• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి జిల్లాలో స్వయ గణన కార్యక్రమం

ATP: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారి స్వయ గణన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 15, 2026 / 11:40 AM IST

ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు

BPT: ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సెకండియర్‌లో 75 శాతం, ఫస్టియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 8,358 మంది పరీక్ష రాయగా.. 6,252 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో 8,831 మందికి గానూ 6,361 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరగనున్నాయి. ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.

April 15, 2026 / 11:00 AM IST

రంగంపేటలో పరుగులు తీస్తున్న అభివృద్ధి

E.G: రంగంపేట మండలం ST రాజపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని గ్రామస్తులు హర్షo వ్యక్తం చేశారు. SVS స్కీములో రూ. 83.25 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రూ.30 లక్షలతో 10 సిమెంటు రోడ్లకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ బురద రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని నేడు సమస్యకు పరిష్కారo అయ్యిందని వెల్లడించారు. 

April 15, 2026 / 11:00 AM IST

ఇంటర్ ఫలితాల్లో గుంటూరు హవా..!

GNTR: ఇంటర్ ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్, సెకండియర్‌లలో 88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 30,551 మంది పరీక్ష రాయగా.. 26,856 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో 33,643 మందికి గానూ 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.

April 15, 2026 / 10:54 AM IST

ఇంటర్ రిజల్ట్స్‌లో జిల్లా టాప్

కృష్ణా జిల్లా విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 22,403 మందిలో 20,142 మంది ఉత్తీర్ణులై 90% ఫలితాన్ని సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 21,669 మందిలో 19,952 మంది పాస్ అయ్యి 92% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.

April 15, 2026 / 10:52 AM IST

వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై శివకుమార్

BPT: పిట్టలవానిపాలెం మండలంలోని చిందులు గ్రామంలో బుధవారం ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తదితరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేశారు.

April 15, 2026 / 10:46 AM IST

రాజధాని పేరు స్పెల్లింగ్‌పై ఏపీ సర్కార్ ఆదేశాలు

GNTR: రాజధాని పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు సరైన స్పెల్లింగ్ వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై అన్ని అధికారిక ఉత్తర్వులు, రికార్డుల్లో ‘Amaravati’ అని మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. కొందరు ‘Amaravathi’ అని తప్పుగా రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

April 15, 2026 / 10:39 AM IST

చిట్రెడ్డిపల్లెలో గంగ జాతర

CTR: చిట్రెడ్డి పల్లె గ్రామంలో కన్నుల పండువగా నడివీధి గంగమ్మ జాతర ప్రారంభమైనది. నడి వీధిలో గంగమ్మను అత్యంత సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఇంటి వద్ద నుంచి అష్టదిగ్పాలకులలో వెలసిన అమ్మవార్లకు జంతు బలులు సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామంలో సందడి నెలకొంది.

April 15, 2026 / 10:38 AM IST

గూడెంకొత్త వీధిలో గ్రామసభ

ASR: గూడెంకొత్త వీధి స్థానిక పంచాయతీ కేంద్రంలో గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామాల సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక తీర్మానాలు చేసి త్వరితగతిన పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 15, 2026 / 10:36 AM IST

అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం.. కేసు నమోదు

KDP: కలసపాడు పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సుబహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 8 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 15, 2026 / 10:33 AM IST

స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గం నార్పలలో గ్రామ సంఘ సహాయకులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి 200 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ శక్తి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు ఈ ఫోన్లు దోహదపడతాయని వివరించారు.

April 15, 2026 / 10:30 AM IST

పత్తికొండలో బైక్ ర్యాలీ నిర్వహించిన CITU నాయకులు

NDL: నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్తికొండలో CITU ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ.. 17న నంద్యాలలో భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని, ఈ మహాసభల్లో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విభజన పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 15, 2026 / 10:29 AM IST

మంత్రి జనార్ధన్ రెడ్డితో కోటంరెడ్డి సోదరులు భేటీ

నెల్లూరుకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేశారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు వారు పేర్కొన్నారు.

April 15, 2026 / 10:24 AM IST

జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్

NLR: YS జగన్ కొద్దిసేపటి క్రితం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్‌కు చేరుకున్నారు. కాగా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి జగన్ బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు పయనమయ్యారు.

April 15, 2026 / 10:24 AM IST

పరిశుభ్రత పాటించకపోతే చర్యలు తప్పవు

BPT: కర్లపాలెం మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాసరావు బుధవారం పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం స్థానిక చికెన్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు. మాంసం వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పారవేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

April 15, 2026 / 10:23 AM IST