• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బీఆర్‌ నాయుడును పదవి నుంచి తప్పించాలి’

ATP: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. చిన్మయనగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. లడ్డూ విషయంలో నివేదికలున్నా సీఎం చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేసి అపచారం చేశారని మండిపడ్డారు.

April 5, 2026 / 10:45 AM IST

సమాధుల తోటను అలంకరిస్తున్న క్రైస్తవులు

పల్నాడు: పెదకూరపాడులో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని సమాధుల తోటలను పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే తమ పితరుల సమాధుల వద్ద అగరవత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. సుదూర ప్రాంతాల్లో నుంచి స్వగ్రామాలకు చేరుకొని సమాదుల తోటలో కొంత సమయం గడిపి తమ పితరులతో జ్ఞాపకాలను పంచుకున్నారు. కాగా నజరేయుడైన ఏసు పునరుద్దానుడై మూడవరోజు తిరిగి లేచాడని వారి నమ్మకం.

April 5, 2026 / 10:43 AM IST

ప్రజాస్వామ్యవాది బాబు జగ్జీవన్ రామ్: నంబూరు

పల్నాడు: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, ప్రజాస్వామ్యవాదిగా పేరు గడించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించారు.

April 5, 2026 / 10:40 AM IST

ఘనంగా జగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు

కోనసీమ: మండపేట ఏడిద కొత్తపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జడ్పీటీసీ కురిపూడి భవాని రాంబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీ హరిబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.

April 5, 2026 / 10:40 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: DIG

KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్‌ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 10:40 AM IST

ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం ఆయన కృషి చేశారన్నారు.

April 5, 2026 / 10:30 AM IST

ములుకుదురులో రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని కారు ధ్వంసం

గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ములుకుదురు సమీపంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు దెబ్బతినగా,  రెండు వాహనాల్లో ఉన్న పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

April 5, 2026 / 10:27 AM IST

భక్తిశ్రద్ధలతో సిఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు

ATP: గుత్తిలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొంది మానవాళి పాపాల్ని క్షమించడానికే భూమిపై మళ్లీ అవతరించారని పేర్కొన్నారు. ప్రేమ, సహనం, శాంతిని పంచిన కరుణామయుడు యేసుక్రీస్తు అని, ఆయన ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. ఈస్టర్‌డే వేడుకలు సందర్భంగా చర్చిని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

April 5, 2026 / 10:19 AM IST

కలెక్టరేట్‌ను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

కాకినాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్‌ను శనివారం సాయంత్రం పిఠాపురం మాజీ MLA వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వర్మ తెలిపారు. 

April 5, 2026 / 10:15 AM IST

రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

CTR: విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి డివిజన్ పరిధిలో ప్రత్యేక అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ అదాలత్ రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించబడనుంది. వినియోగదారులు తమ సమస్యలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బిల్లుల వివాదాలు, కనెక్షన్ సమస్యలు, మీటర్ లోపాలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు.

April 5, 2026 / 10:15 AM IST

ప్రత్యేక హోదా లేకుండానే రాజధాని సంబరాలా..?

TPT: ప్రత్యేక హోదా సాధించలేని కూటమి నాయకులు అమరావతి రాజధాని చట్టబద్ధతపై సంబరాలు జరపడం విచిత్రమని సీనియర్ రాజకీయ నాయకుడు డా. వి.పి. కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హోదా హామీ నెరవేర్చలేకపోయారని, హోదా వల్లే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

April 5, 2026 / 10:14 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

ఎన్టీఆర్: విజయవాడ వన్ టౌన్ ఎస్ఐ భాగ్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన మద్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు. రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 5, 2026 / 10:07 AM IST

పరువు హత్య కేసు ప్రభావం.. మాచర్ల పోలీసుల్లో ఆందోళన

గుంటూరు: పరువు హత్య కేసు నేపథ్యంలో మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెండ్ కావడంతో పోలీసు సిబ్బందిలో కలవరం నెలకొంది. బాధిత కుటుంబం వద్ద డబ్బుల వ్యవహారంలో హోంగార్డు, హెడ్ కానిస్టేబుల్ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తదుపరి చర్యలు తమపై పడతాయేమోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

April 5, 2026 / 10:03 AM IST

వడ్లపూడి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 10:03 AM IST

అమరావతి నిర్ణయానికి దీపోత్సవం

KRNL: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఆలూరులో ‘ఇంటింటికీ దీపోత్సవం’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని ఇంఛార్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 10:02 AM IST