• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అలిపిరిలో భారీగా డ్రోన్ కెమెరాల పట్టివేత

TPT: అలిపిరిలో డ్రోన్, స్పై కెమెరాల పట్టివేత 2026లో గణనీయంగా పెరిగింది. జనవరిలో 47 డ్రోన్లు, 13 స్పై కెమెరాలు, ఫిబ్రవరిలో 19 డ్రోన్లు, 14 స్పై కెమెరాలు, మార్చిలో 19 డ్రోన్లు, 14 స్పై కెమెరాలు పట్టుబడ్డాయి. ఏప్రిల్ 2026 వరకు 7 డ్రోన్లు, 9 స్పై కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద 243 డ్రోన్ కెమెరాలు, 94 స్పై కెమెరాలు పట్టుబడటం గమనార్హం.

April 11, 2026 / 12:47 PM IST

జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

VSP: పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని జిల్లా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఇవాళ గ్రీన్ పార్క్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యతో అసమానతలు తొలగుతాయని విశ్వసించిన దూరదృష్టి గల నాయకుడని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

April 11, 2026 / 12:45 PM IST

ఈ నెల 25 నుంచి SVU సెమిస్టర్ పరీక్షలు

CTR: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరధిలో M.A, M.Com, M.Sc, M.Ed, MLisc నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 13వ తేదీ లోపు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

April 11, 2026 / 12:42 PM IST

ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం మట్కా రాస్తున్న షేక్ మౌలాలి, సురేశ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మట్కా చీటీలు, రూ.3,100లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు 3-టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి,మాదకద్రవ్యాలు జోలికి వెళితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

April 11, 2026 / 12:40 PM IST

గుమ్మలక్ష్మీపురంలో ధ్వజస్తంభ ప్రతిష్ట

PPM: గుమ్మలక్ష్మీపురంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేదమంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

April 11, 2026 / 12:37 PM IST

చీరాలలో పేదలకు అల్పాహారం పంపిణీ

BPT: చీరాల పట్టణంలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు, రిక్షా కార్మికులకు, భిక్షాటన చేస్తున్న వారికి ప్రతి నెల రెండవ శనివారం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సామాజిక కార్యకర్త ఆర్‌కే శీలంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని పేదలకు స్వయంగా అల్పాహారం పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

April 11, 2026 / 12:33 PM IST

మాచర్లలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన

PLD: మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో MSR ఇండస్ట్రియల్ పార్క్ నూతన నిర్మాణాలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ అభివృద్ధికి ఇది ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని, పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 11, 2026 / 12:30 PM IST

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

ELR: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా  జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు . పూలే సేవలను స్మరించుకుంటూ వారి ఆలోచనలు, సమాజ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.

April 11, 2026 / 12:29 PM IST

జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

AKP: మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా విద్యను ప్రోత్సహించినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఇవాళ అనకాపల్లి భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతిరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

April 11, 2026 / 12:22 PM IST

ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీస్ బెటాలియన్‌లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అసిస్టెంట్ కమాండ్ కె.వెంకటప్ప జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

April 11, 2026 / 12:19 PM IST