KRNL: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ జిల్లాలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారన్నారు.
W.G: భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గత 24 గంటల్లో 47 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన 554 క్వార్టర్ బాటిళ్లు, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
PLD: ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామంలో మంగళవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారుల అభివృద్ధి, పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పీ.రత్నం, ఎంపీపీ వీర భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
NTR: నందిగామ పట్టణం అనాసాగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రంను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రయాణికులు, సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి చలివేంద్రాలు వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీరుస్తాయని తెలిపారు.
నంద్యాల పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ కళాశాలలో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.జి.జోగినాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేశారు. అలాగే, యువత ఆయన ఆశయాలను ఆచరించాలని సూచించారు.
CTR: కుప్పం(M) కంగుందిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వాలీబాల్ టోర్నీను MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని, క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమన్నారు. అయితే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మునిరత్నం సూచించారు.
GNTR: తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, పలు విభాగాల అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. దేశానికి గొప్ప రాజ్యాంగమును అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు.
PPM: జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన పార్వతీపురం మండలం బాగుడభ గ్రామానికి చెందిన అథ్లెట్ గోవింద్‌కు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అండగా నిలిచారు. ఢిల్లీలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటిన గోవింద్, నేపాల్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులు ఇలాంటి శిఖరాలను అధిరోహించడం గర్వకారణమని ఆయన కొనియాడారు.
VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖలోని డాబాగార్డెన్స్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శకులైన అంబేద్కర్ ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో ఇవాళ గ్రామసభను ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలువురు గ్రామంలో సమస్యలను ప్రస్తావించారు. వెంటనే ఆమె స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ELR: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా.బీ.ఆర్ అంబేద్కర్ అని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యంగంలో మనందరికీ కల్పించిన హక్కులేనని జేసీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
VZM: డెంకాడ మండలం దొడ్డి బాడువ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
TPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరైయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, తదితర నాయకులు పాల్గొన్నారు.