• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యాడికి సభలో అధికారులకు సీఎం దిశానిర్దేశం

ATP: యాడికిలో జరిగిన జలధార సభలో CM చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గ ప్రగతి నివేదికను స్వయంగా చదివి వినిపించారు. సరిగ్గా పనిచేయని అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ కోరారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆదాయం తగ్గినా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

April 6, 2026 / 03:20 PM IST

ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన కలెక్టర్

PPM: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ​కలెక్టర్ చేతుల మీదుగా 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

April 6, 2026 / 03:15 PM IST

‘వ్యవసాయ రంగానికి పూర్వవైభవం’

VZM: వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా, భూగర్భ జల మట్టాలను పెంచి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఊర చెరువు వద్ద నిర్వహించిన జలధార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

April 6, 2026 / 03:14 PM IST

‘మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలి’

KRNL: క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని బీఎస్పీ నేత అమ్లివాలే ఫయాజ్ డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. గతంలో వివక్ష కారణంగానే దళితులు మతం మారారని, వారిని ఎస్సీలుగా గుర్తించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.

April 6, 2026 / 03:12 PM IST

‘ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి’

NLR: ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సూచించారు. సోమవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో వైద్య సిబ్బంది పర్యటించారు. సన్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నందున ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

April 6, 2026 / 03:10 PM IST

తిరుపతి- చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్స్.!

తిరుపతి, చిత్తూరు జిల్లా మీదుగా 2 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మైసూరు-చెన్నై కారిడార్‌లో భాగంగా CTR- TPT మీదుగా నాయుడుపేటకు లింక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరగా కేంద్రం అమోదించింది. దీంతో నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్, నాయుడుపేట, TPT, CTR, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరుకు మరో కారిడార్ ఏర్పాటు కానుంది.

April 6, 2026 / 03:02 PM IST

‘నిరుపేదల ఆరోగ్యానికి సంజీవనిలా CMRF’

E.G: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి CMRF ఒక సంజీవనిలా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన CMRF చెక్కులు & LOC పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 03:00 PM IST

తాడేపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు

GNTR: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాం సెంటర్ ప్రాంతంలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, సీఐ వీరేంద్రబాబు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

April 6, 2026 / 03:00 PM IST

జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

BPT: ఈ నెల 9న సీఎం చంద్రబాబు సూరేపల్లెకు రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రోటోకాల్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

April 6, 2026 / 03:00 PM IST

వాహనాలు నడిపే మైనర్లకు కౌన్సెలింగ్

VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మహేష్ సోమవారం మైనర్ వాహన చోదకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 6, 2026 / 02:54 PM IST

మంత్రి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే భేటీ

ATP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేంద్ర గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యువ నేత లొకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ అభివృద్ధి గురించి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యేను ఆరా తీశారు.

April 6, 2026 / 02:50 PM IST

నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కరివేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ నందన్ పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 49 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

April 6, 2026 / 02:50 PM IST

‘గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదం’

AKP: గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదపడుతున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. సోమవారం లింగాపురం, టి. జగ్గంపేట గ్రామాలకు స్వచ్ఛ రథంతో పాటు ఎంపీడీవో వెళ్లారు. ప్రజల్లో స్వచ్ఛరథంపై అవగాహన కల్పించారు. చిత్తు కాగితాలు, అట్టపెట్టెలు, పనికిరాని ఇనుప సామాన్లు ఇచ్చి కావలసిన నిత్యవసర సరుకులను తీసుకువెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.

April 6, 2026 / 02:45 PM IST

‘అదనపు రేషన్ షాపులు ఏర్పాటు చేయాలి’

KDP: చింతకొమ్మదిన్నె(M) ఇందిరానగర్‌లో 5000 కుటుంబాలకు కేవలం 2 రేషన్ షాపులే ఉన్నయన్నారు. దీని ద్వారా వెయ్యి మందికే సరుకులు అందుతున్నాయని RCP సీకే దిన్నె కార్యదర్శి ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. వెంటనే మరో 4 దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

April 6, 2026 / 02:42 PM IST

ప్రియుడి దాడిలో ప్రియురాలు మృతి

AKP: ఎలమంచిలి మండలం మర్రిబందలో సహజీవనం చేస్తున్న అల్లూరి జిల్లాకు చెందిన వంతల కుమారి(40), మర్రి కామేష్ ఆదివారం రాత్రి మద్యం సేవించి గొడవ పడినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. ఈ గొడవలో కామేష్ పిడికిలితో గుద్దడంతో తీవ్రంగా గాయపడిన కుమారి మృతి చెందిందన్నారు. వీరిద్దరు స్క్రాప్ షాపులో పనిచేస్తున్నారన్నారు.

April 6, 2026 / 02:40 PM IST