TPT: శ్రీసిటీ పరిధిలోని తొండూరులో కండ్రిగ ధనశేఖర్‌కు చెందిన గడ్డివాము విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇటీవల పశువుల మేత కోసం సేకరించిన సుమారు 200 మోపుల గడ్డి అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.
కృష్ణా: దేశ పురోగతిలో జగ్జీవన్ రామ్ పాత్ర మరువలేనిదని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ నేరెళ్లపాలెం బస్టాప్ వద్ధ భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వెంకట్రామ్ నివాళులర్పించారు.
PLD: మాజీ సీఎం జగన్‌పై చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, దోపిడీ జగన్‌కు రెండు కళ్లు అని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ తీరు మారలేదన్నారు. రాజధాని అమరావతిపై జగన్ చిమ్మే ప్రతి విషపు బొట్టు ఆయన పతనానికే దారి తీస్తుందని హెచ్చరించారు. అమరావతిని బలపరిస్తేనే వైసీపీకి ప్రజల్లో స్థానం ఉంటుందన్నారు.
ప్రకాశం: ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్లు, మెటల్ డిటెక్టర్లతో రద్దీగా ఉండే ప్రాంతాలను శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ, ప్లాట్‌ఫామ్‌లను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టారు.
ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రాకూడదని, ఈ మార్పును ప్రజలు గమనించాలని కోరారు.
NLR: పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6 నుంచి 19 వరకు దామరమడుగు గ్రామంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టీడీపీ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షులు జగదీష్ తెలిపారు. డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
CTR: ‘దేవతల ఏలుబడి అమరావతి.. అమరావతే మన రాజధాని’ అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. బుద్ధుడు నడిచిన పవిత్ర నేల అమరావతి ఏపీ ఏకైక రాజధానిగా అవతరించిందని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం కృషి చేసి రాజధానికి చట్టబద్ధత తీసుకువచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
VZM: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో దళిత వర్గాల ఆశాజ్యోతి శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పట్టణంలోని మహిళా పోలీసు స్టేషనులో మనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. హరిత విప్లవం విజయవంతం కావడంలో జగ్జీవన్ రామ్ ముఖ్యపాత్ర పోషించారన్నారు.
TPT: తిరుపతి యూత్ హాస్టల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంచుకోవాలని, పోటీ ప్రపంచంలో అవగాహన ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. ఎక్స్‌పోలో వివిధ విద్యా కోర్సులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
KNR: కోడుమూరు నుంచి రాజోలికి గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా సేవలు లేకపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని వారు తెలిపారు. బస్సు పునరుద్ధరణ కోసం పలుమార్లు అధికారులను కోరినా స్పందన లభించలేదని వాపోయారు. వెంటనే బస్సు సేవలు పునఃప్రారంభించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
VSP: సింహాచలం కొత్త గోసాల కృష్ణాపురంలో నిర్వహించిన ‘శబల-2026 సుస్థిర జీవన ఉత్సవం’లో ఆదివారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులకు బహుమతులు అందజేసి, వివిధ స్టాల్స్ పరిశీలించారు. సాంప్రదాయ ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు.
SKLM: పలాస కిడ్నీ మార్పిడి బాధితురాలు హేమశ్రీని ఎమ్మెల్యే గౌతు శిరిష ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న హేమశ్రీ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న తీరును వైద్యులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
KDP: చిన్నచౌకు పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానితుల సమాచారాన్ని 112కు ఇవ్వాలని సూచించారు.
AKP: నాతవరం మండలం తాండవ జంక్షన్లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దేన్ దయాల్ ఉపాధ్యాయ ప్రసిక్షణ మహా అభియాన్ ప్రారంభమైంది. మండల అధ్యక్షులు కుమారస్వామి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలన, వందేమాతర గీతం ఆలపించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ నాయుడు బీజేపీ చరిత్ర, సంస్కరణలను వివరించారు.
PPM: గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చేపట్టిన “మీ ఇంటికి-మీ డాక్టర్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా మారుమూల గ్రామాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నారు. కొమరాడ మండలంలో ఇప్పటికే 8 గ్రామాల్లో 500 మందికి పైగా సేవలు అందించారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఈ సేవలు విస్తరించనున్నాయి.