డిజిటల్ అరెస్టుపై పోలీసులు ప్రజలకు బ్యాంకు సిబ్బందికి అవగాహన నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు, ఫోన్ కాల్‌ ద్వారా మోసాలు, OTPలు బ్యాంక్ వివరాలు అడిగి డబ్బులు దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదన్నారు.

April 15, 2026 / 06:04 PM IST

‘ఆధునిక సాగుతో అధిక దిగుబడులు ఖాయం’

SKLM: ఉత్తర కొస్తా జిల్లాలలో సాగు చేస్తున్న పంటల ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పటికీ నూతన సాంకేతిక పద్ధతుల ఉపయోగించుట ద్వారా ఉత్పాదకత పెంచుటకు అవకాశాలు ఉన్నాయని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డా. పివి సత్యనారాయణ అన్నారు. ఇవాళ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

April 15, 2026 / 06:03 PM IST

ఇంటర్ ఫస్టియర్లో టౌన్ ఫస్ట్‌గా వేదశ్రీ

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి పొదిలపు వేదశ్రీ ఇవాళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. వేదశ్రీ సాధించిన ఈ విజయంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.

April 15, 2026 / 06:03 PM IST

యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు

W.G: భీమవరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, రైతులతో ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని మాట్లాడారు. యువత పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారిస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

April 15, 2026 / 06:00 PM IST

దేవేంద్రప్పకు టీడీపీలో కీలక బాధ్యత

KRNL: టీడీపీ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్పను అధిష్ఠానం నియమించింది. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌కు దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

April 15, 2026 / 06:00 PM IST

చోరీ యత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ELR: కైకలూరులో ఓ బంగారం దుకాణంలో చోరీ యత్నానికి పాల్పడిన ఘటనలో బుధవారం పోలీసులు సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులపై ఆంధ్ర తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలలో పలు కేసులు ఉన్నాయన్నారు. రాబోవు వేసవి దృష్ట్యా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, కైకలూరులో దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు.

April 15, 2026 / 06:00 PM IST

ఫిరంగిపురంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభం

GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన, శుచిశుభ్రమైన భోజనం అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

April 15, 2026 / 05:56 PM IST

పేలుడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై YCP అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసం కావడం, పలువురు గాయపడటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

April 15, 2026 / 05:50 PM IST