• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సేంద్రియ మేళా సూపర్ హిట్: కలెక్టర్

ఏలూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ.11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను కలెక్టర్ సన్మానించారు.

April 21, 2026 / 07:24 AM IST

ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే దృష్టి

PLD: బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో నిర్వహించిన “ప్రజల వద్దకు ప్రవీణ్:100 రోజులు-100 గ్రామాలు” కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. 66వ రోజు గ్రామ ప్రజల అర్జీలు స్వీకరించి సమస్యలు విన్న ఆయన, త్వరిత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక నాయకులతో గ్రామ సమస్యలపై చర్చించారు.

April 21, 2026 / 07:22 AM IST

రూ.2.66 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన మంత్రి

తూ.గో: రాజానగరం నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నన్నయ్య యూనివర్సిటీ సమీపంలో రూ.2.66 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, MP పురందీశ్వరి, MLA బత్తుల బలరామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉపకేంద్రంతో ప్రాంతంలో దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు తగ్గనున్నాయని మంత్రి తెలిపారు.

April 21, 2026 / 07:19 AM IST

కలెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

W.G: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2026 ఏడాదికి గాను రెడ్ క్రాస్ గవర్నర్ అవార్డు లభించింది. జిల్లాలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణలో ఆమె చూపిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. మే 8న విజయవాడలో గవర్నర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు. జిల్లాకు వరుసగా నాలుగోసారి ఈ పురస్కారం రావడం విశేషం.

April 21, 2026 / 07:15 AM IST

సర్పవరం సీఐ పెద్దిరాజుపై వేటు.. వీఆర్‌కు అటాచ్

కాకినాడ: సర్పవరం సీఐ పెద్దిరాజుపై వేటు పడింది. ఆయనను వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేస్తున్న రవికుమార్‌ను నియమించారు. సోమవారం రాత్రి రవికుమార్ సర్పవరం నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం మహిళా పీఎస్ఈ పాటు ఎస్పీ కార్యాలయంలోనూ కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

April 21, 2026 / 07:14 AM IST

నేడు సూళ్లూరుపేటలో కలెక్టర్, SP క్షేత్రస్థాయి పరిశీలన

TPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలోని కీలక బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించే క్రమంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:45 గంటలకు సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ సర్కిల్‌ను వారు సందర్శించనున్నారు.

April 21, 2026 / 07:12 AM IST

బండ తిప్పనపల్లి ప్రీమియర్ లీగ్ విజేత అస్లాం 11 టీం

CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగురు పంచాయతీ బండ తిప్పనపల్లి గ్రామంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా అస్లాం 11 టీం శేషాద్రిపురం 11 టీంపై విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతగా నిలిచిన టీంకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 21, 2026 / 07:12 AM IST

‘హార్టికల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగులు’

VZM: ఉద్యానవన పంటల సాగు ( హార్టికల్చర్ ) ను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కీలక అడుగులు వేస్తోందని గంట్యాడ AO శ్యామ్ కుమార్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి తోటల పెంపకంపై ఆసక్తి ఉన్న 181 మంది రైతులను గుర్తించామని, ఇప్పటికే బోరు బావులు, మోటార్లు సిద్ధంగా ఉన్న రైతులు వెంటనే ప్లాంటేషన్‌ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించారు.

April 21, 2026 / 07:07 AM IST

అభివృద్ధికి నుడా మద్దతు.. రూ. 10 కోట్ల రోడ్డు హామీ

నెల్లూరు: కందుకూరు అభివృద్ధికి నుడా సంపూర్ణ సహకారం అందిస్తుందని ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి రూ. 4.27 కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో ఇప్పటికే రూ. 21.5 కోట్ల పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఎన్టీఆర్ సర్కిల్-అంకమ్మగుడి రోడ్డుకు రూ. 10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

April 21, 2026 / 07:07 AM IST

‘బడి పిలుస్తోంది’ పోస్టర్ విడుదల

GNTR: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

April 21, 2026 / 07:00 AM IST

జనగణనపై అవగాహనకు కలెక్టర్ ఆదేశాలు

GNTR: జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించాలని కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.

April 21, 2026 / 06:44 AM IST

పవన్ ఆరోగ్యం మెరుగుపడాలని ఎమ్మెల్యే హోమం

కృష్ణా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇవాళ మోపిదేవిలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

April 21, 2026 / 06:39 AM IST

‘మహిళా సంఘాల అభివృద్ధికి వీఏఓలు కీలక పాత్ర పోషించాలి’

PPM: మహిళా సంఘాల అభివృద్ధికి VAOలు కీలక పాత్ర పోషించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు.ఈ మేరకు ఆమె సోమవారం సాలూరులో సాలూరు, మక్కువ, పాచిపెంట VAOలకు సెల్‌ ఫోన్లు అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని వారి ఉన్నతికి స్త్రీ నిధి రుణాలను అందజేసినట్లు తెలిపారు.

April 21, 2026 / 06:39 AM IST

భూముల వేలం.. ఆలయానికి ఆదాయం

ATP: పెద్దపప్పూరు మండలంలోని దర్మాపురం, అమ్మలదిన్నె, ముచ్చుకోట గ్రామాల్లో సోమవారం దేవదాయశాఖ ఇన్స్‌పెక్టర్ దుర్గా ప్రసాద్, ఈఓ సుబ్రమణ్యం కౌలు భూముల వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహించగా రూ.7,37,500 ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు.

April 21, 2026 / 06:39 AM IST

పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

SKLM: అరసవల్లిలోని జరిగే అసిరి తల్లి సిరి మాను ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక మున్సిపల్ మైదానంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, MLA శంకర్‌తో కలిసి ఉత్సవ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

April 21, 2026 / 06:36 AM IST