• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రత్యేక అభిషేకం, పూజలు, ఆరాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఇంఛార్జ్ చిట్టిబాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.

April 22, 2026 / 10:00 PM IST

‘అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం’

తిరుపతిలోని అన్న క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి సిబ్బందిని ఆదేశించారు. స్విమ్స్ కూడలి వద్ద ఉన్న క్యాంటీన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం చేస్తున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఒక్కొక్కరికి ఒక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు.

April 22, 2026 / 10:00 PM IST

వైసీపీకి షాక్.. టీడీపీలోకి 16 మంది చేరికలు

NLR: పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీకి చెందిన 16 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి, రమణారెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వారు చేరుతున్నారని తెలిపారు.

April 22, 2026 / 09:44 PM IST

అద్దంకిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: అద్దంకి పట్టణంలోని కొత్త దామవారి పాలెం, నామ్ రహదారి తూర్పు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు DEE ఎం.దామోదర్ తెలిపారు. నరసరావుపేట రోడ్డు విద్యుత్ కార్యాలయం నుంచి భవాని సెంటర్ వరకు కొత్తగా వేసిన టవర్ల పైకి లైన్లు లాగే పనుల కారణంగా.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

April 22, 2026 / 09:32 PM IST

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

GNTR: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (90) బుధవారం కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని జూబిలీహిల్స్ నివాసంలో ఉంచనున్నారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన 1935లో గుంటూరులో జన్మించారు.

April 22, 2026 / 09:31 PM IST

కూలిపోయిన కల్వర్టు.. రాకపోకలకు అంతరాయం

AKP: ఎలమంచిలి మండలం పులపర్తి కృష్ణాపురం గ్రామాల మధ్య కల్వర్టు దెబ్బతింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజుల కిందట కల్వర్టుకు రంద్రం పడింది. దానిని పట్టించుకోకపోవడంతో బుధవారం సాయంత్రం పూర్తిగా కూలిపోయింది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొత్త కల్వర్టు నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

April 22, 2026 / 09:24 PM IST

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

SKLM: కవిటి మండలం ఆర్.బెలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సోంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్సై బైరాగి ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని హెచ్చరించారు.

April 22, 2026 / 09:14 PM IST

ఆటో స్టాండ్ లేక RTC కాంప్లెక్స్..?

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డదిడ్డంగా ఆటోలను నిలుపుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా లోపలికి వెళ్లేందుకు మార్గం లేక నానాఅవస్థలు పడాల్సిన పరిస్థితి ఉందని, అంతా మాఇష్టం అన్నట్టుగా ఆటోవాలాలు ప్రవర్తన ఇబ్బందిని కలిగిస్తోందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

April 22, 2026 / 09:13 PM IST

మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత తీవ్ర వ్యాఖ్యలు

SS: వైసీపీ క్రూరత్వానికి మరో బీసీ వ్యక్తి బలి అయ్యాడని మంత్రి సవిత ధ్వజమెత్తారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దస్తగిరిని అడ్డం పెట్టుకుని భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు, ఇప్పుడు అతడిని ప్రాణాలతో బలి తీసుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం సొంత బాబాయిని, నమ్ముకున్న వారిని చంపడం జగన్ నైజమని విమర్శించారు.

April 22, 2026 / 09:09 PM IST

రాయచోటిలో బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి

అన్నమయ్య: రాయచోటిలోని రాజీవ్ స్వగృహలో రు.1.31 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రు.70 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

April 22, 2026 / 09:08 PM IST

బెట్టింగులకు పాల్పడితే చర్యలు: CI మురళీ

TPT: సత్యవేడులోని యువత, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీఐ మురళి బుధవారం పలు కీలక సూచనలు జారీ చేశారు. ఐపీఎల్ నేపథ్యంలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్ల వైపు మళ్లుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది యువకులు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఐ తెలిపారు. ఇటువంటి చర్యలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

April 22, 2026 / 09:00 PM IST

‘జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించాలి’

ఏలూరు జిల్లాలో రహదారి ప్రమాదాలు పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ రహదారి భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద చర్యలు తీసుకోవడం, జాతీయ రహదారులపై ఆక్రమణలను తొలగించాలన్నారు.

April 22, 2026 / 09:00 PM IST

‘ఓటర్ల జాబితా పారదర్శకతకు సహకరించాలి’

SKLM: ఓటర్ల జాబితా పారదర్శకతకు రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్వో విశ్వేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో అత్యంత పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని అన్నారు.

April 22, 2026 / 08:51 PM IST

చందనోత్సవం విజయవంతం.. సిబ్బందికి అభినందనలు

VSP: సింహాచలం చందనోత్సవం విజయవంతంగా ముగియడంతో ఈవో జె. వెంకట్రావు సిబ్బందిని అభినందించారు. అందరూ సమన్వయంతో పనిచేయడం వల్లే భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించగలిగామని తెలిపారు. ఇదే ఉత్సాహంతో గిరి ప్రదక్షిణను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

April 22, 2026 / 08:50 PM IST

30 ఏళ్ల ఆక్రమణకు చెక్.. తహసీల్దార్‌కు అభినందనలు

GNTR: తెనాలి బుర్రిపాలెం గ్రామ కంఠంలో ప్రభుత్వ భూమిపై 30 సంవత్సరాలుగా ఉన్న ఆక్రమణను తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 21-04-2026న తొలగించారు. ఈ చర్యపై గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు తహసీల్దార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల కృషితో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

April 22, 2026 / 08:47 PM IST