CTR: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శమని పేర్కొన్నారు.
ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
BPT: జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఇవి కొనసాగుతాయి. మొదటి రోజు అగ్నిమాపక కేంద్రంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ కే.వినయ్ అగ్ని ప్రమాద నివారణ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం పాటు జిల్లా వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని తెలిపారు.
SKLM: భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, అణగారిన వర్గాల హక్కులను కాల రాశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.
AKP: ఎలమంచిలి అగ్నిమాపక కేంద్రంలో వారోత్సవాలను మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
E.G: కోరుకొండ మండలం రాఘవపురంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు. సమానత్వ దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటామని తెలిపారు. సామాజిక న్యాయం, మహిళా హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
GNTR: వేసవి కాలం వచ్చీ రాగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తెనాలిలో ఉదయం నుండే ఎండ తీవ్రత అధికంగా ఉంటూ మధ్యాహ్నానికి తారా స్థాయికి చేరి వీధులన్నీ నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఎండ వేడి తట్టుకోలేక ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
PLD: వినుకొండలో మంగళవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న నాగరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు కారం చల్లి దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
W.G: ఆకివీడులో అగ్నిమాపక వారోత్సవాలను ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి జీ. వెంకటేశ్వరరావు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
NLR: ఉదయగిరి మండల పరిధిలోని 17 పంచాయతీల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీడీవో ఎస్.మోహన్ రావు ఇవాళ గ్రామసభలు నిర్వహించారు. మండల పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో పంచాయతీలు కేటాయించిన ఆర్థిక నిధుల పనులు చేపట్టే విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
TPT: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన భక్తుడు కొవ్వూరి రామ్ దీప్ రెడ్డి టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు దాతను అభినందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
E.G: భారత రత్న Dr. B.R. అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి 108 ప్రధాన కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి జిల్లా ప్రజలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 సిబ్బంది, కొవ్వూరు నియోనేటల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో విశేషమైన ఆర్థిక పురోగతిని సాధించిందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 22 కోట్ల రూపాయల ప్రొవిజనల్ లాభాలను నమోదు చేసిందని, గత ఏడాది ఇది కేవలం 7 కోట్లకు మాత్రమే పరిమితమైందన్నారు.
SKLM: పలాస మున్సిపాలిటీలో ఉన్న అగ్నిమాపక ఆఫీసులో అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు. మంగళవారం అగ్ని మాపక వారోత్సవాలను MLA ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
KRNL: దేవనకొండ మండల కేంద్రానికి చెందిన మాదిగ సంపత్ (23) వడదెబ్బతో మరణించారు. నిన్న అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు యువకుడి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.