ATP: గుత్తిలోని సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలను నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొంది మానవాళి పాపాల్ని క్షమించడానికే భూమిపై మళ్లీ అవతరించారని పేర్కొన్నారు. ప్రేమ, సహనం, శాంతిని పంచిన కరుణామయుడు యేసుక్రీస్తు అని, ఆయన ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు. ఈస్టర్డే వేడుకలు సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.