• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక అమరవీరులకు నివాళులు

PPM: 1944 ముంబై నౌకా ప్రమాదంలో అమరులైన 66 మంది అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ జాతీయ సంతాప దినాలు ప్రారంభించింది. ఏప్రిల్14 నుంచి 21 వరకు వారంరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఆరిక సింహాచలం తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్‌లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

April 14, 2026 / 11:08 AM IST

అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్

SKLM: అంబేద్కర్ స్పూర్తితో హక్కులు కోసం పోరాడాలని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం డా.బి. ఆర్.అంబేద్కర్ జయంతి సందర్బంగా రణస్థలం M పతివాడపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.

April 14, 2026 / 11:08 AM IST

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: చింతలపూడిలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం రాజ్యాంగ రచయితగా మాత్రమే కాకుండా, విద్యాభ్యాసంలోను, దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 10:58 AM IST

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే

ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, దళిత సోదరులతో కలిసి కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

April 14, 2026 / 10:54 AM IST

‘రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి సమన్యాయం’

E.G: ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో 135వ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని వారు కొనియాడారు.

April 14, 2026 / 10:46 AM IST

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు

BPT: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణపు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 10:40 AM IST

దారంతో అంబేడ్కర్ ఫొటో..!

NLR: అంబేద్కర్ జయంతి సందర్భంగా కంపసముద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్ అంబేద్కర్ ఫొటోను దారంతో తయారు చేశారు. ఆయన ఆకులపై పలు చిత్రాలను, తాళపత్ర గ్రంథాలను రచించే కళతో పాటు దారంతో చిత్రాలు తయారు చేసే ఏకైక కళాకారుడు కూడా కావడం విశేషం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.

April 14, 2026 / 10:37 AM IST

అయ్యప్ప స్వామి సేవలో ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పోలాకి మండలం పోలాకి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గం ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.

April 14, 2026 / 10:36 AM IST

‘అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం’

KRNL: అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం సాధనలో ముందుకు సాగాలని ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు. ఇవాళ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆలూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. దేవుడు జన్మనిస్తే.. అంబేడ్కర్ జీవించే హక్కును కల్పించారని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

April 14, 2026 / 10:35 AM IST

న్యూడ్ వీడియో కాల్స్ దందా.. మహిళలు అరెస్ట్

GNTR: తెనాలిలోని చెంచుపేట కేంద్రంగా సాగుతున్న న్యూడ్ వీడియో కాల్స్ దందా కలకలం రేపుతోంది. ఓ యాప్ వేదికగా నగదు చెల్లించిన వారికి మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో చెంచుపేటకు చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అశ్లీల దందా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 10:30 AM IST

రేపు స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో సమావేశం

KDP: మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎన్జీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యా శాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

April 14, 2026 / 10:30 AM IST

అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి

VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆరిలోవలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ శిల్పిగా బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకుడని, యువత ఆయన ఆలోచనలు అనుసరించాలని పేర్కొన్నారు.

April 14, 2026 / 10:21 AM IST

బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా

సత్యసాయి: కదిరి రూరల్ మండలం ఎగువపల్లి హరిజనవాడకు చెందిన వై.హరి ప్రమాదవశాత్తు మరణించడంపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టం తీరనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

April 14, 2026 / 10:21 AM IST

‘అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి’

E.G: భారత రాజ్యాంగ రూపకర్త బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కడియం మండలం వేమగిరిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పూలమాల వేసి నివాళులుర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను సమాజానికి అందించిన అంబేద్కర్ ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

April 14, 2026 / 10:20 AM IST

అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం: సీఐ

NDL: ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్సై వరప్రసాద్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహానీయుడని తెలిపారు.

April 14, 2026 / 10:18 AM IST