• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు’

E.G: మహిళా బిల్లు రాకపోవడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పడం తగదని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని చెబుతున్నామన్నారు. అంతకుముందు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతానంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.

April 23, 2026 / 12:20 PM IST

తాడిగడపలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో శ్రీ శ్రీ సాగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహర్షి సందేశాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

April 23, 2026 / 12:09 PM IST

మాజీ సీఎం నాదెండ్లకు ఎమ్మెల్యే నివాళి

NDL: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ HYDలోని నాదెండ్ల నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 23, 2026 / 12:05 PM IST

‘విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదు’

SKLM: విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం.టి. ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు.

April 23, 2026 / 12:03 PM IST

పుస్తక హుండీతో పుస్తకాల సేకరణ

VZM: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంధాలయ సేవా సంఘం పుస్తక హుండీ కార్యక్రమాన్ని స్థానిక R&B జంక్షన్‌లో  నిర్వహించింది. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ప్రజల్లో చైతన్యానికి, మేధో వికాసానికి పుస్తకాలు చదివించే ఆసక్తి పెంచాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. స్పందించిన పలువురు అనేక గ్రంథాలను గ్రంధాలయ సంఘానికి అందజేశారు.

April 23, 2026 / 12:03 PM IST

ఇంధనం కోసం నంద్యాలలో వాహనదారుల క్యూ

NDL: నంద్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధనం కోసం వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అధికారులు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

April 23, 2026 / 12:01 PM IST

‘BRTS బాధితులకు న్యాయం చేయండి’

VSP: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు పాశర్ల ప్రసాద్ శుక్రవారం టీడీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా BRTS బాధితుల సమస్యలను ప్రస్తావిస్తూ, 108 మందికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో TDRలు అందలేదన్నారు. రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు GVMC అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలన్నారు.

April 23, 2026 / 12:00 PM IST

అరటి పంట దగ్ధం.. రైతుకు తీవ్ర నష్టం

KDP: మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో రైతు గురప్పకు చెందిన అరటి పంట దగ్ధమైంది. మూడెకరాల్లో సాగు చేసిన పంటలో ఎకరాన్నర పూర్తిగా కాలి బూడిదైంది. బిందు సేద్య పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు రైతు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.

April 23, 2026 / 12:00 PM IST

చేనేతల దీక్షకు మద్దతు

GNTR: మంగళగిరిలో చేనేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ దీక్షకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు మద్దతు పలికారు. అలాగే మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు కూడా పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.

April 23, 2026 / 12:00 PM IST

పామూరులో ఆక్రమణలు తొలగించాలి: సీఐ

ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్, ఆక్రమణలపై సీఐ వినోద్ కుమార్ దృష్టిసారించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్డు వెంట ఉండే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఉందో గమనించారు. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.

April 23, 2026 / 12:00 PM IST

‘క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి’

KRNL: క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేస్తూ పోటీల్లో సత్తా చాటాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో శాప్ లీగ్ ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సీఈవో రమణ, తదితరులు పాల్గొన్నారు.

April 23, 2026 / 12:00 PM IST

కంభంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కంభంలోని కాపవీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

April 23, 2026 / 11:44 AM IST

ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భారీ విరాళం

సత్యసాయి: కదిరి రూరల్ మండలం మల్లయ్య గారి పల్లిలో శ్రీ శ్రీ రాములు స్వామి గుడి నిర్మాణం కోసం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ.3,60,000 విరాళం అందజేశారు. ఎమ్మెల్యే సతీమణి కందికుంట యశోద దేవి చేతుల నుంచి గ్రామస్థులు ఈ మొత్తాన్ని అందుకున్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

April 23, 2026 / 11:40 AM IST

నోయిడా కార్మికులకు మద్దతుగా ఆందోళన

VSP: నోయిడాలో కనీస వేతనాల అమలుకు పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా గురువారం ఇసుకతోట జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జి.వామనమూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం కార్మికులపై నిర్బంధాలు, కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు అమలు చేయాలని కోరారు.

April 23, 2026 / 11:36 AM IST

కత్తిపోట్లకు దారితీసిన చిన్నపిల్లల గొడవ

కృష్ణా: గుడ్లవల్లేరు(M) అంగలూరులో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్దల వరకు చేరి కిరాతక దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కొందరు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 23, 2026 / 11:35 AM IST