• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి!

KRNL: ఆదోని (M) పాండవగల్లు శివారులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేకల్లుకు చెందిన యువకులు బైకుపై ముందు వెళ్తున్న ఆటోను క్రాస్ చేసే క్రమంలో ఢీకొట్టారు. ప్రమాదంలో మహేంద్ర అక్కడికక్కడేమృతి చెందగా, వీరేశ్, ఆటోలో ఉన్న మరో వ్యక్తి ఆదోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై పెద్దతుంబళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

May 29, 2026 / 10:27 PM IST

డీఎస్సీపై CBI విచారణ జరిపించాలి: చెల్లుబోయిన

E.G: మెగా డీఎస్సీపై CBI విచారణ జరిపించాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దగా డీఎస్సీపై విద్యార్థి పోరులో భాగంగా YSRCP విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రబాబు చేతిలో దగా పడ్డ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు.

May 29, 2026 / 10:00 PM IST

ప్రారంభంకానున్న గంగమ్మతల్లి జాతర

అన్నమయ్య: రాయచోటి సమీపంలోని గాలివీడు రోడ్డు, మాండవ్య నది ఒడ్డున వెలసిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుణాల మహోత్సవాలు ఈ నెల 30, 31 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. 30వ తేదీన మంత్రోచ్ఛారణలు, మంగళహారతి, మహాస్నపనము, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే 31వ తేదీన కుంభము, మహిషాసుర వధ, భారీ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

May 29, 2026 / 09:39 PM IST

జూన్ నుంచి ఇంటింటి సర్వే: కలెక్టర్

NTR: విజయవాడలో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సన్నద్ధత సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల పేర్లు చేర్చడం జరుగుతుందన్నారు.

May 29, 2026 / 09:36 PM IST

‘నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలి’

కడప నగరంలోని బుగ్గ వంక పరివాహక ప్రాంతంలో 5 ఏళ్ల సయ్యద్ యూసఫ్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. షామీరియా బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడిని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

May 29, 2026 / 09:33 PM IST

బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

VZM: ఎల్.కోట మండల గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో ఉన్న 270 మందికి బూత్ లెవెల్ శిక్షణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

May 29, 2026 / 09:31 PM IST

కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జె. వెంకటలక్ష్మి శుక్రవారం తెలిపారు. BA హిస్టరీ, B.COM కంప్యూటర్స్, బీ.ఎస్సీ కంప్యూటర్ సైన్స్, జువాలజీ, మ్యాథమెటిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబ్స్ ఉన్నాయని తెలిపారు.

May 29, 2026 / 09:30 PM IST

కూటమి ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

ELR: పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ. 15 లక్షలు వసూలు చేశారని, అభ్యర్థుల మార్కులను కూడా రహస్యంగా ఉంచారని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

May 29, 2026 / 09:27 PM IST

అక్రమ లాటరీ విక్రేతలకు పోలీసుల కౌన్సెలింగ్

CTR: చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతంలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయాలకు పాల్పడి కేసులు నమోదైన 18 మందికి చిత్తూరు ఎస్‌డీపీవో జె.వెంకటనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమ లాటరీలు చట్ట వ్యతిరేకమని, మళ్లీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.

May 29, 2026 / 09:26 PM IST

పీజీ సెట్‌లో సత్తాచాటిన తణుకు విద్యార్థి

W.G: ఇటీవల విడుదలైన ఏపీ పీజీ సెట్ ప్రవేశ పరీక్షలో తణుకు పట్టణానికి చెందిన గుబ్బల శిరీష రాష్ట్రస్థాయిలో 50వ ర్యాంకు సాధించింది. తణుకు మారుతీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఆమె ఈ ఘనత సాధించినట్లు కళాశాల ఛైర్మన్ ఎస్.వి.వి.సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.కనకయ్య తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

May 29, 2026 / 09:25 PM IST

వైభవంగా చిత్రకళా ప్రదర్శన ప్రారంభం

VSP: ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు రూపొందించిన ‘రెసినంట్ స్పేసెస్’ వార్షిక చిత్రకళా ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ చిత్రకారులు, పూర్వ ఆచార్యులు వి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. కళాకారులు సమాజానికి కొత్త ఆలోచనలు అందించాలని, విద్యార్థుల చిత్రాలు, శిల్పాలు వారి ప్రతిభకు అద్దం పడుతున్నాయన్నారు.

May 29, 2026 / 09:24 PM IST

గిరిజనుల పరిష్కార వేదికకు 11 అర్జీలు

PPN: గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 11 అర్జీలు అందాయని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎ.విజయశాంతి తెలిపారు. శుక్రవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం లోని ‘గిరిమిత్ర’ హాల్‌లో గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల సమస్యలను తమ దృష్టికి తీసుకువెళ్ళారు.

May 29, 2026 / 09:10 PM IST

‘యూరియా సరఫరాలో కొరత లేదు’

KRNL: జిల్లాలో యూరియా సరఫరాలో కొడతాలేదని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారిణి పి.ఎల్. వరలక్ష్మి ఓర్వకల్ మండలంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువుల అమ్మకాలకు సంబంధించిన స్టాక్ పుస్తకాలు, బిల్లు పుస్తకాలను సరిచూశారు. అలాగే ఇ-పోస్ అమ్మకాలు, బిల్ బుక్‌లో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదన్నారు.

May 29, 2026 / 09:08 PM IST

ఏజెంట్ మోసం.. దుబాయ్‌లో దినస్థితిలో బాధితులు

WG: ఆచంట, పెనుగొండ మండలాల నుంచి ఆరు నెలల క్రితం ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లిన 20 మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయిస్తూ.. వేధిస్తున్నారని బాధితులు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి రావాలంటే రూ.1 లక్ష కట్టాలని ఏజెంట్ డిమాండ్ చేస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.

May 29, 2026 / 09:06 PM IST

అర్ధవీడులో SIRపై బూత్ ఏజెంట్లకు అవగాహన సదస్సు

ప్రకాశం: అర్ధవీడు మండలంలో గౌరవ ఇంఛార్జి కె.పి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు SIR కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలనపై వివరించారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడూరి వెంకట్ రావు, మాజీ ఎంపిపి నన్నెబోయిన రవి కుమార్, మండల కన్వీనర్ పాల్గొన్నారు.

May 29, 2026 / 09:03 PM IST