• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వామి వారి పరుష వేలం ద్వారా రూ.1.49 లక్షలు

CTR: పుంగనూరు శ్రీమాణిక్య వరదరాజస్వామి రథోత్సవ పరుష వేలంపాట డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం సమక్షంలో సోమవారం జరిగింది. ఈ వేలంపాటలో పట్టణానికి చెందిన గంగాధర్ రూ.1,49,000కు పాడి దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. పాటదారులు నిబంధనల ప్రకారం సక్రమంగా ఆవులు పరషను నిర్వహించాలని సూచించారు.

April 20, 2026 / 04:00 PM IST

ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు

 ASR: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అనంతగిరి మండలంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో చిలకలగెడ్డ గ్రామంలో కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులగా మలిచి చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

April 20, 2026 / 04:00 PM IST

అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే భోజనం

GNTR: సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు–పల్నాడు బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేసి ప్రజలతో ముచ్చటించారు. నారా భువనేశ్వరి పేదల పట్ల చూపుతున్న సేవా తత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆమె అన్నారు.

April 20, 2026 / 03:56 PM IST

పేదలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలతో కలిసి భోజనం చేశారు. ముందుగా పేద ప్రజలతో కలిసి చీరాల అన్న క్యాంటీన్‌లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు ఉచితంగా భోజనం వడ్డీంచి వారితో పాటు కలిపి ఎమ్మెల్యే భోజనం చేశారు. అలాగే అన్న క్యాంటీన్ నిర్వహణను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

April 20, 2026 / 03:56 PM IST

ప్రొద్దుటూరులో కొత్త కోర్టుల ప్రారంభం

KDP: ప్రొద్దుటూరులో VIII అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టులను జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ బాలాజీ మేడమల్లి, జిల్లా న్యాయమూర్తి డా. యామిని, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో సర్వమత గురువులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

April 20, 2026 / 03:54 PM IST

వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన గదుల నిర్మాణం

ప్రకాశం: తర్లుపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం వాణిజ్య గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ గదులను గాయం వెంకట రామిరెడ్డి, సీతా మహాలక్ష్మమ్మ దంపతుల గుర్తుగా వారి కుమార్తెలు నిర్మిస్తున్నారు.

April 20, 2026 / 03:46 PM IST

బసవేశ్వరుల జయంతిని నిర్వహించిన కలెక్టర్

నంద్యాల: బసవేశ్వరుల ఆలోచనలను ఆచరణలో అమలు చేసి సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడాలని కలెక్టర్ జీ. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం మహాత్మా బసవేశ్వరుల 893వ జయంతి వేడుకల సందర్భంగా, ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల అర్పించి పుష్పాంజలి ఘటించారు. సమాజంలో సమాన హక్కులు, న్యాయం, ధర్మం స్థాపన కోసం ఆయన చేసిన కృషీ అపారమైందన్నారు.

April 20, 2026 / 03:45 PM IST

బాపులదొడ్డిలో తాగునీటి కష్టాలు.!

KRNL: పెద్దకడబూరు మండలం బాపులదొడ్డిలో తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామ శివారుల్లోని పొలాల్లోని బోర్ వద్దకు తోపుడు బళ్లతో వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బాపులదొడ్డి గ్రామ ప్రజలు గుక్కెడు మంచినీళ్ళు కోసం ఇన్ని కష్టాలు పడుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడన్నట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

April 20, 2026 / 03:42 PM IST

పామర్రులో భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్‌ ప్రారంభం

కృష్ణా: పామర్రులో జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.2.30 కోట్లతో నిర్మించిన భారీ నీటి సరఫరా ప్రాజెక్ట్‌ను MLA వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. గంగానమ్మ గుడి వద్ద 1.50 లక్షల లీటర్ల ట్యాంక్, పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.2.80 లక్షలతో పంప్‌హౌస్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌తో గ్రామస్తుల తాగునీటి సమస్యలు పూర్తిగా తొలగుతాయని పేర్కొన్నారు.

April 20, 2026 / 03:41 PM IST

ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కలెక్టర్

PDL: కలెక్టర్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు. వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. 11 గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రజలెవరు బయట రావద్దని ఆమె తెలిపారు. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా ఎండ తీవ్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

April 20, 2026 / 03:38 PM IST

రేపు సింహాద్రిపురంలో మండల సర్వసభ్య సమావేశం

KDP: సింహాద్రిపురంలో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. సమావేశాన్ని ఎంపీడీఓ కార్యాలయం సభ భవనంలో ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయి అన్ని శాఖల అధికారులు వారి శాఖల వివరాలతో హాజరు కావాలన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

April 20, 2026 / 03:38 PM IST

బాపట్లలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

బాపట్లలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సోమవారం ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ రాజు సహకారంతో, స్థానిక టీడీపీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

April 20, 2026 / 03:35 PM IST

‘పాలిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

ATP: ఈనెల 25న జరగనున్న పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌వో ఎ. మాలోల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 31 కేంద్రాల్లో 9,745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.

April 20, 2026 / 03:30 PM IST

కొవ్వూరులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

E.G: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశిష్ లాల్ కొవ్వూరులోని ఆయన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ నవనిర్మాణ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.

April 20, 2026 / 03:30 PM IST

‘పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలి’

CTR: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో జనసైనికులు పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం పుంగనూరులో గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయం వద్ద 101 టెంకాయలు కొట్టి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

April 20, 2026 / 03:30 PM IST