• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తాటి ముంజెలకు భారీగా డిమాండ్

గుంటూరులో మండుతున్న ఎండల మధ్య తాటి ముంజెలకు మంచి ఆదరణ లభిస్తోంది. వడదెబ్బ తగలకుండా శరీరానికి చల్లదనాన్ని అందించి, ఆరోగ్యాన్ని కాపాడతాయని పూర్వీకులు చెప్పే ఈ సహజ ఆహారాన్ని ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. గంటల వ్యవధిలో ముంజెలు అమ్ముడైపోతుండటంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 06:54 PM IST

వెంకయ్యనాయుడుకు కాణిపాకం ప్రసాదాలు అందజేత

CTR: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మణినాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సంప్రదాయాలను వివరించిన వారు, స్వామివారి కృపతో దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

April 9, 2026 / 06:43 PM IST

సీఎంకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబుకి నియోజకవర్గం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సత్కరించేందుకు పచ్చి అరటికాయలతో భారీ క్రేన్ల సహాయంతో గజమాలను తయారు చేశారు. ఈ దండా పలువురిని ఆకట్టుకుంది.

April 9, 2026 / 06:42 PM IST

నీటి భద్రతపై రైతులకు అవగాహన సదస్సు

KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తు చేశారు. ఇందులో ఈసీ ఖాదర్ బాషా ఉన్నారు.

April 9, 2026 / 06:41 PM IST

వరుస చోరీల గుట్టురట్టు.. ముగ్గురుదొంగల అరెస్ట్

KDP: మైలవరం మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ పార్క్‌లోని JCBల నుంచి డీజిల్, ఇనుప కడ్డీలు, దొడియం, వద్దిరాల గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీల అపహరణతో పాటు పలు దుకాణాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. SI శ్యాంసుందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.

April 9, 2026 / 06:40 PM IST

ఆరో తరగతిలో చేరే విద్యార్థులకు అలర్ట్

ATP: రాయదుర్గం పట్టణంలోని మోడల్ స్కూల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 12వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మీడియాతో తెలిపారు. ఆరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

April 9, 2026 / 06:40 PM IST

మొగల్తూరులో ‘పోషణ పక్వాడా’ పోస్టర్ల ఆవిష్కరణ

W.G: మొగల్తూరు ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ‘పోషణ పక్వాడా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారంపై అవగాహన కల్పించే పోస్టర్లను మండల స్థాయి అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రాజ్ కిషోర్, ఎంపీడీవో త్రిశూల పాణి, సీడీపీవో ఊర్మిళ పాల్గొన్నారు.

April 9, 2026 / 06:39 PM IST

ఘనంగా వైఎస్ పాదయాత్ర వార్షికోత్సవం

VSP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రజల సమస్యలను తెలుసుకుని సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి సేవలందించారని గుర్తుచేశారు. ఆయన పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు.

April 9, 2026 / 06:34 PM IST

బీసీ డిమాండ్లకు సంఘాల మద్దతు

కర్నూలు జిల్లాలో బీసీవై పార్టీ చేపట్టిన బీసీల 5 డిమాండ్లకు బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం మద్దతు తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, కులగణన, 44% రిజర్వేషన్లు వంటి డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 11న ఆమరణ దీక్షను విజయవంతం చేయాలని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 9, 2026 / 06:29 PM IST

‘శాశ్వత లోక్ అదాలత్ వినియోగించుకోండి’

VZM: ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన తగాదాలను శాశ్వత లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కోర్టులో శాశ్వత లోక్ అదాలత్‌పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకింగ్, బీమా, విద్యాసంస్థలు, ఆస్తి, ఉపాధి హామీ పథకం, రవాణా, పోస్టల్, విద్యుత్, నీటి సరఫరా తదితర వాటిని రాజీ చేసుకోవాలన్నారు.

April 9, 2026 / 06:27 PM IST

భూ రీ సర్వే పనులను పరిశీలించిన జేసీ

W.G: భీమవరం మండలం అనాకోడేరు గ్రామ సచివాలయాన్ని జేసి టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. భూ సంబంధిత పనులను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.

April 9, 2026 / 06:27 PM IST

షెడ్యూల్డ్ కులాల కమిషన్ సమీక్ష సమావేశం

TPT: తిరుపతి కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌తో కలిసి జిల్లా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల అందుబాటు వంటి అంశాలపై చర్చించారు.

April 9, 2026 / 06:26 PM IST

రాజంపేటలో ప్రతి నెల ఉచిత వైద్యం, జాబ్ మేళా

అన్నమయ్య: రాజంపేటలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తామని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రకటించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ నెల 16న పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోగుల కోసం రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు.

April 9, 2026 / 06:25 PM IST

ఘనంగా హిందీ సాహిత్య మహోత్సవం

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొని, హిందీ భాష అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.

April 9, 2026 / 06:23 PM IST

నూతన రహదారుని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: కలిదిండి మండలం మూలలంక నుంచి పెద్దలంక ప్రధాన రహదారినీ గురువారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. 2 కోట్ల రూపాయిల నిధులుతో నాలుగు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించిన BT రోడ్డును ప్రారంభించారు. మిగిలిన 1.5 కిలోమీటర్ల రోడ్డును BT రోడ్డుగా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

April 9, 2026 / 06:23 PM IST